ఆదివారం రోజు బిగ్ బాస్ హౌస్ లో దీపావళి వెలుగులు, సందడి కనిపించాయి. ఇంటి సభ్యులు ఆటపాటలతో అలరించారు. అదే విధంగా ఎలిమినేషన్ లో నాగార్జున పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.
ఆదివారం, పైగా దీపావళి కావడంతో బిగ్ బాస్ హౌస్ సందడిగా కనిపించింది. ఇంటి సభ్యులు ఆటపాటలతో అలరించారు. నాగార్జున ఇంటి సభ్యులతో ఫన్ గేమ్స్ ఆడించారు. అదే విధంగా ఎలిమినేషన్ విషయంలో చివరి వరకు ఉత్కంఠ కొనసాగించారు.
25
బిగ్ బాస్ హౌస్ లో ఫన్ గేమ్స్
ఫన్ గేమ్ లో భాగంగా 3 సెకన్ల కంటే ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా నాగార్జున అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూనే ఉండాలి. ఎవరైతే గ్యాప్ ఇస్తారో వాళ్లకు పాయింట్స్ రావు. ఆపోజిట్ టీమ్ కి పాయింట్స్ వస్తాయి. ఈ గేమ్ లో ఇంటి సభ్యులు రెండుగా డివైడ్ అయి పోటీ పడ్డారు. ఆ తర్వాత హౌస్ లో బోర్డుపై కొన్ని టైటిల్స్ ఉంచారు. సినిమా టైటిల్స్ తరహాలో వాటిని డిజైన్ చేశారు. ఆ టైటిల్ కి తగ్గ క్యారెక్టర్ హౌస్ లో ఎవరు ఉన్నారు అనేది ఒకొక్కరు వచ్చి చెప్పాలి. వాళ్ళ ఫోటోని టైటిల్ వద్ద ఉంచాలి.
35
వాల్యూమ్ ఫుల్లు వాలిడ్ పాయింట్ నిల్లు
ముందుగా వర్షిణి.. దేబ్జానీ ఫోటోని తీసుకుని 'ఫేస్ ఒక్కటే వెర్షన్స్ ఎన్నో' అనే టైటిల్ వద్ద ఉంచింది. తను పైకి ఒక మనిషిలా కనిపిస్తుంది కానీ లోపల చాలా ఆలోచనలు ఉన్నాయి. అది నేనే ఫేస్ చేశాను అని వర్షిణి పేర్కొంది. త్రిగుణ్ కి శివ.. అందరితో బాండింగ్ లోపల ప్లానింగ్ అనే టైటిల్ ఇచ్చారు. ముకేశ్ అయితే త్రిగుణ్ కి 'వాల్యూమ్ ఫుల్లు వాలిడ్ పాయింట్ నిల్లు' అనే టైటిల్ ఇచ్చారు.
వర్షిణికి సుధీర్ ఊహించని టైటిల్ ఇచ్చాడు. ప్రెజెన్స్ ఉంటుంది పర్పస్ లేదు అనే టైటిల్ ఇచ్చాడు. ఆమె అంతటా కనిపిస్తుది కానీ కొన్నిసార్లు ఎందుకు ఇన్వాల్వ్ అవుతుందో ఆమెకు కూడా క్లారిటీ ఉండదు అని సుధీర్ తెలిపారు. వర్షిణి రియాక్ట్ అవుతూ.. సుధీర్ ఏదో ఒకరోజు నిన్ను కూడా కాటేస్తాడు అని మీరు చెప్పారు సర్.. అది నాకు గుర్తుంది.. అదే ఇప్పుడు నిజమైంది అని నాగార్జునతో పేర్కొంది. సుధీర్ మా ఫ్యామిలీ నుంచి బయటకు వెళ్ళాడు. మమ్మల్ని కాటేయడమే సేఫ్ అని భావించి ఉంటాడు అంటూ వర్షిణి కౌంటర్ ఇచ్చింది. వర్షిణి, ఆర్కే, నరేష్ ఫ్యామిలీలు హౌస్ లోకి వచ్చేందుకు నాగార్జున మరో అవకాశం ఇచ్చారు. వాళ్ళు ముగ్గురూ నిలుచున్న చోట వేఇంగ్ మెషీన్స్ ఉన్నాయి. హౌస్ లో ఉన్న వారు వారిలో ఎవరికి సపోర్ట్ చేయాలి అని అనుకుంటారో వాళ్ళ వెయింగ్ మెషీన్స్ పై మీ పర్సనల్ వస్తువులు వేయాలి. బజర్ ఎండ్ అయ్యే లోపు ఎవరి వెయిట్ ఎక్కువ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ హౌస్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది అని నాగార్జున తెలిపారు. నరేష్ కి ఎక్కువ మంది సపోర్ట్ చేశారు. దీనితో నరేష్ విజయం సాధించాడు. వర్షిణి ముకేశ్ విషయంలో హర్ట్ అయింది. వెయింగ్ మెషీన్స్ పై ఉంచిన వస్తువులు ఇక వాళ్లకు చెందవు. వాటిని బిగ్ బాస్ తీసేసుకుంటారు అని నాగార్జున కండిషన్ పెట్టారు. ఒక వేళ ఆ పొజిషన్ లో నువ్వు ఉంటే నేను ఏమాత్రం ఆలోచించకుండా నా బట్టలు మొత్తం మెషీన్ పై వేసేదాన్ని. కానీ నువ్వు అలా చేయలేదు అంటూ వర్షిణి ముకేశ్ ని ప్రశ్నించింది. కన్నీళ్లు పెట్టుకుంది.
55
ఎలిమినేషన్ లో బిగ్ ట్విస్ట్
ఇక చివర్లో ఎలిమినేషన్ ఉత్కంఠ నెలకొంది. సుధీర్, నీతూ, శివ కుమార్ బాటమ్ లో నిలిచారు. వీరిలో శివకుమార్ సేవ్ అయ్యాడు. నాగార్జున చెప్పినట్లు లాకర్ ఓపెన్ చేయాలి. లాకర్ ఓపెన్ కాకుంటే వాళ్ళు ఎలిమినేట్ అని నాగార్జున చెప్పారు. నీతూ ఓపెన్ చేయగా లాకర్ ఓపెన్ అయింది. అందులో నీతూ సేఫ్ అని ఉంది. దీనితో సుధీర్ ఎలిమినేట్ అయినట్లే అని అంతా భావించారు. నీ ఫోటో వెనుక మరో ఫోటో ఉంది. దానిని కూడా బయటకు తీయమని నాగార్జున నీతూకు చెప్పారు. అక్కడ సుధీర్ ఫోటో ఉంది. అతడి ఫోటోపై కూడా సేఫ్ అని రాసి ఉంది. దీనితో సుధీర్ కూడా సేవ్ అయ్యాడు. ఈ రోజు దీపావళి కాబట్టి ఎలాంటి ఎలిమినేషన్ లేదు అని నాగార్జున సుధీర్ కి చెప్పాడు. లేకుంటే సుధీర్ ఎలిమినేట్ అయ్యేవాడే.