Guppedantha Manasu: తనపై అటాక్ చేసిన వ్యక్తిని పట్టుకున్న రిషి.. ఎమ్మెస్సార్ తో శైలేంద్ర చేతులు కలపనున్నాడా?

Published : May 10, 2023, 10:42 AM IST

Guppedantha Manasu: స్టార్ మాలో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. కన్న కొడుకు కోసం మరిది కొడుకు ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక పెద్దమ్మ కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 10 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
18
Guppedantha Manasu: తనపై అటాక్ చేసిన వ్యక్తిని పట్టుకున్న రిషి.. ఎమ్మెస్సార్ తో శైలేంద్ర చేతులు కలపనున్నాడా?

ఎపిసోడ్ ప్రారంభంలో రిషిని పట్టుకొని ఏడుస్తుంది జగతి. కంగారు పడిపోయిన రిషి ఏం జరిగింది అని అడుగుతాడు. చెప్పకుండా ఏడుస్తున్న జగతితో మీరే అందరికీ ధైర్యం చెప్తారు అలాంటిది మీరే ఏడిస్తే ఏమీ బాగోలేదు అంటాడు రిషి. మీ మీద ఎటాక్ జరిగింది కదా దాని కోసమే భయపడుతున్నట్లున్నారు అంటుంది వసు.
 

28

మీరందరూ ఉన్నారు కదా నాకేం ప్రమాదం ఉంటుంది భయపడకండి అంటాడు రిషి. మహేంద్ర వాళ్ళు కూడా ఎంత నచ్చచెప్పినా కంట్రోల్ అవ్వలేక పోతుంది జగతి. మీరిద్దరూ వెళ్లండి నేను మేడం తో మాట్లాడి ఐదు నిమిషాల్లో కిందికి తీసుకు వస్తాను అని మహేంద్ర రిషి ని కిందికి పంపించేస్తుంది వసు. తరువాత హాల్లో రిషి వాళ్ళు డల్ గా కూర్చోవడం చూసిన దేవయాని ఏం జరిగింది అని అడుగుతుంది.
 

38

అంతలోనే జగతి మేడ మీద నుంచి రావటం గమనించి ఏమైంది ఎందుకు జగతి డల్ గా ఉంది అంటూ తెగ నటిస్తుంది. నామీద అటాక్ జరిగినందుకు మేడం దిగులు పడుతున్నారు అంటాడు రిషి. జగతి దిగులు పడుతుందా.. అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది దేవయాని. ఏం తనకి మనసు ఉండదా? తనకి ఎమోషన్స్ ఉండవా అంటూ గట్టిగా మాట్లాడుతాడు మహేంద్ర.
 

48

మహేంద్ర ని వారిస్తుంది జగతి. నేను బాగానే ఉన్నాను మీరందరూ వెళ్లి పడుకోండి అంటుంది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ మాత్రం భయం ఉండాలి నువ్వు ఇలా ఉంటేనే వాళ్ళు బ్రతికి ఉంటారు అని హెచ్చరిస్తుంది దేవయాని. మరోవైపు కాలేజ్ సిసి టీవీ ఫుటేజ్ అందులో తనని అటాక్ చేసిన వ్యక్తిని గుర్తుపడతాడు రిషి. ఆరోజు మనమీద అటాక్ చేసిన వ్యక్తి అని చెప్పటంతో వసు కూడా గుర్తు పడుతుంది.
 

58

ఈ పని ధర్మరాజు గాని ఎమ్మెస్సార్ గాని చేసి ఉండాలి అంటాడు రిషి. వాళ్లెవరు అంటాడు శైలేంద్ర. స్పాట్ వాల్యుయేషన్ జరిగినప్పుడు సంగతి కిడ్నాప్ జరిగినప్పుడు జరిగిన సంగతి చెప్తాడు రిషి. పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అంటారు మహేంద్ర, ఫణీంద్ర. వద్దు పిల్లల భవిష్యత్తు పాడవుతుంది వాడి సంగతి నేను చూసుకుంటాను అంటాడు రిషి. నువ్వు రిషికి తోడుగా ఉండు అని కొడుక్కి చెప్తాడు ఫణీంద్ర.

68

అసలు తప్పు చేసింది మీ కొడుకని ఎప్పుడు గుర్తిస్తారో ఏంటో అనుకుంటుంది జగతి. మరోవైపు తనని అటాక్ చేసిన వాడిని పట్టుకొని నిజాన్ని తప్పించడానికి ప్రయత్నిస్తాడు రిషి. ఎంత కొట్టిన వాడు నిజం చెప్పడు. శైలేంద్ర కూడా వాడిని బాగా కొట్టి చెవి దగ్గరికి వెళ్లి ఏం జరిగినా నోరు పెట్టొద్దు అని హెచ్చరిస్తాడు. ఇంత కొట్టినా నిజం చెప్పడం లేదంటే వీడికి ఏమీ తెలియదేమో అంటాడు శైలేంద్ర.

78

కాదు వీడు నిజం దాస్తున్నాడు. ఈ ఎటాక్ కచ్చితంగా ఎమ్మెస్సారే చేసి ఉంటాడు వాడి సంగతి నేను చూసుకుంటాను అంటాడు రిషి. సెక్యూరిటీని మరి కొంచెం పెంచు అంటాడు శైలేంద్ర. అక్కర్లేదు మన సెక్యూరిటీ మీద నాకు ఆ నమ్మకం ఉంది అంటాడు రిషి. మరోవైపు ఎమ్మెస్సార్ ని మీట్ అవుతారు శైలేంద్ర, రిషి. అటాక్ చేసింది నువ్వే కదా అంటూ మర్యాద లేకుండా మాట్లాడుతాడు శైలేంద్ర. మర్యాద ఇచ్చి మాట్లాడండి అని కోప్పడతాడు ఎమ్మెస్సార్.
 

88

జరిగిన ఎటాక్ కి నాకు ఏ సంబంధం లేదు. కాలేజీ మీద ఆశపడిన సంగతి నిజమే కానీ రిషి క్యాపబిలిటీ చూసి ఆశ వదులుకున్నాను. అయినా మీకు ఏదో అనుమానం వచ్చిందని ఇలా నిలబెట్టి నిందలు వేయటం ఏమీ బాగోలేదు కావాలంటే లీగల్ గానే ప్రొసీడ్ అవుదాము అంటూ స్ట్రాంగ్ గా మాట్లాడుతాడు ఎమ్మెస్సార్. నిజం చెప్పు అంటూ ఎమ్మెస్సార్ మీదికి ఎటాక్ చేయటానికి వెళ్లబోతాడు రిషి. రిషి ని ఆపి అతని సంగతి నేను చూసుకుంటాను నువ్వు వెళ్లి కారులో కూర్చో అంటాడు శైలేంద్ర. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

click me!

Recommended Stories