100 కోట్ల క్లబ్‌లోకి `సితారే జమీన్ పర్`.. వంద కోట్లు దాటిన అమీర్‌ ఖాన్‌ చిత్రాల జాబితా

Published : Jun 24, 2025, 10:02 PM IST

అమీర్‌ ఖాన్‌ హీరోగా నటించిన  ‘సితారే జమీన్ పర్’ మూవీ బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతుంది. ఇది తాజాగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది.  

PREV
15
`సితారే జమీన్‌ పర్‌` నాలుగు రోజుల కలెక్షన్లు

అమీర్‌ ఖాన్‌ సినిమాలు చాలా ఏళ్ల తర్వాత హిట్‌ టాక్‌ని అందుకుంటున్నాయి. `దంగల్‌` తర్వాత ఆయన్నుంచి సరైన హిట్‌ మూవీ పడలేదు. ఎంతో కష్టపడి చేసిన సినిమాలన్నీ డిజప్పాయింట్‌ చేస్తూ వచ్చాయి. 

ఈ క్రమంలో ఇన్నాళ్లకి ఇప్పుడు ‘సితారే జమీన్ పర్’ హిట్‌ టాక్‌ తెచ్చుకుంటుంది. బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లని రాబడుతుంది. ఈ మూవీ నాలుగు రోజుల నుంచి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. 

దర్శకుడు ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 105.17 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ సాధించింది. నెమ్మదిగా పుంజుకుంటూ కలెక్షన్లని పెంచుతుంది. భారీ వసూళ్ల దిశగా వెళ్తుందీ మూవీ. 

25
భారత్ vs ఓవర్సీస్‌.. 'సితారే జమీన్ పర్' వసూళ్లు ఎలా ఉన్నాయి

బాలీవుడ్ హంగామా నివేదిక ప్రకారం, 'సితారే జమీన్ పర్' 4 రోజుల్లో భారత్‌లో 65.80 కోట్ల రూపాయల నెట్‌ కలెక్షన్లని వసూలు చేయగా, గ్రాస్‌ కలెక్షన్లు 78.33 కోట్ల రూపాయలు. అదే సమయంలో, అమీర్ ఖాన్ నటించిన ఈ చిత్రం ఓవర్సీస్‌లో 26.84 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇలా మొత్తంగా వంద కోట్లు దాటేసింది. 

35
ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా వసూలు చేసిన అమీర్ ఖాన్ 11వ చిత్రం

అమీర్‌ ఖాన్‌ నటించిన  వంద కోట్లు దాటిన మూవీస్‌లో ‘సితారే జమీన్ పర్’ 11వ చిత్రంగా నిలిచింది. ఇది ప్రపంచవ్యాప్త బాక్సాఫీస్ వద్ద 105 కోట్ల రూపాయల వసూళ్లను దాటింది. ఇంతకు ముందు ఆయన నటించిన 10 చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ఈ క్లబ్‌లో చేరాయి. అవేంటో ఓ లుక్కేద్దాం. 

45
అమీర్ ఖాన్ 100 కోట్ల క్లబ్‌లో చేరిన టాప్‌ 10 మూవీస్‌

'సితారే జమీన్ పర్' కంటే ముందు అమీర్ ఖాన్ 10 చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల క్లబ్‌లో చేరాయి. ఈ చిత్రాలు: `దంగల్` (1968.03 కోట్ల రూపాయలు), `సీక్రెట్ సూపర్‌స్టార్` (875.78 కోట్ల రూపాయలు), `పీకే` (769.89 కోట్ల రూపాయలు), `ధూమ్ 3` (556.74 కోట్ల రూపాయలు), `3 ఇడియట్స్` (400.61 కోట్ల రూపాయలు), 

 `థగ్స్ ఆఫ్ హిందూస్తాన్` (322.07 కోట్ల రూపాయలు), `గజినీ` (189.19 కోట్ల రూపాయలు), `తలాష్` (180.83 కోట్ల రూపాయలు), `లాల్ సింగ్ చద్దా` (129.64 కోట్ల రూపాయలు), `ఫనా` (102.84 కోట్ల రూపాయలు) వంటి చిత్రాలున్నాయి. 

55
2025లో 100 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రాలివే

2025లో 'సితారే జమీన్ పర్' కంటే ముందు 7 బాలీవుడ్ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాయి. ఈ చిత్రాలు: `ఛావా` (797.34 కోట్ల రూపాయలు), `రైడ్‌ 2` (243.06 కోట్ల రూపాయలు), 

`హౌస్‌ఫుల్ 5 `(252.94 కోట్ల రూపాయలు), `స్కై ఫోర్స్` (168.88 కోట్ల రూపాయలు), `సికిందర్` (176.18 కోట్ల రూపాయలు), `కేసరి చాప్టర్ 2` (144.35 కోట్ల రూపాయలు), `జాట్` (119.24 కోట్ల రూపాయలు).

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories