Intinti Gruhalakshmi: తులసిని తీసేయాలంటూ డిమాండ్ చేసిన అనసూయ.. సామ్రాట్ ఏం చేయనున్నాడు?

First Published Sep 30, 2022, 11:08 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు సెప్టెంబర్ 30వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..లాస్య నందుతో, చూసావా ఒకప్పుడు వంటింటి కుందేలులా ఉండే తులసి ఇప్పుడు ఎంత వైభోగంతో ఉందో అని అంటుంది. అప్పుడు తులసి, ఝాన్సీ తో, చూడు ఝాన్సీ ఒక పది నిమిషాలు నాకు సహాయం చేయవా. ఈ అగ్రిమెంట్లో ఏమున్నాదో చెప్తే నేను సంతకం పెడతాను అని అంటుంది. అప్పుడు ఝాన్సీ తప్పకుండా మేడం అని అంటుంది. ఇది చూస్తున్న లాస్య, అందరికీ సేవలు చేసేది, అందరి చేత సేవ చేయించుకుంటుంది.ఇదం తా సామ్రాట్ గారి మహత్యం అని అంటుంది.
 

 అప్పుడు నందు, ఇప్పుడు అవన్నీ ఎందుకు లాస్య మన పని మనం చేసుకుందాము అని అంటాడు. దానికి లాస్య మనసులో, ఎన్ని చెప్పినా నువ్వు మారవు నేనే ఏదో ఒకటి చేసి వీలైన ప్రతిసారి తులసి ని ఇరికించెలా చేస్తాను అని తల వెనక్కి తిప్పేసరికి తులసి అక్కడ ఉంటుంది. నేను ఇచ్చిన పని ఏమైంది లాస్య ఆ ఫైల్స్ రెడీ చేసేవా అని అడగగా, నేను చాలా బిజీగా ఉన్నాను ఇంకో దాని గురించి వర్క్ చేస్తున్నాను అని లాస్య అంటుంది.దానికి తులసి, ఎంత బిజీగా ఉన్నావో గత పావుగంట నుంచి కనిపిస్తుంది.
 

 నచ్చితే చెయ్యు లేకపోతే ఇది ఇంకొకరికి ఇస్తాను. మధ్యాహ్నం లోగ నాకు ఇది కావాలి మళ్ళీ అడిగిపించుకోవద్దు అని చెప్పి వెళ్ళిపోతుంది.అప్పుడు లాస్య కోపంతో, నన్నే అవమానిస్తావా నిన్ను అవమానిచ్చే రోజు ఏదో ఒకటి వస్తుంది అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో, ప్రేమ్ డాబా మీద కూర్చొని గిటార్ వాయిస్తూ ఉండగా శృతి అక్కడికి వచ్చి కాఫీ ఇస్తుంది. ప్రేమ్ గిటార్ వాయించడం చూసి శృతి ఆలోచిస్తూ ఉంటుంది. మనసులో ఏమనుకుంటున్నావో అడిగితే బాగుంటుంది అని ప్రేమ్ గా చెప్పాలనుకున్నప్పుడు అడిగించుకోవడం దేనికి అని శృతి అంటుంది.
 

అప్పుడు ప్రేమ్ మనసులో, పొగరు అని అనుకుంటాడు. శృతి, నీకన్నా ఎక్కువ ఏం కాదులే అని అనగా,నా మనసులో ఉన్నది నీకు ఎలా తెలుసు అని ప్రేమ్ అనగా, నువ్వు మనసులో ఏమనుకున్నా నాకు అర్థం అవుతుంది అని శృతి అంటుంది.మనసులో ఉన్నవి కొన్ని మాత్రమే అర్థమవుతాయు ఎందుకు? పూర్తిగా అర్థం చేసుకుంటే గొడవలు వచ్చావు కాదు కదా. సామ్రాట్ గారు ఒక ఈవెంట్ కి నన్ను రిఫర్ చేశారు దాని కోసం వెళ్తున్నాను అని ప్రేమ్ అంటాడు. అప్పుడు ప్రేమ్, శృతి ఆల్ ది బెస్ట్ చెప్తుంది అని ఎదురు చూస్తాడు.
 

కానీ శృతి ఎక్కువ ఆశించొద్దు అని చెప్పి పంపించేస్తుంది. ఆ తర్వాత సీన్లో అనసూయ కోపంగా బట్టలు ఆరేసుకుంటూ,ఇంట్లో ఎవరు నా మాట వినడం లేదు తుఫాన్ వస్తుంది అని ముందే చెప్పిన సరే ఎవరు జాగ్రత్త పడడం లేదు అని అరుస్తుంది. ఇంతలో అభి అక్కడికి వచ్చి, నేను ఉన్నాను కదా నానమ్మ నేను ముందే చెప్పాను. ఎవరు నమ్మలేదు ఇప్పుడు నువ్వే నాకు తోడుగా ఉన్నావు నీ మాటైనా వింటారు అనుకుంటే నిన్ను లెక్క చేయట్లేదు అని అంటాడు. అప్పుడు అనసూయ, నా వయసుకు కూడా విలువ ఇవ్వడం లేదు ఇప్పుడు ఏం చేస్తాము అని అనుకుంటుంది.అప్పుడు అభి, ఇలా కాదు నానమ్మ నువ్వు ఒకప్పుడు ఎలా ఉండే దానివో అలా మారు. నీ నిర్ణయాలు నువ్వే తీసుకో పక్క వాళ్ళ అభిప్రాయం నీకు అవసరం లేదు తర్వాత వాళ్లే అర్థం చేసుకుంటారు అని అంటాడు. 

