AOT Day 1 Collections: ఆకాశంలో ఒక తార కలెక్షన్లు.. దుల్కర్‌ సల్మాన్‌ మూవీ టాక్‌కి, వసూళ్లకి సంబంధమే లేదు

Published : Nov 21, 2026, 09:02 AM IST

దుల్కర్‌ సల్మాన్‌, కొత్త అమ్మాయి సాత్విక వీరవల్లి జంటగా, శ్రుతి హాసన్‌, రుహానీ శర్మ కీలక పాత్రల్లో నటించిన `ఆకాశంలో ఒక తార`కి ఆడియెన్స్ నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చింది. మరి బాక్సాఫీసు రిజల్ట్ ఎలా ఉందంటే?

PREV
13
ఆకాశంలో ఒక తార మూవీకి పాజిటివ్‌ టాక్‌

దుల్కర్‌ సల్మాన్.. మలయాళ నటుడు అయినా తెలుగులోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ హీరోగా రాణిస్తున్నారు. ఆల్మోస్ట్ తెలుగు హీరోగా నిలబడ్డాడు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నాడు. క్లీన్‌ ఫిల్మ్స్ తో మహిళా ఆడియెన్స్ కి దగ్గరయ్యాడు. అందులో భాగంగా ఇప్పుడు `ఆకాశంతో ఒక తార` అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. పవన్‌ సాధినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా నటించింది. శ్రుతి హాసన్‌, రుహానీ శర్మ, స్వాసిక కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. విమర్శకుల ప్రశంసలందుకుంది. మహిళా సాధికారత కలిగిన చిత్రంగా అభివర్ణించారు. మరి కమర్షియల్‌గా ఈ మూవీ ఎలా ఉందనేది చూస్తే.

23
ఆకాశంలో ఒక తార మూవీ కలెక్షన్లు

`ఆకాశంలో ఒక తార` మొదటి రోజు డీసెంట్‌ ఓపెనింగ్స్ ని రాబట్టుకుంది. మొదటి రోజు సుమారు నాలుగు కోట్లు వసూలు చేసిందట. ఇండియాలో మూడు కోట్లకుపైగా వసూళ్లు వచ్చాయి. అయితే దుల్కర్‌ సల్మాన్‌ నటించిన చిత్రాల్లో ఇది చాలా తక్కువ ఓపెనింగ్స్ గా చెప్పొచ్చు. ఈ సినిమా సుమారు అరవై కోట్ల బడ్జెట్‌తో రూపొందిందని సమాచారం. ఓటీటీ రైట్స్ రూ.34కోట్లకు అమ్ముడుపోయింది. నెట్‌ ఫ్లిక్స్ ఈ చిత్ర డిజిటల్‌ హక్కులను దక్కించుకుంది. ఇక ముప్పై కోట్ల థియేట్రికల్ టార్గెట్‌తో విడుదలైంది. అంటే బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం సుమారు రూ.60కోట్ల గ్రాస్‌ వసూలు చేయాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు వస్తోన్న కలెక్షన్లు చూస్తుంటే అది కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి ఇది ఏం మ్యాజిక్‌ చేస్తుందో చూడాలి.

33
ఆకాశంలో ఒక తార మూవీ కథ ఏంటంటే?

`అకాశంలో ఒక తార` సినిమా అమ్మాయి తాను ఆస్ట్రోనాట్‌ కావాలని కలలు కంటుంది. తండ్రి దాన్ని వ్యతిరేకిస్తాడు. తల్లి ప్రోత్సహిస్తుంది. కానీ పదో తరగతి పూర్తి కాగానే పెళ్లి చేస్తారు. దుల్కర్‌ సల్మాన్‌ ఆమె కల గురించి తెలుసుకుంటాడు. ఆ దిశగా ప్రోత్సహిస్తాడు. అందుకోసం ఆయన ఎన్నో కూలీ పనులు చేస్తాడు. ఈ క్రమంలో హీరోయిన్‌ చాలా అవమానాలు ఫేస్‌ చేస్తుంది. వాటిని దాటుకొని ప్లాస్మా ద్వారా రాకెట్‌ని అంతరిక్షంలోకి పంపించవచ్చనే కొత్త ఐడియాకి శ్రీకారం చుడుతుంది. రెండు మూడు సార్లు ఫెయిల్‌ అవుతుంది. అంతిమంగా అంతర్జాతీయ ఏరోస్పేస్‌ సంస్థలతో కలిసి దాన్ని సాధించడం, అంతరిక్షంలోకి వెళ్లి రావడమనేది ఈ చిత్ర కథ.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories