సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ మొత్తం వెయిటింగ్. ఎందుకో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ తదుపరి చిత్రం దర్శకధీరుడు రాజమౌళితో ఉండబోతోంది. అత్యంత భారీ బడ్జెట్ లో పాన్ వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేసేలా ఈ చిత్రం ఉండబోతోందని ఆల్రెడీ హింట్స్ ఇచ్చేశారు. దీనితో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు.