ఈరోజు ఎపిసోడ్ లో నందు అ భయం తగ్గక ముందే దాన్ని ఒంటరిగా ఢిల్లీకి పంపడం అంటే మనసు గింజుకుంటుంది అని అంటాడు. అప్పుడు అభి చెల్లి వెళ్లే యూనివర్సిటీలో డిసిప్లిన్ చాలా బాగుంటుంది నాన్న. ఇంట్లో కంటే బాగుంటుంది. చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది నన్ను నమ్మండి నాన్న అని అభి అనడంతో మీరందరూ వందలా నమ్ముతుంటే నేను ఏమంటానో సరే కానివ్వండి అని అంటాడు నందు. తర్వాత అభి, పరంధామయ్య ఒకచోట కూర్చోగా అప్పుడు పరంధామయ్య సూదిలోకి దారం ఎక్కించడానికి తిప్పలు పడుతూ ఉండగా అది చూసి తులసి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు.