ENE 2 Day 2 Collections: 2వ రోజు పడిపోయిన ఈ నగరానికి ఏమైంది 2 కలెక్షన్లు.. అయినా తరుణ్‌, విశ్వక్‌ సేన్‌ బాక్సాఫీసు రచ్చ

Published : Nov 21, 2026, 07:37 AM IST

తరుణ్‌ భాస్కర్‌ రూపొందించిన `ఈ నగరానికి ఏమైంది రిపీట్‌`(ENE 2) ఆడియెన్స్ ముందుకు వచ్చి సందడి చేస్తోంది. మొదటి రోజు దుమ్ములేపిన ఈ మూవీ కలెక్షన్లు రెండో రోజె ఎలా ఉన్నాయంటే?

PREV
13
బాక్సాఫీసు వద్ద ఈ నగరానికి ఏమైంది 2 రచ్చ

తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందిన `ఈ నగరానికి ఏమైంది` మూవీ అప్పట్లో పెద్ద హిట్‌ అయ్యింది. యూత్‌ని బాగా ఆకట్టుకుంది. కల్ట్ మూవీగా నిలిచిపోయింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌ వచ్చింది. `ఈనగరానికి ఏమైంది రిపీట్‌` పేరుతో దీన్ని తెరకెక్కించాడు తరుణ్‌ భాస్కర్‌. విశ్వక్‌ సేన్‌, అభినవ్‌ గోమటం, శ్రీనాథ్‌ మాగంటి, వెంకటేష్ కాకుమాను, రామ్‌, శివాత్మిక రాజశేఖర్‌, శ్రీరామ్‌ చంద్ర వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్‌ఎస్‌ ఒరిజినల్స్, రూట్‌నాడ్‌ సినిమాస్‌ పతాకాలపై సృజన్ యారబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మించారు. ఈ చిత్రం గురువారం విడుదలైంది. మొదటి రోజు బాక్సాఫీసు వద్ద దుమ్ములేపింది. మొదటి పార్ట్ లైఫ్‌ టైమ్‌ కలెక్షన్లని ఒక్క రోజులోనే లేపేసింది. మరి రెండో రోజు పరిస్థితి ఏంటనేది చూస్తే.

23
ఈ నగరానికి ఏమైంది రిపీట్‌ 2 రోజుల కలెక్షన్లు

ఈ నగరానికి ఏమైంది రిపీట్‌ మూవీ రెండో రోజు ఇండియాలో రూ.3.10కోట్ల నెట్‌, రూ.3.80కోట్ల గ్రాస్‌ కలెక్షన్లని సాధించింది. దీంతో ఈ చిత్రం ఇండియాలో రూ.10.40కోట్ల గ్రాస్‌, రూ.8.95కోట్ల నెట్‌ వసూలు చేసింది. ఓవర్సీస్‌లో రెండున్నర కోట్లు వచ్చాయి. రెండు రోజుల్లో ఓవర్సీస్‌లో తొమ్మిది కోట్లు రావడం విశేషం. అంతేకాదు రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ.19.40కోట్లు రాబట్టింది. ఇండియా కలెక్షన్లు, ఓవర్సీస్‌ కలెక్షన్లు పోటీ పోటీగా ఉండటం మరో విశేషం.

33
తొలి వీకెండ్‌లోనే బ్రేక్‌ ఈవెన్‌?

ఈ నగరానికి ఏమైంది 2 మూవీ దాదాపు రూ.15కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదలైంది. రెండు రోజుల్లోనే ఈ మూవీ సుమారు 70శాతం కలెక్షన్లని వసూలు చేసింది. ఇంకా పది కోట్ల గ్రాస్‌ వస్తే సినిమా సేఫ్‌ అవుతుందని చెప్పొచ్చు. అయితే శనివారం, ఆదివారం ఈ సినిమాకి కలెక్షన్లు బాగానే వచ్చే అవకాశం ఉంది. శుక్రవారంతో పోల్చితే పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆల్మోస్ట్ వీకెండ్‌లోనే ఈ సినిమా సేఫ్‌లోకి వెళ్తుందని సమాచారం. మరి ఎంత వరకు సాధ్యమనేది చూడాలి. సినిమాలో మెయిన్‌ ఫస్‌, స్నేహం, సినిమాపై ప్యాషన్‌ అనేది బాగా కనెక్ట్ అవుతున్నాయి. జెన్‌జీ కుర్రాళ్లకి ఈ మూవీ బాగా ఎక్కుతుంది. అమ్మాయిలను కూడా ఆకట్టుకుంటుంది. అయితే పెద్ద వాళ్లకి కూడా కనెక్ట్ అయ్యేలా చేసి ఉంటే సినిమా రేంజ్‌ వేరే లెవల్‌లో ఉండేది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories