పృథ్వీరాజ్‌ శెట్టితో పెళ్లి వరకు వెళ్లిన విష్ణు ప్రియా, ఇప్పట్లో వదిలేలా లేదుగా, మతిపోయే విషయాలు వెల్లడి!

Published : Dec 10, 2024, 08:06 AM IST

విష్ణు ప్రియా ఈ ఆదివారం ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. పృథ్వీరాజ్‌తో లవ్ ట్రాక్ గురించి ఓపెన్‌ అయ్యింది. పెళ్లి వరకు వెళ్లినట్టుగా తెలిపి షాకిచ్చింది.   

PREV
15
పృథ్వీరాజ్‌ శెట్టితో పెళ్లి వరకు వెళ్లిన విష్ణు ప్రియా, ఇప్పట్లో వదిలేలా లేదుగా, మతిపోయే విషయాలు వెల్లడి!

బిగ్‌ బాస్‌ తెలుగు 8 గత వారం ఇద్దరు ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. శనివారం ఎపిసోడ్‌లో రోహిణి, ఆదివారం ఎపిసోడ్‌లో విష్ణు ప్రియా ఎలిమినేట్‌ అయ్యింది. అనుకున్నట్టుగానే ఈ ఇద్దరు హౌజ్‌ని వీడారు. అనంతరం బిగ్‌ బాస్‌ బజ్‌లో ముచ్చటించింది విష్ణు ప్రియా. హౌజ్‌లో తన జర్నీ గురించి పంచుకుంది. ముద్దులు హగ్గులు గురించి చెప్పింది. పృథ్వీతో పెళ్లి విషయాన్ని ప్రస్తావించింది.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

25

ఇందులో పృథ్వీరాజ్‌ శెట్టితో విష్ణు ప్రియా క్లోజ్‌గా మూవ్‌ అయిన విషయం తెలిసిందే. కొన్ని సార్లు ప్రేమించొచ్చు కదా అంటూ వెంటపడింది. ప్రతిసారి ఆయన చుట్టే తిరిగింది. బిగ్‌ బాస్‌ షోకి ఆయనతో పులిహోర కలపడానికే వచ్చిందా అన్నట్టుగా వ్యవహరించింది.

దీంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. గేమ్‌ల కంటే ఆమెకి పృథ్వీరాజ్‌ మీదనే ఫోకస్‌ ఉంది. ఈ క్రమంలో ఆయనతో లవ్‌ ట్రాక్‌ గురించి ఓపెన్‌ అయ్యింది విష్ణు ప్రియా. మాజీ కంటెస్టెంట్ అర్జున్‌ అంబటీ బీబీ బజ్‌లో అడిగిన ప్రశ్నలకు చిలిపిగా సమాధానాలు చెప్పింది. 
 

35

పృథ్వీరాజ్‌కి రాత్రి సమయంలో ముద్దులు పెట్టడంపై స్పందిస్తూ, పృథ్వీరాజ్‌ తన తండ్రి గురించి చెప్పినప్పుడు అతను లో అయిపోయాడని, దీంతో హగ్‌, ముద్దు ఇచ్చానని తెలిపింది. మరో రోజు రాత్రి కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఇచ్చినట్టు వెల్లడించింది. ఆ సమయంలో తనకు అలా అనిపించిందని, అందుకే పెట్టినట్టు తెలిపింది విష్ణు ప్రియా.

తనకు ఎవరైనా నచ్చితే వాళ్ల కోసం ఏమైనా చేస్తానని, వాళ్ల కేరింగ్‌ చూసుకుంటానని, పృథ్వీ రాజ్‌ విషయంలో అదే జరిగిందని వెల్లడించింది. అయితే అతనికి నా లాంటి అమ్మాయిలు నచ్చరు, ఆయన టేస్ట్ వేరు, నా టేస్ట్ కూడా వేరు. కానీ హౌజ్‌లో అతను నాకు బెటర్‌ అనిపించాడు. అందుకే కనెక్ట్ అయ్యాను. 
 

45

ఇలాంటి అబ్బాయితో బయట కూడా డేట్‌ చేసి, మనసులు కలిసి, ప్రేమించడానికి పరిస్థితులు అనుకూలిస్తే ముందుకు వెళ్లొచ్చు అని ఆలోచించినట్టు తెలిపింది. పృథ్వీరాజ్‌ వాళ్ల అమ్మ హౌజ్‌లోకి వచ్చినప్పుడు విష్ణు కూడా తనకు కూతురు లాంటిది అనడంపై ఆమె స్పందిస్తూ, పెళ్లైయ్యాక కోడలిని కూడా కూతురులా చూసుకుంటారు కదా అని దాన్ని పాజిటివ్ యాంగిల్ లో తీసుకుంది విష్ణు ప్రియా.

అంతేకాదు ఏకంగా పెళ్లి వరకు వెళ్లడం ఆశ్చర్యంగా మారింది. అయితే తనపై ఆశలు పెట్టుకోవద్దు అని పృథ్వీ చెప్పినా, ఎక్కడో ఒక ఆశ ఉందని, కలిస్తే బాగుండేమో అని ఆలోచించినట్టు తెలిపింది. 
 

55

ఇక కాఫీ తాగుతూ ప్రేమించొచ్చు కదా అని పృథ్వీని అడగడంపై ఎదురైన ప్రశ్నకి విష్ణు ప్రియా స్పందిస్తూ అది సరదాకి ఫర్ట్ చేశాను. నిజం కాదు, కానీ పృథ్వీ నా మనసుకి దగ్గరైన వ్యక్తి  అని తెలిపింది. 14 వారాలు హౌజ్‌లో ఉన్న విష్ణు ప్రియా వారానికి నాలుగు లక్షల పారితోషికం తీసుకుందట. అత్యధిక పారితోషికం అందుకున్న కంటెస్టెంట్ గా నిలిచింది. 

read more: నోరు జారిన రాజేంద్రప్రసాద్‌.. ఎర్ర చందనం దొంగ హీరోనా.. అల్లు అర్జున్‌పై వ్యాఖ్యలు వివాదం?

also read: 2024 టాప్ హారర్ సినిమాలు: ఏ ఓటీటీలో చూడొచ్చు అంటే?
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories