మహేష్‌, రామ్‌ చరణ్‌ దగ్గర్లో కూడా లేరు, ప్రభాసే ఇండియాలో నెంబర్ వన్‌.. తారక్, బన్నీ ఎక్కడంటే?

First Published | Nov 22, 2024, 8:31 PM IST

హీరోల క్రేజ్‌, అభిమాలను ప్రేమ, ఆడియెన్స్ ఆదరణ ఎప్పటికప్పుడు మారుతుంటుంది. సినిమాల రిలీజ్‌ని బట్టి ఆ స్టార్ హీరోకి క్రేజ్‌ ఉంటుంది. ఈ విషయంలో ప్రభాస్‌ ఇండియాలోనే దుమ్ములేపుతుంటే, రామ్‌ చరణ్‌ మాత్రం వెనకబడిపోయాడు. 

తాజాగా బండ్ల గణేష్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన శుక్రవారం ట్విట్టర్‌లో పెట్టిన ఓ పోస్ట్ దుమారం రేపుతుంది. అటు సోషల్‌ మీడియాని, ఇటు చిత్ర పరిశ్రమని ఊపేస్తుంది. `తాతలు, తండ్రులు ఉంటే సరిపోదు ఎన్టీఆర్‌, మహేష్‌, రామ్‌చరణ్‌, ప్రభాస్‌లా టాలెంట్‌ కూడా ఉండాలి బ్రదర్‌` అంటూ ట్వీట్‌ చేశారు. ఇది సంచలనం క్రియేట్‌ చేస్తుంది. విజయ్‌ దేవరకొండని ఉద్దేశించి ఆయన ఈ పోస్ట్ పెట్టారని అంటున్నారు.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇక నెంబర్‌ వన్‌ పొజీషియన్‌లో నిలిచారు. అత్యంత ప్రేమ, ఆదరణ పొందుతున్న హీరోగా ప్రభాస్‌ ఇండియాలోనే మొదటి స్థానంలో నిలిచారు. బాలీవుడ్‌, కోలీవుడ్‌ స్టార్స్ ని పక్కకి నెట్టి డార్లింగ్‌ ఫస్ట్ ప్లేస్‌ని సొంతం చేసుకోవడం విశేషం. ప్రభాస్‌ గత నెలలో బర్త్ డే జరిగింది. ఈ క్రమంలో ఆయన గురించిన చర్చ బాగా నడిచింది. దీంతో ఈ సర్వేలో ఆయన మొదటి స్థానం దక్కించుకున్నారు. ఆయన తర్వాత తమిళ స్టార్‌ దళపతి విజయ్‌ ఉండటం విశేషం. రెండో స్థానంలో విజయ్‌ ఉన్నారు. ఆయన ఆ మధ్యనే కొత్త పార్టీని పెట్టి సింబల్‌ని, జెండాని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. 
 


ఇక మూడో స్థానంలో బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారూఖ్‌ ఖాన్‌ ఉన్నారు. నాల్గో స్థానంలో మాత్రం ఎన్టీఆర్‌ నిలిచారు. ఆయన నటించిన `దేవర` చిత్రం సెప్టెంబర్‌ చివర్లో విడులైంది. అక్టోబర్‌లో హవా చూపించింది. పాన్‌ ఇండియా వైడ్‌గా దుమ్ములేపింది. దీంతో అనూహ్యంగా ఈ సర్వేలో టాప్‌ 4లోకి వచ్చాడు తారక్‌. ఐదో స్థానంలో కోలీవుడ్‌ స్టయిలీష్‌ స్టార్‌, తలా అజిత్‌ ఉన్నారు. ఇలా టాప్‌ 5లో టాలీవుడ్‌ నుంచి ఇద్దరు, కోలీవుడ్‌ నుంచి ఇద్దరు, బాలీవుడ్‌ నుంచి ఒక్కరు మాత్రమే ఉన్నారు. 

టాప్‌ 6లో అల్లు అర్జున్‌ నిలిచారు. ఆయన హవా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. వచ్చే నెలలో బన్నీ `పుష్ప2`తో రాబోతున్నారు. దీంతో ఆయన కూడా టాప్‌ 10లో నిలవడం విశేషం. ఇక ఏడో స్థానంలో మాత్రం మహేష్‌ బాబు నిలిచారు. ఆయన ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన డిస్కషన్‌ జరుగుతూనే ఉంది. అందుకే ఆయన టాప్‌ 10లోకి వచ్చారు. ఇక ఎనిమిదో స్థానంలో సూర్య ఉన్నారు. గత నెల నుంచి సూర్య `కంగువా` హవా నడుస్తుంది. అందుకే ఆయన టాప్‌ లోకి వచ్చారు. 

రామ్‌ చరణ్‌ వెనకబడిపోయాడని చెప్పొచ్చు. ఆయన తొమ్మిదో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన `గేమ్‌ ఛేంజర్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఇది సంక్రాంతికి రాబోతుంది. గత నెల వరకు అప్‌ డేట్స్ కోసం ఫ్యాన్స్ గగ్గోలు పెట్టారు. ఇప్పుడు నెమ్మదిగా ఒక్కో అప్‌ డేట్స్ ఇస్తూ అలరిస్తుంది టీమ్‌. టాప్‌ 10లో పదో స్థానంలో సల్మాన్‌ ఖాన్‌ ఉన్నారు. బాలీవుడ్‌ నుంచి షారూఖ్‌తోపాటు సల్మాన్‌ కూడా స్థానం సంపాదించడం విశేషంగా చెప్పొచ్చు. అయితే ఆయన సినిమాలు కూడా ఇప్పుడు లేవు, కానీ ఆయన్ని ఆడియెన్స్ బాగానే ఇష్టపడుతున్నారని చెప్పొచ్చు. 

read more:ప్రభాస్‌తో రిలేషన్‌, బాలయ్య ప్రమేయం ఇదేనా, షర్మిలా చెప్పిన నిజాలు.. దీనంతటికి కారణం ఆయనే!

also read: మహేష్‌ బాబు రిజెక్ట్ చేసిన సినిమాతో డిజాస్టర్‌ని ఫేస్‌ చేసిన రామ్‌ చరణ్‌, తండ్రి కారణంగా అడ్డంగా బుక్కయ్యాడా?

Latest Videos

click me!