ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... ఆహ్వాన పత్రిక పైన తన పేరు వేసినందుకు తులసి ఎంతో ఆనంద పడుతూ ఉంటుంది. ధన్యవాదాలు సామ్రాట్ గారు అని తులసి అనగా, కష్టం మీది, ఫలితం మీది, ప్రయత్నం మీది అని సామ్రాట్ అంటాడు. కానీ డబ్బు, సహాయం మీది ధన్యవాదాలు అని చెప్తుంది. అప్పుడు పరంధామయ్య ఇందులో పేరు రావడానికి సామ్రాటే కారణం అవ్వచ్చు కానీ ఆ పేరు ఎప్పుడూ నిలబెట్టుకోవడంకి బాధ్యత మాత్రం నీదే అని అంటాడు. అంతట్లో తులసి నేను వెంటనే ఇంట్లో వాళ్ళుకు విషయం చెప్తాను అని ఆనందపడుతుంది. ఆ తర్వాత సీన్లో అనసూయ మొక్కలకి నీళ్లు పోస్తూ ఉండగా నందు లాస్యలు అక్కడికి వచ్చి తులసి కోసం అడుగుతారు.