విక్రమార్కుడు సినిమాలో రవితేజ్ జోడీగా నటించిన అనుష్క.. ఆతరువాత బాహుబలి రెండు సినిమాల్లో పవర్ ఫుల్ పాత్రలు చేసింది. రాజమౌళికి అనుష్కతో ప్రత్యేక అనుబంధం ఉంది. జక్కన్న ఫ్యామిలీలో ఒకరిలా కలిసిపోయింది అనుష్క. రాజమౌళికి ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ తో పాటు అనుష్క కూడా చాలా స్పెషల్.
ఇక ప్రస్తుతం అనుష్క సినిమాలు చేయడంలేదు. అప్పుడప్పుడు ఏదో ఒకటి అరా సినిమాల్లో కనిపిస్తోంది. 43 ఏళ్లు వచ్చినా అనుష్క బ్యాచిలర్ గానే ఉంది. పెళ్లిపై ఇప్పటి వరకూ క్లారిటీ ఇవ్వలేదు.