AK 47 10 Days Collections: ఆదర్శ కుటుంబం 10 రోజుల వసూళ్లు.. భారీ నష్టాల దిశగా వెంకటేష్‌ మూవీ

Published : Nov 09, 2026, 08:27 AM IST

విక్టరీ వెంకటేష్‌ ఇటీవల `ఆదర్శ కుటుంబం ఇంటి నెంబర్‌ 47` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. కానీ ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. పది రోజుల్లో ఎంత రాబట్టిందంటే?

PREV
13
బాక్సాఫీసు వద్ద ఆదర్శ కుటుంబం స్ట్రగుల్

వెంకటేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా `ఆదర్శ కుటుంబం`. హౌజ్‌ నెంబర్ 47` అనేది ట్యాగ్‌ లైన్. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. నారా రోహిత్‌, నివేతా పేతురాజ్‌, సత్య, రావు రమేష్‌, బ్రహ్మాజీ, యువీనా, రాజా ప్రజ్వల్‌ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్‌ రాధాకృష్ణ(చినబాబు) నిర్మించారు. ఈ చిత్రం అక్టోబర్ 30న విడుదలైంది. ఫ్యామిలీ ఎలిమెంట్లు ప్రధానంగా చేసుకొని యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. బాక్సాఫీసు వద్ద స్ట్రగుల్‌ అవుతుంది. వీక్‌ డేస్‌తో పోల్చతే వీకెండ్‌లో వసూళ్లు పెరిగాయి. కానీ నష్టాలతో ముగిసే అవకాశాలున్నాయి.

23
ఏకే 47 పది రోజుల కలెక్షన్లు

`ఆదర్శ కుటుంబం`(ఏకే 47) మూవీ విడుదలై 10 రోజులు అవుతుంది. మరి పదో రోజు వసూళ్లు ఎలా ఉన్నాయి? పది రోజుల్లో ఎంత రాబట్టింది? బ్రేక్‌ ఈవెన్‌ అయ్యిందా? హిట్టా ఫట్టా అనేది చూస్తే, పదో రోజు ఇది రూ.1.60కోట్ల నెట్‌ని, రూ.1.85కోట్ల గ్రాస్‌ని వసూలు చేసింది. ఓవర్సీస్‌లో పది లక్షలు వచ్చాయి. ఓవరాల్‌గా పదో రోజు (రెండో ఆదివారం) దీనికి రూ.1.95కోట్లు వచ్చాయి. శనివారంతో పోల్చితే ఆదివారం కలెక్షన్లు పెరిగాయి. ఇక ఓవరాల్‌గా ప్రపంచ వ్యాప్తంగా పది రోజుల్లో ఈ సినిమా రూ.69.80కోట్ల గ్రాస్‌ని వసూలు చేసింది. ఇందులో ఓవర్సీస్‌లో రూ.16.60కోట్లు వచ్చాయి. ఇండియాలో రూ.53.20కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది.

33
భారీ నష్టాల దిశగా వెంకటేష్‌ ఆదర్శ కుటుంబం

ఈ సినిమాకి రూ.70కోట్లకుపైగానే బడ్జెట్‌ అయ్యిందట. థియేట్రికల్‌ బిజినెస్‌ రూ.63కోట్లు అని సమాచారం. నైజాంలో రూ.17కోట్లు, సీడెడ్‌లో ఏడు కోట్లు, ఆంధ్రాలో రూ.20కోట్ల వ్యాపారం జరిగిందట. ఏపీ, తెలంగాణలో కలిపి రూ.44కోట్లు, ఇతర స్టేట్స్ అన్నీ కలిపి రూ.6కోట్లు, ఓవర్సీస్‌లో రూ.13కోట్ల బిజినెస్‌ జరిగిందని సమాచారం. సినిమా హిట్‌ కావాలంటే దాదాపు రూ.120-130కోట్ల గ్రాస్ కలెక్షన్లు రావాలి. ఇప్పటి వరకు దాదాపు సగం వసూళ్లు మాత్రమే రాబట్టింది. ఇంకా సగం రావాలి. మహా అయితే ఈ మూవీ ఇంకో ఐదారు కోట్లు మాత్రం వసూలు చేసే అవకాశం ఉంది. ఓవరాల్‌గా రూ.20-25కోట్ల వరకు నష్టాలను మిగిల్చబోతుందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories