భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వర రావు, లియో, రూల్స్ రంజన్.. అక్టోబర్ లో విడుదలయ్యే 12 చిత్రాలివే..

First Published | Oct 1, 2023, 4:55 PM IST

అక్టోబర్ నెలలో సినిమా సందడి మామూలుగా లేదు. భారీ చిత్రాలతో పాటు మంచి బజ్ క్రియేట్ చేసిన చిన్న సినిమాలు విడుదల కాబోతున్నాయి. 12 చిత్రాలు ఈ తేదీల్లో రిలీజ్ కానున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలేంటనేది చూద్దాం...
 

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ ఫిల్మ్ రూల్స్ రంజన్ (Rules Ranjann). నేహా శెట్టి హీరోయిన్. రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అమ్రిష్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని స్టార్ లైట్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై దివ్యాంగ్ లవనియా, మురళీ కృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి వచ్చిన ట్రైలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 6న విడుదల కానుంది. 
 

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'మ్యాడ్' (Mad) చిత్రం మంచి బజ్ క్రియేట్ చేసింది. సూర్యదేవర నాగ వంశీ సమర్పిస్తున్నారు. ఈ వినోదాత్మక చిత్రంలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ మెటీరియల్ ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రం కూడా అక్టోబర్ 6నే విడుదల కాబోతోంది.


‘అందాల రాక్షసి’తో ఫేమ్ దక్కించుకున్న నవీన్ చంద్ర.. హీరోగా చేసిన లేటెస్ట్ ఫిల్మ్ ‘మంథ్ ఆఫ్ మధు'. ఈ సినిమా కూడా అక్టోబర్ 6నే థియేటర్ లోకి రానుంది. స్వాతి రెడ్డి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకి శ్రీకాంత్ దర్శకత్వం వహించాడు. ప్రమోషన్స్ ను బాగా నిర్వహించారు. దీంతో ఆడియెన్స్ లో సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది.

శ్రీలంక క్రికెటర్‌, వరల్డ్ బెస్ట్ స్పిన్‌ బౌలర్‌ ముత్తయ్య మురళీ ధరన్‌ జీవితం ఆధారంగా `800`గా బయోపిక్‌ రూపొందింది. ప్రధాన పాత్రలో మధుర్‌ మిట్టర్‌ నటించగా.. మహిమా నంబియార్‌ ఫీమేల్‌ లీడ్‌గా చేస్తోంది. ఎంఎస్‌ శ్రీపతి దర్శకత్వం వహించారు. తమిళంలోని ఈ సినిమాను తెలుగులో శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్‌ రిలీజ్‌ చేస్తున్నారు. ఈ చిత్రం కూడా అక్టోబర్ 6నే విడుదల కాబోతోంది. 
 

సుధీర్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ‘మామా మశ్చీంద్ర’ (Mama Mascheendra)తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. హర్షవర్దన్ దర్శకత్వం  వహించిన ఈ చిత్రం అక్టోబర్ 6నే విడుదల కానుండటం విశేషం. తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా (Eesha Rebba) హీరోయిన్.  శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై రూపొందించారు. సుధీర్ బాబు త్రిపుల్ ట్రీట్ అందించనున్నారు. 
 

తమిళ భాషలో రూపుదిద్దుకున్న డ్రామా ఫిల్మ్ ‘చిత్తా’. సిద్ధార్థ్ హీరోగా నటించారు. ఎస్ యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు. రెడ్ గెయింట్ మూవీస్ బ్యానర్ పై నిర్మించారు. తెలుగులో ఈ చిత్రాన్ని ‘చిన్నా’గా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ నూ బాగా నిర్వహించారు. అక్టోబర్ 6నే ఈ చిత్రం కూడా రాబోతుండటం విశేషం. 

ఇక తెలుగు ప్రేక్షకులు, నందమూరి బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari). అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మించారు. షూటింగ్ పూర్తైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈ చిత్రం అక్టోబర్ 19న విడుదల కాబోతోంది. రిలీజ్ విషయంలో మరోసారి మేకర్స్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. 
 

తమిళ స్టార్ విజయ్ దళపతి - లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం ‘లియో’ (Leo). త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. 14 ఏళ్ల తర్వాత విజయ్ సరసన అలరించబోతోంది. ఇక బాలీవుడ్ స్టార్ట్స్ ఇందులో నటిస్తున్నారు. ఈ చిత్రం కూడా అక్టోబర్ 19నే రాబోతోంది. బాలయ్య చిత్రానికి పోటీగా నిలవనుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

కన్నడ స్టార్ శివన్న నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఘోస్ట్’ (Ghost) కూడా విడుదలకు సిద్ధమైంది. ఈరోజే ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది. యాక్షన్ మోతతో శివరాజ్ కుమార్ సినిమాపై ఆసక్తిని పెంచారు. ఈ చిత్రం కూడా తెలుగులోనూ విడుదల అవుతోంది. అక్టోబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. 

మాస్‌ మహారాజా రవితేజ (Ravi Teja) హీరోగా `టైగర్‌ నాగేశ్వరరావు` (Tiger Nageswara Rao) చిత్రం రూపొందుతుంది. స్టూవర్ట్ పురం గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా దర్శకుడు వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నుపుర్‌ సనన్‌ కథానాయిక. రేణు దేశాయ్‌ కీలక పాత్రలో నటిస్తుంది. అక్టోబర్ 20న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. అక్టోబర్ 3న ట్రైలర్ రానుంది. 

‘వార్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు దక్కించుకున్న బాలీవుడ్ యంగ్ అండ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ లేటెస్ట్ ఫిల్మ్ ‘గణపథ్’ (Ganapath). కృతిసనన్ హీరోయిన్ గా నటిీంచింది. వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 20నే రాబోతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలోనూ విడుదల కాబోతోంది. 
 

బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు నటించిన ’మార్టిన్ టూథర్ కింగ్’ కూడా ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం అక్టోబర్ 27న విడుదల కాబోతోంది. చివరిగా ‘కాలి ఫ్లవర్’ చిత్రంతో అలరించారు. ఇప్పుడు ఈ మూవీ రాబోతోంది.
 

Latest Videos

click me!