ఇటీవల ఇండస్ట్రీలో వస్తోన్న మార్పులపై నాగచైతన్య మాట్లాడుతూ, కరోనా తర్వాత ఇండస్ట్రీలో చాలా మార్పులొచ్చాయన్నారు. ముఖ్యంగా ఆడియెన్స్ చాలా మారారని, ఓటీటీలోకి సినిమా రావడంతో చాలా ఎడ్యూకేట్ అయ్యారని, చాలా కంటెంట్‌ని ఓటీటీల ద్వారా చూస్తున్నారని చెప్పారు. దీంతో దాన్ని కాదని, వాటిని దాటుకుని థియేటర్కి ఆడియెన్స్ ని తీసుకురావాలంటే ఇంకా చాలా చేయాలని, ఎగ్జైటింగ్ ఎలిమెంట్స్ జోడించాలని, మామూలు స్టఫ్ సరిపోదన్నారు. యాక్షన్, ఎమోషన్స్, పాటలే కాదు, బలమైన కథ ముఖ్యమన్నారు. కంటెంట్ ఈజ్ కింగ్ అని చెప్పారు. ఆడియెన్స్ ని బట్టి తాను కూడా మారానని, అలాంటి కథలకే ప్రయారిటీ ఇస్తున్నానని తెలిపారు.