షారుఖ్ ఖాన్ vs అమీర్ ఖాన్
బాలీవుడ్ బాక్సాఫీస్ కింగ్ షారుఖ్ ఖాన్. 2018లో ఆయన నటించిన జీరో సినిమా పరాజయం పాలైన తర్వాత, సినిమాలకు దూరంగా ఉన్నారు. 2023 వరకు ఆయన నటించిన సినిమా రిలీజ్ కాలేదు. 2023 జనవరిలో పఠాన్ సినిమాతో తిరిగి దూసుకువచ్చాడు షారుఖ్. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లు వసూలు చేసింది.
Also Read: రజినీకాంత్ రోబో సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరు..?
షారుఖ్ ఖాన్- అమీర్ ఖాన్
అదే సంవత్సరంలో మరో 1000 కోట్ల వసూళ్ల సినిమా జవాన్‌ను అందించారు. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షారుఖ్‌కి జోడీగా నయనతార నటించింది. 2023 డిసెంబర్‌లో డుంకి సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. ఆ ఏడాది ఆయన సినిమాలు 2500 కోట్లకు పైగా వసూలు చేశాయి.
Also Read: రాజమౌళిని పోరా అంటూ అవమానించింది ఎవరు..?
పఠాన్
బాలీవుడ్‌లో షారుఖ్‌కి పోటీగా ఉన్న మరో నటుడు అమీర్ ఖాన్. ఆయన దంగల్ సినిమా భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం, ఆ రికార్డును ఇప్పటివరకు ఏ సినిమా అధిగమించలేదు. షారుఖ్ పఠాన్ సినిమా రికార్డును అమీర్ ఖాన్ నిర్మించిన లాపతా లేడీస్ సినిమా బద్దలు కొట్టింది. అది కూడా భారతదేశంలో కాదు జపాన్‌లో... లాపతా లేడీస్ జపాన్‌లో విడుదలై వసూళ్ళ సునామీ సృష్టించింది.
Also Read: కీర్తి సురేష్ - శివకార్తికేయన్ లవ్ స్టోరీ నిజమేనా..? బ్రేకప్ కి కారణం ఎంటో తెలుసా !
లాపతా లేడీస్ జపాన్ బాక్సాఫీస్
షారుఖ్ పఠాన్ సినిమా 250 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడింది. కానీ దాని రికార్డును బద్దలు కొట్టిన లాపతా లేడీస్‌ను కేవలం 5 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు అమీర్ ఖాన్. పఠాన్ జపాన్‌లో 2.70 కోట్లు వసూలు చేయడం రికార్డుగా ఉండగా, 45 రోజులు దాటి జపాన్‌లో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న లాపతా లేడీస్ 2.70 కోట్లకు పైగా వసూలు చేసి, వసూళ్ల వేట కొనసాగిస్తోంది.