చీరకట్టులో కవ్విస్తూ క్లోజప్ గా పూర్ణ గ్లామర్ అటాక్.. సిట్టింగ్ ఫోజుల్లో అందాల ఘాటుకి ఎంతటివారైనా చిత్తే..

First Published | Aug 26, 2022, 8:26 AM IST

హాట్ బ్యూటీ పూర్ణ టాలీవుడ్ లోకి 'శ్రీ మహాలక్ష్మి' చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. వెండితెరపై పూర్ణ హద్దులు దాటే విధంగా ఎప్పుడూ అందాలు ఆరబోయలేదు. అయితే అవసరమైన మేరకు ఒంపుసొంపులు ఒలకబోసింది.

హాట్ బ్యూటీ పూర్ణ టాలీవుడ్ లోకి 'శ్రీ మహాలక్ష్మి' చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. వెండితెరపై పూర్ణ హద్దులు దాటే విధంగా ఎప్పుడూ అందాలు ఆరబోయలేదు. అయితే అవసరమైన మేరకు ఒంపుసొంపులు ఒలకబోసింది. సీమటపాకాయ్ చిత్రం పూర్ణకి టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. 

ఆ తర్వాత అవును, అవును 2, రాజుగారి గది లాంటి చిత్రాల్లో పూర్ణ మెరిసింది. క్రమంగా పూర్ణకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. కానీ Poorna మాత్రం ప్రత్యామ్నాయం ఎంచుకుంది. 


అవకాశం చిక్కినప్పుడు సినిమాలు చేస్తూనే బుల్లితెరపై పాపులర్ అయింది. ప్రస్తుతం పూర్ణ ఢీ 14 డాన్సింగ్ ఐకాన్ షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది. చిరునవ్వులు చిందిస్తూ షోలో అందరిని ఆకర్షిస్తోంది పూర్ణ. 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూర్ణ తరచుగా తన గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. తనలో గ్లామర్ పదును ఇంకా తగ్గలేదని ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉంది. చీరకట్టుతో పాటు.. ఇతర ట్రెండీ డ్రెస్సుల్లో కూడా పూర్ణ హాట్ స్టిల్స్ తో అదరగొడుతోంది . 

తాజాగా పూర్ణ బ్లూ శారీలో వయ్యారంగా గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ పిచ్చెక్కిస్తోంది. సిట్టింగ్ ఫోజుల్లో పూర్ణ యమా హాట్ గా ఇస్తున్న లుక్స్ యువతకి కనుల విందు చేస్తున్నాయి. 

పూర్ణ బొద్దుగా ఉంటూ యువత మైండ్ బ్లాక్ అయ్యే విధంగా గ్లామర్ వెదజల్లుతోంది. పైట చాటు దాగున్న అందాలు చూపించి చూపించినట్లుగా పూర్ణ ఊరిస్తోంది. ఆమె సిట్టింగ్ ఫోజులో వయ్యారాలు ఒలికిస్తూ విరహ వేదన అనుభవిస్తోంది. 

అందరి హీరోయిన్ల లాగే పూర్ణపై కూడా కొన్ని రూమర్స్ ఉన్నాయి.  చిత్ర పరిశ్రమలో దర్శకులు, హీరోలు, హీరోయిన్లపై రూమర్లు సహజంగానే పుట్టుకొస్తుంటాయి. రవిబాబు దర్శకత్వంలో హీరోయిన్ పూర్ణ మూడు చిత్రాల్లో నటించింది. అవును, అవును 2, లడ్డుబాబు చిత్రాల్లో రవిబాబు.. పూర్ణకు అవకాశం ఇచ్చారు. 

దీనితో వీరిద్దరి మధ్య ఎఫైర్ సాగుతోందని.. Poorna పై ఇష్టంతోనే ఆమెకు అన్ని అవకాశాలు ఇచ్చారు అంటూ రవిబాబుపై వార్తలు వచ్చాయి. వీరిద్దరూ జోరుగా ప్రేమాయణం సాగిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలని రవిబాబు ఖండించారు. అవన్నీ అవాస్తవాలు అని, షూటింగ్ పూర్తయ్యాక హీరోయిన్లకు తనకు సంబంధం ఉండదని తేల్చి చెప్పారు. 

ఇదిలా ఉండగా పూర్ణ గత ఏడాది దృశ్యం 2, అఖండ చిత్రాల్లో మెరిసింది. ఈ రెండు చిత్రాలు ఘన విజయం సాధించాయి. ప్రస్తుతం పూర్ణ నాని దసరా చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. 

Latest Videos

click me!