టెర్రస్ పై నుంచి దూకి మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య

First Published | Sep 11, 2024, 3:25 PM IST

ప్రస్తుతం పుణెలో ఉన్న మలైకా అరోరా.. తండ్రి మరణవార్త తెలియగానే ముంబయి బయల్దేరారు. 

Malaika Arora Khan, father, suicide


బాలీవుడ్ నటి, డాన్సర్, మలైకా అరోరా ఖాన్ తండ్రి  ఈ రోజు ఆత్మహత్య చేసుకుని మరణించారు.  ముంబైలోని తన ఇంటి టెర్రస్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు రిపోర్ట్ లు చెప్తున్నాయి. ఇది వినడానికి నిజంగా షాకింగ్‌గా ఉండే వార్తే.  చనిపోయిన ఆయన  వద్ద నుంచి ఎలాంటి సూసైడ్ నోట్ కూడా లభించలేదు. ఆత్మహత్యకు గల కారణాలు కూడా తెలియాల్సి ఉంది.  ఈ సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.  

Malaika Arora Khan, father, suicide


ఇక ప్రస్తుతం పుణెలో ఉన్న మలైకా అరోరా.. తండ్రి మరణవార్త తెలియగానే ముంబయి బయల్దేరారు. మరోవైపు, మలైకా మాజీ భర్త, నటుడు అర్బాజ్‌ ఖాన్‌ కూడా అనిల్‌ నివాసానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.
 


Malaika Arora Khan, father, suicide


మలైకా అరోరా ఖాన్ బాలీవుడ్‌లో ప్రఖ్యాత డ్యాన్సర్. ఆమె అనేక టీవీ రియాల్టీ షోలలో డాన్స్ హోస్ట్‌గా కూడా కనిపిస్తుంది. ఆమె ఫిజికిల్ ఫిట్నెస్ తో  సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో  తరచుగా పాపులర్ అవుతుంది. తన తండ్రి ఆత్మహత్య ఘటనపై ఆమె ఇంతవరకు స్పందించలేదు. అయితే ఆమె స్పందన మరియు ఆమె తండ్రి మరణానికి గల కారణాన్ని తెలుసుకోవటానికి చాలా మంది ఎదురుచూస్తున్నారు.
 

Malaika Arora Khan, father, suicide

 మలైకా 11 ఏళ్ల వయసులోనే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. అప్పటినుంచి మలైకా, ఆమె సోదరి అమృత తల్లి వద్దే పెరిగారు. అనిల్‌ ఒంటరిగా బాంద్రాలో నివాసముంటున్నారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గతేడాది ఆసుపత్రిలో చేరగా.. తండ్రిని చూసేందుకు మలైకా తల్లితో కలిసివెళ్లారు. పంజాబ్‌కు చెందిన అనిల్‌ అరోరా మర్చెంట్ నేవీలో పనిచేశారు.
 

Malaika Arora Khan, father, suicide


తల్లిదండ్రులు విడిపోవడంపై గతంలో మలైకా మాట్లాడుతూ... ‘‘నా బాల్యం అద్భుతంగా గడిచింది. కానీ, అంత సులభం కాదు.. గందరగోళంగా అని చెప్పొచ్చు. అయితే, అలాంటి కష్ట సమయాలే మనకు ఎన్నో నేర్పుతాయి. నా తల్లిదండ్రులు విడిపోవడంతో మా అమ్మను నేను కొత్త కోణంలో చూడగలిగా. స్వతంత్రంగా ఎలా ఉండాలో తెలుసుకున్నా. ఆ పాఠాలే నా వ్యక్తిగత, వృత్తిజీవిత ప్రయాణానికి మూలస్తంభాలు. నా చుట్టూ ప్రపంచం ఎలా ఉన్నా సరే నేను మాత్రం బలంగా, స్వతంత్రంగా నిలబడగలుగుతున్నా’’ అని మలైకా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
 

Latest Videos

click me!