ఎపిసోడ్ ప్రారంభంలో ప్రిన్సిపల్ వచ్చి గెస్ట్ లు వచ్చేస్తున్నారు సార్ రండి రిసీవ్ చేసుకుందాం అని విశ్వనాథం, రిషి వాళ్ళతో చెప్తాడు. నా మాటలు విన్న వసుధార కుర్చీలోంచి లెగుస్తుంది. అప్పుడు రిషి వచ్చి మీరేమీ రావక్కర్లేదు అటు ఇటు నడిస్తే మళ్ళీ మీ కాలు నొప్పి ఎక్కువ అవుతుంది ఎలాగో వాళ్ళు ఇక్కడికే వస్తారు కదా అప్పుడు పరిచయం చేసుకుందురు గాని అని వసుతో చెప్తాడు. ప్రిన్సిపల్ కూడా అలాగే చెప్పడంతో ఆగిపోతుంది వసుధార.