ఓటీటీల్లో సినిమాల జాతర
శుక్రవారం వచ్చిందంటే చాలు సినీ ప్రేమికులకు పండగే. అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలో కొత్త సినిమాలతో పండగ వాతావరణం ఏర్పడుతుంది. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ ల సందడి స్టార్ట్ అవుతుంది. ఎప్పటిలాగానే ఈ శుక్రవారం(25 జులై) కూడా ఓటీటీల్లోకి సరికొత్త కంటెంట్ లో సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చేశాయి. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళం భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి.
ఈవారం రిలీజ్ అయిన సినిమాలు, వెబ్ సిరీస్ లలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల నటించిన షో టైమ్ సినిమా. దీంతో పాటు విజయ్ ఆంటోనీ చిత్రం మార్గన్ కూడా ఈ వారమే స్ట్రీమింగ్ కు రానుంది. అమ్మాయిల హత్యలు, సైకో కిల్లర్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడింది. హిందీలో సర్జామీన్ తో పాటు ఓటీటీలో సందడి చేయబోయే సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం.