మహేష్ బాబు తో సినిమా మిస్సైన ముగ్గురు స్టార్ డైరెక్టర్లు ఎవరో తెలుసా?

Published : Oct 18, 2025, 06:23 PM IST

మహేష్ బాబు తో సినిమా అంటే స్టార్ డైరెక్టర్లు కూడా ఎగిరి గంతేస్తారు. కానీ మహేష్ తో సినిమా చేయాలని ప్రయత్నించి, చేయలేకపోయిన ముగ్గురు దర్శకుల గురించి మీకు తెలుసా?

PREV
15
మహేష్ తో సినిమా చేయలేకపోయిన దర్శకులు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు‌తో సినిమా చేయాలనుకోవడం దర్శకులకే కాదు, నిర్మాతలకు కూడా ఒక పెద్ద అవకాశమే. కానీ, టాప్ డైరెక్టర్లు అయినా సరే.. కొందరికి ఇప్పటికీ మహేష్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ రాలేదు. వారిలో రామ్ గోపాల్ వర్మ, బోయపాటి శ్రీను వంటి ప్రముఖ దర్శకులు ఉన్నారు. అసలు వీరు మహేష్ తో ఎందుకు సినిమా చేయలేకపోయారు.

25
రామ్ గోపాల్ వర్మ

మహేష్ బాబు కెరీర్ బిగినింగ్ లోనే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మహేష్ బాబుతో తో సినిమా చేయాలని గట్టి ప్రయత్నాలు చేశాడు. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. కారణం, వర్మ చెప్పిన కథలు మహేష్ బాబుకు నచ్చలేదు. వర్మ మాఫియా, క్రైమ్ థ్రిల్లర్ కథలు మాత్రమే చేస్తున్నారు. అలాంటి కథలే మహేష్ కు చెప్పారట. , అప్పట్లో మహేష్ బాబు ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ సినిమాలు చేయాలనుకునేవాడు. అందుకే వర్మ చెప్పిన కథలపై ఆసక్తి చూపలేదు. ఫలితంగా, వీరి కాంబినేషన్‌లో ఒక సినిమా కూడా రాలేదు.

35
బోయపాటి శ్రీను

ఇక మరో టాప్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా మహేష్ బాబుతో సినిమా చేయాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నా, ఇప్పటికీ ఆ కల నెరవేరలేదు. బోయపాటి, తన కెరీర్ ప్రారంభం నుంచే ఈ ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే, ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా కూడా రాలేదు. బోయపాటి సినిమాల్లో వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది. మహేష్ బాబుకు అది సెట్ అవ్వదు. దాంతో మహేష్ కు రెండు మూడు కథలు చెప్పినా.. అవి వర్కౌట్ అవ్వలేదు. 2016 లో వచ్చిన సరైనోడు సినిమా కూడా మహేష్ బాబు దగ్గరకే ముందుగా వెళ్లిందట. కానీ మహేష్ ఈ సినిమాకు నో చెప్పాడని టాక్. మహేష్ బాబు ప్రస్తుతం పాన్ వరల్డ్ స్థాయిలో ప్రాజెక్ట్స్ చేస్తున్నసంగతి తెలిసిందే.. అలా చూసుకుంటే ఇకపై కూడా బోయపాటి శ్రీనుకు అవకాశం దక్కే ఛాన్స్ లేదనే చెప్పాలి.

45
వి.వి. వినాయక్

మరో వైపు మాస్ సినిమాల రారాజు వివి వినాయక్ కూడా మహేష్ బాబుతో సినిమా చేయాలి అని ప్రయత్నాలు చేశారట. మహేష్ ను మాస్ హీరోగా చూపించాలని కొన్ని కథలు కూడా వినిపించినట్టు టాలీవుడ్ టాక్. కానీ వినాయక్ సినిమాకూడా పక్కా మాస్ గా ఉంటుంది. ఆయన కథలు కూడా మహేష్ కు సెట్ అవ్వలేదు. మహేష్ కూడా ఈ తరహా సినిమాలను సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చాడు. అలా వినాయక్ తో కూడా మహేష్ బాబు సినిమా మిస్ అయ్యింది.

55
రాజమౌళి సినిమాతో బిజీగా

ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళితో కలిసి పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో ఈమూవీ తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొడితే, టాలీవుడ్ దర్శకులకు మహేష్ అందుతాడో లేదో తెలియదు. ఇక ప్రస్తుతం మహేష్ రాజమౌళి సినిమాపై ఎక్కువ ఫోకస్ పెట్టాడు.

Read more Photos on
click me!

Recommended Stories