సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ 'హంట్'. గతం మరచిపోయిన కాప్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. మహేష్ సూరేపనేని ఈ చిత్రానికి దర్శకుడు. టీజర్, ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. గణతంత్ర దినోత్సవ కానుకగా ఈ చిత్రాన్ని నేడు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ప్రీమియర్ షోల నుంచి ప్రేక్షకుల రెస్పాన్స్ మొదలయింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.