10th క్లాస్ హీరోయిన్ శరణ్య నాగ్ తన పర్సనల్ లైఫ్, కెరీర్ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తన తల్లి రెండో పెళ్లి వల్ల ఎదురైన ఇబ్బందులు, తన ఆరోగ్య సమస్యల గురించి శరణ్య నాగ్ కామెంట్స్ చేశారు.
టీనేజ్ లవ్ స్టోరీస్ ట్రెండ్ నడుస్తున్న టైంలో 10th క్లాస్ చిత్రం రిలీజ్ అయింది. యువతని ఆకట్టుకున్న ఈ మూవీ ఎమోషనల్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో భరత్, శరణ్య నాగ్ జంటగా నటించారు. టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలై దాదాపు 20 ఏళ్ళు గడుస్తోంది. 10th క్లాస్ మూవీ తర్వాత శరణ్య నాగ్ పెద్దగా సినిమాల్లో నటించలేదు. ఒకటి రెండు సినిమాల్లో ఛాన్స్ వచ్చినా అవి సక్సెస్ కాలేదు.
25
బిగ్ బాస్ షోలో ఛాన్స్
ఓ ఇంటర్వ్యూలో శరణ్య తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హెల్త్ విషయంలో ఎదుర్కొన్న సమస్యలని రివీల్ చేసింది. ముందుగా ఒక ఆసక్తికర విషయాన్ని రివీల్ చేసింది. బిగ్ బాస్ తెలుగు షోలో పాల్గొనేందుకు ఆమెకు ఆఫర్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీని గురించి ప్రశ్నించగా.. చర్చలు జరుగుతున్నాయి. అది జరిగినప్పుడు చూద్దాం అంటూ చిరు నవ్వు నవ్వి టాపిక్ మార్చేశారు. నాకు తెలుగు స్పష్టంగా రాదు అందుకే ఆలోచిస్తున్నా అని శరణ్య సమాధానం ఇచ్చారు.
35
10th క్లాస్ మూవీతో క్రేజ్
10th క్లాస్ మూవీతో తెలుగులో శరణ్యకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. కానీ ఆమెకి తమిళంలో అవకాశాలు వచ్చాయి. తెలుగులో అంతగా రాలేదు. దీని గురించి శరణ్య మాట్లాడారు. నాకు సినీ బ్యాగ్రౌండ్ లేదు. చిన్నతనంలోనే నాన్న చనిపోయారు. డబ్బు అవసరం కోసమే అమ్మ నన్ను సినిమాల్లోకి పంపింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఛాన్స్ వస్తే వెంటనే ఒప్పేసుకుంది. కానీ అమ్మకి డబ్బు మేనేజ్ చేయడం తెలియదు.
తమిళం అంటే కొంత వరకు మేనేజ్ చేయొచ్చు. కాబట్టి తమిళ సినిమాలు ఎక్కువగా ఒప్పుకుంది అని శరణ్య పేర్కొన్నారు. నాకు 19 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు అమ్మ రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలి అని అనుకుంది. ఆ టైంలో నేను బలవంతంగా ఇంట్లో నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా ఒంటరిని అయిపోయిన ఫీలింగ్ కలిగింది అని శరణ్య పేర్కొంది. ఇంటికి నుంచి బయటకు వచ్చేసి హాస్టల్ లో ఉన్నాను. ఆ తర్వాత ఓ తెలుగు సినిమాలో నటించా. అది వర్కౌట్ కాలేదు.
55
ప్రభాస్ కోసం రోజూ ప్రార్థిస్తున్నా
అప్పుడే నాకు ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హైపర్ థైరాయిడిజం లాంటి ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. 70 కేజీల బరువు ఉన్న నేను 120 కేజీలకు పెరిగాను. నా స్నేహితులు కూడా నన్ను గుర్తు పట్టలేకపోయారు. ఇక నేను హీరోయిన్ గా, నటిగా పనికి వస్తానా అనే భయం మొదలైంది. కానీ దేవుడు ఏదో ఒక సమయంలో అండగా ఉంటాడు అనే నమ్మకం ఉంది. కష్టపడి తక్కువ సమయంలో 40 కేజీల బరువు తగ్గాను అని శరణ్య పేర్కొంది. తిరిగి టాలీవుడ్ లోకి కంబ్యాక్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నట్లు శరణ్య నాగ్ పేర్కొంది. తనకి ప్రభాస్ అంటే పిచ్చి, వీరాభిమానం అని శరణ్య పేర్కొంది. తన ఇంస్టాగ్రామ్ ప్రభాస్ కి సంబంధించిన పోస్ట్ లే ఎక్కువగా ఉంటాయి అని శరణ్య తెలిపింది. నేను దేవుణ్ణి రోజూ 3 కోరికలు కోరతా. మొదటిది నేను ఆరోగ్యంగా ఉండాలి. రెండవది నా లోన్ క్లియర్ కావాలి.. మూడవది ప్రభాస్ బావుండాలి.. ఈ మూడు కోరికలు కోరతాను, రోజూ ప్రార్థిస్తాను అని శరణ్య పేర్కొంది.