Hrithik Roshan: కాలం మారిపోవడం అంటే ఇదే.. గర్ల్ ఫ్రెండ్, మాజీ భార్యతో కలసి హృతిక్ రోషన్ పార్టీ

Published : Apr 06, 2022, 12:01 PM IST

బాలీవుడ్ లో మగువలకు రాకుమారుడు హృతిక్ రోషన్. హృతిక్ రోషన్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై సూపర్ హీరోగా వెలుగొందుతున్నాడు. క్రిష్ సిరీస్ తో హృతిక్ ఇండియా వ్యాప్తంగా అభిమానులని అలరిస్తున్నాడు.

PREV
16
Hrithik Roshan: కాలం మారిపోవడం అంటే ఇదే.. గర్ల్ ఫ్రెండ్, మాజీ భార్యతో కలసి హృతిక్ రోషన్ పార్టీ
Hrithik Roshan

బాలీవుడ్ లో మగువలకు రాకుమారుడు హృతిక్ రోషన్. హృతిక్ రోషన్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై సూపర్ హీరోగా వెలుగొందుతున్నాడు. క్రిష్ సిరీస్ తో హృతిక్ ఇండియా వ్యాప్తంగా అభిమానులని అలరిస్తున్నాడు. సౌత్ లో కూడా హృతిక్ రోషన్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 

26
Hrithik Roshan

ఇదిలా ఉండగా హృతిక్ రోషన్ పర్సనల్ లైఫ్ లో కూడా కొన్ని వివాదాలు, వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి. హృతిక్ రోషన్ 2014లో తన భార్య సుహాన్నే ఖాన్ నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే హృతిక్, సుహాన్నే ఇద్దరూ తమ పిల్లల కోసం తల్లిదండ్రులుగా, స్నేహితులుగా కొనసాగుతున్నారు. 

36
Hrithik Roshan

కానీ భార్య భర్తలుగా తిరిగి కలిసే ఉద్దేశం వీరికి లేదు. దీనితో కొత్త లైఫ్ పార్ట్నర్స్ ని వెతుక్కున్నారు. రీసెంట్ గా హృతిక్ రోషన్ కొత్త రిలేషన్ షిప్ మొదలు పెట్టినట్లు బి టౌన్ లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అది నిజం కూడా.  ఓటిటితో గుర్తింపు పొందిన సబా ఆజాద్ అనే యంగ్ బ్యూటీతో హృతిక్ రోషన్ ప్రస్తుతం రిలేషన్ షిప్ లో ఉన్నాడు. 

46
Hrithik Roshan

అలాగే హృతిక్ మాజీ భార్య సుహాన్నే ఖాన్ కూడా తన లైఫ్ పార్ట్నర్ ని వెతుక్కుంది. ఇంటీరియర్ డిజైనర్ అర్సల్ గోని అనే వ్యక్తితో ఆమె రిలేషన్ షిప్ లో ఉంది. సాధారణంగానే అయితే విడిపోయిన వాళ్లే ఎక్కడైనా ఎదురుపడినప్పుడు ఇబ్బంది పడుతుంటారు. కానీ ఇప్పుడు కాలం మారింది. 

56
Hrithik Roshan

తమ మాజీ పార్ట్నర్ తో స్నేహంగా ఉండడమే కాదు.. ప్రస్తుతం ఉన్న గర్ల్ ఫ్రెండ్ తో కలసి మాజీ భార్యతో ఏకంగా పార్టీలు చేసుకుంటున్నారు. అందుకు ఉందాహరణే హృతిక్ రోషన్ అండ్ సుహాన్నే ఖాన్. హృతిక్ రోషన్.. అతడి ప్రేయసి సబా ఆజాద్.. సుహాన్నే ఖాన్ ఆమె ప్రస్తుత బాయ్ ఫ్రెండ్ అర్సల్ గోని వీరంతా కలసి గోవాలో ఓ పార్టీకి హాజరయ్యారు.  

66
Hrithik Roshan

వినడానికి విడ్డూరంగా అనిపించినా ఇది నిజం. వీరంతా గోవా వెకేషన్ పార్టీకి వెళుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎయిర్ పోర్ట్ లో కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.  

click me!

Recommended Stories