జీవితంలో బిగ్ బాస్ జోలికి వెళ్ళను, ఆ చాప్టర్ ముగిసింది.. నాని షాకింగ్ కామెంట్స్
నేచురల్ స్టార్ నాని నటించిన మోస్ట్ వయలెంట్ మూవీ హిట్ 3 మే 1 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో నాని హిట్ 3 చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు.
నేచురల్ స్టార్ నాని నటించిన మోస్ట్ వయలెంట్ మూవీ హిట్ 3 మే 1 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో నాని హిట్ 3 చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు.
నేచురల్ స్టార్ నాని నటించిన మోస్ట్ వయలెంట్ మూవీ హిట్ 3 మే 1 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో నాని హిట్ 3 చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు. హిట్ 3 ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో నాని బిగ్ బాస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. నాని గతంలో బిగ్ బాస్ సీజన్ 2కి హోస్ట్ గా చేసిన సంగతి తెలిసిందే.
బిగ్ బాస్ సీజన్ 1కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేశారు. ఆ తర్వాత సీజన్ 2కి హోస్ట్ గా నాని చేయడం విశేషం. సీజన్ 3 నుంచి కింగ్ నాగార్జున హోస్ట్ గా కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు బిగ్ బాస్ తెలుగు షో 8 సీజన్లు పూర్తి చేసుకుంది. త్వరలో సీజన్ 9 ప్రారంభం అవుతుంది. ఈ టైంలో నాని బిగ్ బాస్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. గతంలో బిగ్ బాస్ షోకి హోస్ట్ గా చేశారు. మళ్ళీ బిగ్ బాస్ హోస్ట్ గా మారే ఛాన్స్ ఉందా అని యాంకర్ ప్రశ్నించగా నాని రియాక్ట్ అయ్యారు.
నాని మాట్లాడుతూ..బిగ్ బాస్ చాప్టర్ ముగిసింది.. ఇక దాని జోలికి వెళ్ళను. నా జీవితంలో బిగ్ బాస్ అనేది ఒక ఎక్స్పీరియన్స్. బయట ప్రపంచాన్ని నాకు బిగ్ బాస్ డిఫెరెంట్ గా చూపించింది. నేను నార్మల్ గేమ్ అనుకుని బిగ్ బాస్ 2 హోస్ట్ గా వెళ్ళా. కానీ దానిలో చాలా ఎమోషన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి.
నాని హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 2లో కౌశల్ విజేతగా నిలిచారు. రన్నరప్ గా సింగర్ గీతా మాధురి నిలిచారు. నాని నటించిన హిట్ 3 చిత్రం శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందింది. ఈ మూవీలో కెజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించారు.
హిట్ ప్రాంఛైజీలో భాగంగా హిట్ 3 రూపొందింది. నాని హిట్ 3లో మోస్ట్ వయలెంట్ అవతార్ లో కనిపించబోతున్నారు. నాని పాత్ర పేరు అర్జున్ సర్కార్. ఇటీవల విడుదలైన ట్రైలర్ అంచనాలు పెంచేసింది. ఈ చిత్రంలో ఉన్న వయలెంట్ సీన్స్ వల్ల చిన్నపిల్లలతో చూడవద్దని నాని ముందే చెప్పారు.