కన్నీళ్లు పెట్టించేసిన నాగ మణికంఠ, అమ్మ చనిపోతే కట్టెలకు డబ్బు అడుక్కున్నా..విష్ణుప్రియ, శేఖర్ భాషాకి సమాధానం

First Published | Sep 4, 2024, 11:37 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 డే 3కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో విడుదలయింది. నామినేషన్ల పర్వం హౌస్ లో హాట్ హాట్ గా కొనసాగుతోంది. హౌస్ మేట్స్ కొందరు ఎక్కువగా నాగ మణికంఠని టార్గెట్ చేస్తున్నారు. నామినేషన్స్ లో భాగంగా ఈ రోజు కూడా శేఖర్ భాషా మణికంఠని టార్గెట్ చేసినట్లు ప్రోమోలో అర్థం అవుతోంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 డే 3కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో విడుదలయింది. నామినేషన్ల పర్వం హౌస్ లో హాట్ హాట్ గా కొనసాగుతోంది. హౌస్ మేట్స్ కొందరు ఎక్కువగా నాగ మణికంఠని టార్గెట్ చేస్తున్నారు. నామినేషన్స్ లో భాగంగా ఈ రోజు కూడా శేఖర్ భాషా మణికంఠని టార్గెట్ చేసినట్లు ప్రోమోలో అర్థం అవుతోంది. అదే విధంగా విష్ణు ప్రియతో కూడా అతడికి వాగ్వాదం జరుగుతోంది. భరించలేక మణికంఠ ఎమోషనల్ అయిపోయాడు. తన తల్లిదండ్రుల చావు, సవతి తండ్రి వేధింపులు చెబుతూ అందరిని కన్నీళ్లు పెట్టించాడు. 

ప్రోమోలో హైలైట్స్ ఒకసారి పరిశీలిస్తే.. ఫుడ్ విషయంలో బేబక్క, సీత మధ్య చర్చ జరిగింది. రూల్స్ ని అతిక్రమించి రెండు కూరలు ఎందుకు చేశారు అని సీత ప్రశ్నించింది. వెజిటేరియన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం రెండో కర్రీ చేసినట్లు బేబక్క తెలిపింది. సోనియా ఆకుల కూడా మరోసారి రెచ్చిపోతూ మాట్లాడింది. మణికంఠ, అభయ్ నవీన్ మధ్య కూడా వాగ్వాదం జరిగింది. వీళ్లిద్దరి గొడవలో మణికంఠ ఒక మాట అన్నారు. నేను అన్ ఫిట్ అయితే ఈ వారమే హౌస్ నుంచి వెళ్ళిపోతా అని అన్నాడు. 


అదే విధంగా విష్ణుప్రియ, మణికంఠ మధ్య కూడా ఆసక్తికర సంభాషణ జరిగింది. నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావో అని నేను ఈ మూడు రోజులు నీతో ట్రావెల్ అయ్యా అని మణికంఠ తెలిపాడు. ఓ మై గాడ్ దాని కోసం నాతో తిరిగావా అంటూ విష్ణుప్రియ ఆశ్చర్యపోయింది. 

ఆ తర్వాత శేఖర్ భాషాతో జరిగిన గొడవలో మణికంఠ ఎమోషనల్ గా బరస్ట్ అయ్యాడు. నువ్వు ప్రతి విషయాన్ని రాజకీయం చేద్దాం అని చూస్తున్నావు అంటూ శేఖర్ భాషా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ప్రతి విషయాన్ని నీకు ఆపాదించుకుని పాలిటిక్స్ క్రియేట్ చేయాలని చూస్తున్నావ్ అంటూ శేఖర్ భాషా నిందించాడు. 

దీనితో మణికంఠ భరించలేక ఎమోషనల్ అయిపోయాడు. చావు దాకా వెళ్లి వచ్చా. కన్న తండ్రిని పోగొట్టుకున్నా. సవతి తండ్రి చేత అవమానాలు పడ్డా. కన్న తల్లి కూడా చనిపోయింది. మా అమ్మ దహన సంస్కారాలకు, చితి పేర్చడానికి డబ్బులు అడుక్కున్నా అంటూ మణికంఠ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. మణికంఠ మాటలకు ఇతర ఇంటి సభ్యులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. 

Latest Videos

click me!