Published : Nov 12, 2022, 10:54 AM ISTUpdated : Nov 12, 2022, 11:05 AM IST
స్టార్ కిడ్ సారా అలీ ఖాన్ తరచుగా ఎఫైర్ రూమర్స్ తో వార్తల్లో ఉంటారు. పరిశ్రమకు వచ్చి పట్టుమని ఐదేళ్లు కాలేదు, చాలా మంది అబ్బాయిలతో ఆమె డేటింగ్ చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. తాజాగా ఆమె కన్ను టాలీవుడ్ హ్యాండ్ సమ్ విజయ్ దేవరకొండ పై పడింది.
విజయాలతో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండకు బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన్ని ఇష్టపడే యంగ్ హీరోయిన్స్ ఎందరో ఉన్నారు. ఈ లిస్ట్ లో సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ ముందు ఉంటారు. వీరిద్దరూ పలుమార్లు విజయ్ దేవరకొండ పట్ల తమ ఇష్టాన్ని తెలియజేశారు.
27
Sara Ali Khan
సారా అలీ ఖాన్ ఒకటి రెండు ఇంటర్వ్యూలలో విజయ్ దేవరకొండ తన ఫేవరెట్ హీరో అన్నారు. అవకాశం వస్తే అతనితో నటించడానికి, డేటింగ్ చేయడానికి సిద్ధం అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. ఇటీవల కాఫీ విత్ కరణ్ సీజన్ 7 లో జాన్వీ, సరా అలీ ఖాన్ కలిసి పాల్గొన్నారు. మీరు డేటింగ్ చేయాలనుకుంటున్న హీరో ఎవరనగా... ఇద్దరూ విజయ్ దేవరకొండ పేరు చెప్పారు.
37
Image: Sara Ali Khan/Instagram
విజయ్ దేవరకొండ నాకు కావాలంటే నాకు కావాలి అంటూ ఇద్దరూ వాదనకు దిగారు. వాళ్ళ తీరు చూశాక విజయ్ దేవరకొండ అంతగా వాళ్ళ మనసులు దోచేశాడా అన్న భావన కలగడం ఖాయం. కరణ్ షోలో సారా అలీఖాన్, జాన్వీ ఓపెన్ గా మనసులో కోరిక బయటపెట్టారు.
47
Sara Ali Khan
తాజాగా సారా అలీ ఖాన్ బికినీలో బెంచ్ పై కూర్చొని ఉన్న ఫోటో షేర్ చేశారు. సదరు ఫోటో చూసిన సోషల్ మీడియా జనాలు సారా తోడు లేక విరహవేదనతో అల్లాడిపోతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఆ వేదన విజయ్ దేవరకొండ కోసమేనా అని, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నీకే దక్కుతాడులే బాధపడకని ధైర్యం చెబుతున్నారు.
57
అయితే శర షేర్ చేసిన ఆ ఫోటో తన లేటెస్ట్ వెకేషన్ కి సంబంధించినదని తెలుస్తుంది. 26 ఏళ్ల సారా అలీ ఖాన్ పరిశ్రమకు వచ్చి దాదాపు ఐదేళ్లు అవుతుంది. 2018లో విడుదలైన కేధార్ నాథ్ ఆమె మొదటి చిత్రం. ఇన్నేళ్ళలో సినిమా కంటే ఎఫైర్ రూమర్స్ తో సారా వార్తల్లో నిలిచారు.
67
సారా డేటింగ్ చేసిన అబ్బాయిల లిస్ట్ చాలానే ఉంది. షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కట్టర్, దివంగత సుశాంత్ రాజ్ పుత్, కార్తీక్ ఆర్యన్ తో పాటు పలువురు ఈ లిస్ట్ లో ఉన్నారు. విజయ్ దేవరకొండ ఆఫర్ ఓకె చేస్తే ఆయన కూడా ఈ లిస్ట్ లో చేరవచ్చు. అయితే ఆయన రష్మిక మందాన ప్రేమలో మునిగి తేలుతుంటే సారాను ఏం పట్టించుకుంటాడు అంటున్నారు.
77
సారా అలీ ఖాన్ తరచుగా ఎఫైర్ రూమర్స్ తో వార్తల్లో ఉంటారు. పరిశ్రమకు వచ్చి పట్టుమని ఐదేళ్లు కాలేదు, చాలా మంది అబ్బాయిలతో ఆమె డేటింగ్ చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. తాజాగా ఆమె కన్ను టాలీవుడ్ హ్యాండ్ సమ్ విజయ్ దేవరకొండ పై పడింది.