Nani, Saripodhaa Sanivaaram,
నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం ఏ రేంజి సక్సెస్ అయ్యిందో తెలిసిందే. రిలీజ్ అయిన తొలి రోజునుంచే పాజిటివ్ టాక్ సంపాదంచిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుని దూసుకుపోతోంది.
ఈ చిత్రం 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 75.26 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ వారాంతం వరకు ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలున్నాయి. ఇది భాక్సాఫీస్ రిపోర్ట్. అయితే ఈ సినిమా ఇప్పుడు తెలంగాణా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది..ఎలా ఏమిటి అనేది చూద్దాం.
Nani, Saripodhaa Sanivaaram, Movie Review
ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో విలక్షణ నటుడు ఎస్.జె. సూర్య విలన్ పాత్రలో నటించాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు, డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మించారు.
లాంగ్ రన్‌లో ఈ సినిమా వందకోట్లు దాటి వసూళ్లు సాధించే అవకాశాలున్నాయి. ఈ సినిమా ప్రస్తావన రీసెంట్ గా తెలంగాణా రాజకీయనాయకుడు మాజీ ఎమ్మల్యే బాల్క సుమన్ తీసుకొచ్చారు.
Nani, Saripodhaa Sanivaaram, Movie Review
రాష్ట్రంలో ప్రజలు వరదలతో అల్లాడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోకుండా తన ఇంట్లో 'సరిపోద శనివారం' సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారని బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు.
వరద బాధిత ప్రాంతాల్లో బీఆర్‌ఎస్ నాయకుల పర్యటనకు వచ్చిన స్పందన చూసి రేవంత్ రెడ్డికి వణుకు పుట్టిందన్నారు. ఆగస్టు 27న రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిందని, అయినా సీఎం ఒక్క రివ్యూ కూడా పెట్టలేదన్నారు.
Saripodhaa Sanivaaram review
ప్రజలు భారీ వర్షాలు, వరదలతో అల్లాడుతుంటే కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూస్తూ రేవంత్ ఎంజాయ్ చేశారని అన్నారు. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులున్నా ఒక్క హెలీ క్యాప్టర్ తెప్పించలేకపోయారని, తమ నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలు తీశారని మండిపడ్డారు.
కేసీఆర్ పాలనలో వరదలు, తుఫాన్లు వస్తే ముందే అన్ని సిద్దం చేసేవారని, కేసీఆర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలను ఆదుకునే వారని గుర్తు చేశారు. ప్రతిపక్షాలు క్షేత్రస్థాయిలోకి రావాలని రేవంత్ అంటున్నారని, వెళ్తే కాంగ్రెస్ నేతలు కర్రలు, రాళ్లతో దాడులు చేస్తున్నారని అన్నారు.
Nani
మిగతా విషయాలు ఎలా ఉన్నా ఇలా సరిపోదా శనివారం సినిమాని ప్రస్తావించటం నాని అభిమానులకు ఆనందం కలిగిస్తోంది. సినిమాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూసారా లేదా అనేది ప్రక్కన పెడితే తమ సినిమా ని ప్రస్తావించటం వారిని అలరిస్తోందంటున్నారు. అంతేకదా ఓ రకంగా ఇదో రకం ఫ్రీ పబ్లిసిటి .
Saripodhaa Sanivaaram
ఈ చిత్రం ఓవర్సీస్ లో కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం నార్త్ అమెరికాలో తాజాగా 2 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరింది.
నాని కెరీర్ లోనే అత్యంత వేగంగా 2 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిన చిత్రంగా సరిపోదా శనివారం చిత్రం నిలిచింది. హీరో నాని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ హిట్స్ సాధించడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.