తండ్రి ఎస్పీ బాలుని తలచుకుని కొడుకు చరణ్‌ ఎమోషనల్‌..స్టేజ్‌ మీదే సింగర్‌ సునీత కన్నీళ్లు

Published : Apr 06, 2022, 12:34 PM IST

గాన గాంథర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంని తలచుకుని ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ ఎమోషనల్‌ అయ్యారు. స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. అది చూసిన సింగర్‌ సునీత సైతం కంటతడి పెట్టుకోవడం వైరల్‌ అవుతుంది. 

PREV
16
తండ్రి ఎస్పీ బాలుని తలచుకుని కొడుకు చరణ్‌ ఎమోషనల్‌..స్టేజ్‌ మీదే సింగర్‌ సునీత కన్నీళ్లు

ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం సినీ సంగీత లోకానికి తీరని లోటు. వేలపాటలతో ఇండియన్‌ శ్రోతలను ఒలలాడించారు బాలు. మధురమైన గాత్రంతో ఆడియెన్స్  గుండెల్లో నిలిచిపోయారు. పాటల్లో జీవించే ఉన్నారు. ఆయన కరోనాతో పోరాడి అనంతరం ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో రెండేళ్ల క్రితం చెన్నైలో కన్నుమూసిన విషయం తెలిసిందే. సంగీత లోకాన్ని శోకంలో ముంచేసి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. 

26

ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ సైతం సింగర్‌గా రాణిస్తున్నారు. తండ్రి బాటలోనే పయనిస్తూ బాలు వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. అంతేకాదు తండ్రి నిర్వహించిన పాపులర్‌ సింగింగ్‌ షో `పాడుతా తీయగా` కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన హోస్ట్ గా ఈటీవీలో ఈ కార్యక్రమం రన్‌ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా తండ్రిని తలుచుకుని ఎస్పీ చరణ్‌ ఎమోషనల్‌ అయిన వీడియో వైరల్‌ అవుతుంది. 
 

36

`పాడుతా తీయగా` కార్యక్రమంలోనే సింగర్స్ అద్భుతమైన పాటలతో అలరిస్తున్నారు. అందులో భాగంగా ఓ సింగర్‌ `ప్రియతమా.. ` అనే పాటని పాడుతున్నాడు. దీనిపై ఇంట్రో ఇస్తూ ఎస్పీ చరణ్‌ స్పందించారు. `ముందు ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట.. ఇప్పుడు చాలా కష్టమైన పాట అంటూ బరువెక్కిక గుండెతో మాట్లాడారు.  

46

సింగర్‌ పాడుతున్న ఆ పాటలోని చరణాలను వర్ణిస్తూ.. `శిలలాంటి నాకు జీవాన్ని పోశారు. కళతోని నింపి.. అర్థాలు..` అంటూ తాను చెప్పదలచుకున్న మాటలు రావడం లేదు. దీంతో స్టేజ్‌పైనే భావోద్వేగానికి గురయ్యారు ఎస్పీ చరణ్‌. అక్కడున్న జడ్జ్ లు చంద్రబోస్‌, సునీత సైతం ఎమోషనల్‌ అయ్యారు. చరణ్‌ని ఓదార్చే ప్రయత్నం చేశారు. 

56

అయితే ఇదంతా చూసిన జడ్జ్ గా ఉన్న సింగర్‌ సునీత సైతం ఎమోషనల్‌ అయ్యారు. కంటతడి పెట్టింది. చరణ్‌ మాటల్లో బాలుని గుర్తు చేసుకుని ఆమె కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో ఒక్కసారిగా `పాడుతా తీయగా` షో మొత్తం గుంబనంగా మారిపోయింది. సైలెంట్‌ అయిపోయింది. ఈ వీడియో చూసే ఆడియెన్స్ ని సైతం గుండె బరువెక్కించడం విశేషం.

66

`పాడుతా తీయగా` కార్యక్రమంతో ఎస్పీబాలుకి, సింగర్‌ సునీతకి విడదీయలేని అనుబంధం ఉంది. ఎన్నో ఏళ్లుగా ఈ షోని నిర్వహిస్తూ సక్సెస్‌ చేస్తూ వస్తున్నారు. అదే సమయంలో రియల్‌ లైఫ్‌లోనూ వీరిద్దరు కలిసి అనేక సినిమాల్లో పాటలు పాడారు. గతంలోనూ సింగర్‌ సునీత బాలుని తలచుకుని కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెలిసిందే. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories