బిగ్ బాస్ ఆడియన్స్ కి బిగ్ షాక్... షో ఆపేయాలని నిర్ణయం తీసుకున్న స్టార్ మా?

First Published | Sep 26, 2022, 9:57 AM IST

బిగ్ బాస్ ప్రేక్షకులకు ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఇకపై వారికి ఈ రియాలిటీ షోని ఎంజాయ్ చేసే అదృష్టం ఉండకపోవచ్చనేది ఓ అంచనా. బిగ్ బాస్ సీజన్ 6 కి వస్తున్న దారుణమైన రేటింగ్ నేపథ్యంలో నెక్స్ట్ సీజన్ కష్టమే అంటున్నారు.

Bigg Boss Telugu 6

బిగ్ బాస్ రియాలిటీ షో అత్యంత ప్రజాదరణ కలిగి ఉంది. గత ఐదు సీజన్స్ గా తిరుగు లేకుండా దూసుకుపోతుంది. ఎన్టీఆర్ హోస్ట్ గా 2017లో మొదలైన బిగ్ బాస్ తెలుగు అనేక రికార్డ్స్ నమోదు చేసింది. నాని, నాగార్జునల సారథ్యంలో మరిన్ని హైట్స్ అందుకుంది. అత్యధికంగా బిగ్ బాస్ తెలుగు 4 లాంచింగ్ ఎపిసోడ్ 18.8 టీఆర్పీ రాబట్టింది. 
 

Bigg Boss Telugu 6

ఐతే ఇదంతా గతం... లేటెస్ట్ సీజన్ దారుణమైన కష్టాలు ఎదుర్కొంటుంది. వీక్ డేస్, వీకెండ్ అనే తేడా లేకుండా పూర్ షో కొనసాగుతుంది. బిగ్ బాస్ షో ఎపిసోడ్స్ కి కేవలం 2 నుండి 2.5 రేటింగ్ మాత్రమే వస్తున్నట్లు సమాచారం. నాగార్జున వచ్చే వీకెండ్స్ లో  3-3.5 రేటింగ్ రాబడుతుందట. ప్రైమ్ టైంలో ఓ పాప్యులర్ షోకి ఈ రేటింగ్ అంటే చాలా తక్కువని అర్థం. 


Bigg boss Telugu 6


బిగ్ బాస్ షోతో పోల్చితే సీరియల్స్ మంచి టీఆర్పీ అందుకుంటున్నాయి. సీరియల్స్ 10 టీఆర్పీ వరకు రాబడుతుంటే బిగ్ బాస్ 6 వీకెండ్  ఎపిసోడ్స్ కూడా 4 టీఆర్పీ దాటలేకపోవడం ఊహించని పరిణామం. 
 

Bigg Boss Telugu 6

ప్రస్తుత సీజన్ నిర్వాహకులకు భారీ షాక్ ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో టీఆర్పీ పెంచాలని అనేక ఆలోచనలు చేస్తున్నారు. అసలు ముక్కూ ముఖం తెలియని కంటెస్టెంట్స్ హౌస్లో ఉన్నప్పుడు కూడా ఇంత తక్కువ రేటింగ్ రాలేదు. 
 

Bigg Boss Telugu 6


ఇక హోస్ట్ నాగార్జునలో కూడా ఫైర్ తగ్గింది. ఆయన గత సీజన్స్ మాదిరి అలరించలేకపోతున్నారు. టీఆర్పీ ఒత్తిడిలో పడి కంటెస్టెంట్స్ ని విమర్శించడం, తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. మునుపటిలా కంటెస్టెంట్స్ లో జోష్ ఆయన నింపలేకపోతున్నారు. గతంలో ఎలిమినేషన్స్ ఉన్నప్పటికీ వీకెండ్ షోస్ చాలా ఎంటర్టైనింగ్ గా సాగేవి. కంటెస్టెంట్స్ ఆట పాటలతో మంచిగా అలరించేవారు. 

Bigg Boss Telugu 6


బిగ్ బాస్ 6 మొదలై మూడు వారాలు గడుస్తున్నా మెరుగయ్యే దాఖలాలు కనిపించడం లేదు. ఇదే ట్రెండ్ కొనసాగితే నెక్స్ట్ సీజన్ కష్టమే అంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 ఉండకపోవచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి. మెరుగైన హోస్ట్ దొరికితే, కంటెస్టెంట్స్ ఎంపికైతే నెక్స్ట్ సీజన్ ఉండవచ్చు. లేదంటే స్టార్ మా బిగ్ బాస్ షోకి తెరదించడం ఖాయం. 

Bigg Boss Telugu 6


కాగా ఈవారం హౌస్ నుండి నేహా చౌదరి ఎలిమినేట్ అయ్యారు. నామినేటైన తొమ్మిది మంది కంటెస్టెంట్స్ లో అతి తక్కువ ఓట్లు పోలైన వాసంతి, నేహా చౌదరి ఎలిమినేషన్ జోన్ లోకి వచ్చారు. వీరిద్దరిలో వాసంతిని సేవ్ చేసిన నాగార్జున నేహాను ఎలిమినేట్ చేశారు. రేవంత్ కారణంగానే ఎలిమినేట్ అయినట్లు నేహా చౌదరి ఆవేదన చెందారు. 

Latest Videos

click me!