ఆ తర్వాత సీన్లో తులసి సామ్రాట్ కి ఫోన్ చేసి ఎక్కడున్నారు మీటింగ్కి టైం అవుతుంది అని అనగా, ఈరోజు కొంచెం లేట్ అయ్యేటట్టు ఉన్నది కొంచెం మేనేజ్ చేయండి తులసి గారు అని సామ్రాట్ అంటాడు. మేనేజర్ అంటే పనులు మేనేజ్ చేయాలండి మీ తప్పులను మేనేజ్ చేయకూడదు.అయినా ఒకప్పుడు ఎవరో అన్నారు కదా లేటుగా రావడం వల్ల ఎదుటి వాళ్ళ సమయం వృధా చేస్తున్నానని అని అనగా, సారీ తులసి గారు ఇంకెప్పుడూ ఇలా జరగదు అని సామ్రాట్ అంటాడు.నేను ఊరికినే సరదాకి అన్నానండి అని తులసి అనగా, సరే వస్తున్నాను అని సామ్రాట్ అంటాడు.ఇంతకీ ఎందుకు లేట్ అవుతుంది అని తులసి అడుగుతుంది.హనీ గుడికి వెళ్దాము అని అన్నది అక్కడికి వెళ్లి వచ్చేసరికి లేట్ అయిపోతుంది అని సామ్రాట్ అనగా, వస్తున్నప్పుడు నాకు ప్రసాదం తీసుకురండి అని అంటుంది తులసి.
 

అప్పుడు సామ్రాట్ మీరు ప్రసాదం బ్యాచ్ ఆ అని అంటాడు, ప్రసాదం బ్యాచే కాదు దేవుడి భక్తురాలని కూడా అని తులసి అంటుంది. సరే అయితే త్వరగా వచ్చేస్తున్నాను అని సామ్రాట్ ఫోన్ పెట్టేస్తాడు. ఫోన్ పెట్టిన తర్వాత సామ్రాట్ చలాకీగా పని చేసుకుంటున్నప్పుడు, సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అక్కడికి వచ్చి ఫోన్లో ఎవర్రా అని అనగా, తులసి మాట్లాడింది బాబాయ్ అని అంటాడు. అప్పుడు ఓహో అందుకే అంత చాలా ఫ్రీగా ఉన్నావా అని సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అంటాడు. ఆ తర్వాత హనీ బైట కూర్చొని డల్ గా ఉంటుంది.ఎందుకు హనీ డల్ గా ఉన్నావు అని అనగా, రేపు నా పుట్టిన రోజు కద నాన్న అయినా ఈ రోజు నన్ను స్కూల్ కి ఎందుకు పంపిస్తున్నావు అని అనగా నేను ఉంచుదామనే అనుకున్నానమ్మా కానీ మేడం ఫోన్ చేసి పరీక్ష అన్నారు కదా పరీక్ష అయిపోయిన వెంటనే వచ్చే అని సామ్రాట్ అంటాడు. సరే అని హనీ ఉంటుంది. ఆ తర్వాత సామ్రాట్ ఆఫీస్ కి బయలుదేరుతున్నప్పుడు అనసూయ సామ్రాట్ ఇంటికి వస్తుంది. అప్పుడు అనసూయ సామ్రాట్ తో, మీరు నాకు ఒక సహాయం చేయాలి సామ్రాట్ గారు అని అనగా తప్పకుండా చేస్తాను అమ్మ అని సామ్రాట్ అంటాడు.

తులసిని మీరు ఉద్యోగం నుంచి తీసేయండి ఈ విషయం నేను చెప్పినట్టు తులసికి చెప్పకూడదు. ఈమధ్య తులసి అక్కడికి వెళ్లడం వల్ల మాకు చాలా భయంగా ఉంటుంది అని అనగా,మొన్నే కదా అమ్మ ప్రాజెక్ట్ చేస్తున్నాము అంటే మీరు చప్పట్లు కొట్టారు. ఈరోజు ఇలా అంటున్నారు ఎందుకు అని అనగా, మొన్న నేను అంతా బానే ఉంటుంది అని అనుకున్నాను కానీ ఈ విమర్శలు వచ్చిన తర్వాత మద్య తరగతి కుటుంబాలు కదా బాబు దీన్ని తట్టుకోలేము. ఈ విషయం తులసికి చెప్పినా అర్థం చేసుకోవడం లేదు కనుక మీరే ఏదైనా చేయండి అని సామ్రాట్ చేతులు పట్టుకొని వేడుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనసూయ. ఆ తర్వాత సీన్లో,ప్రేమ్ ఈవెంట్ బయట ఆడిషన్ ఇచ్చి వస్తాడు. అందరూ రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉండగా ప్రేమ్ తన ఫ్రెండ్ తో మాట్లాడుకుంటూ ఇలా ఈవెంట్ కి వచ్చాము అని అంటాడు.ఇంతలో అక్కడ ఎవరో ప్రేమ్ దగ్గరికి వచ్చి మీరు సెలెక్ట్ అయ్యారు. సర్ మిమ్మల్ని లోపలికి పిలుస్తున్నారు అని అంటారు. దానికి అందరూ ప్రేమ్ ని అభినందిస్తారు. ప్రేమ లోపలికి వెళ్తున్నప్పుడు ఒక అతను ప్రేమ్ ని ఆపి, టాలెంట్ ఉన్నది నాకు కానీ అడ్డుతోవలో రిఫరెన్స్ మీద వచ్చింది నువ్వు అని అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!