పిల్లలతో గల్లీ క్రికెట్ ఆడుతున్న 100 కోట్ల హీరోను గుర్తుపట్టారా ? ఎన్టీఆర్ విలన్ గా నటించిన స్టార్ ఎవరు?

Published : Apr 28, 2025, 12:08 PM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంత స్టార్ హీరోలు ఉన్నా.. అందులో  సింపుల్ గా ఉండాలి అనుకునేవారు చాలామంది ఉన్నారు. స్టార్ డమ్ ను పక్కన పెట్టి.. సామాన్యులతో కలిసిపోతుంటారు. వందల కోట్ల సినిమాలు చేసేవారు కూడా గల్లీల్లో కామన్ ఫ్యాన్స తో తిరుగుతుంటారు. అటువంటి స్టార్ హీరో గురించి ఇప్పుడు చూద్దాం. చిన్న పిల్లలతో క్రికెట్ ఆడుతున్న ఈ పాన్ ఇండియా హీరోను గుర్తు పట్టారా?   

PREV
14
పిల్లలతో గల్లీ క్రికెట్ ఆడుతున్న 100 కోట్ల హీరోను గుర్తుపట్టారా ? ఎన్టీఆర్ విలన్ గా నటించిన స్టార్ ఎవరు?

ఎప్పుడు సినిమాలు, షూటింగ్ లు, హడావిడేనా.. కాస్త రిలాక్స్ అవ్వాలి. ఏప్పుడూ ఏసీ కార్లు, ఏసీ గదులు, నాలుగు గోడల మధ్య జీవితం బోర్ కదా.. అందుకే బయట స్వచ్చమైన గాలి పీల్చుకుంటూ గడపాలని ఎవరికి ఉండదు. కాని సినిమా స్టార్స్ కు అది సాధ్యం కాదు. జనాల మధ్యకు వారు రాలేరు. కొంత మంది మాత్రం కాస్త వీలు చూసుకుని బయటకు వస్తుంటారు. దూరంగా తక్కువ జనాలు ఉన్న చోట కాస్త ప్రీగా తిరగడానికి ఇష్టపడుతుంటారు ఇదిగో ఈ 100 కోట్ల హీరో చూడండి పిల్లతో ఆయిగా క్రికెట్ ఆడుతూ.. రిలాక్స్ అవుతున్నాడు. 

Also Read: శోభన్ బాబుని చేతగాని హీరో అని తిట్టిన స్టార్ విలన్, కట్ చేస్తే తిండి కూడా లేక హీరోని సాయం అడిగిన నటుడు ఎవరు?
 

24
unni mukundan

ఈ హీరో ఎవరో కాదు మలయాళ యంగ్ స్టార్, సౌత్ లో అన్ని భాషల్లో సినిమాలు చేసిన ఉన్ని ముకుందన్. ఇటీవల తన మార్కో సినిమాతో మాలీవుడ్‌‌ను షేక్ చేశాడు ఉన్ని ముకుందన్. ఈసినిమా పాన్ ఇండియా రేంజ్ లో రచ్చ చేసింది.  యాక్షన్ అడ్వంచరెస్‌ సినిమాగా తెరకెక్కింన మార్కో కు  ఫిదా అయిన మాస్ ఆడియన్స్… ఏకంగా 100 కోట్ల కలెక్షన్స్ ఇచ్చారు.

Also Read: ప్రభాస్, షారుఖ్ కంటే ఎక్కువ ఆస్తులు ఉన్న కమెడియన్, ప్రపంచంలోనే రిచ్చెస్ట్ కామెడీ యాక్టర్ ఎవరో తెలుసా?

34

ఇక ఇంత పెద్ద హిట్ ఇచ్చిన స్టార్  హీరో ఎంతో సింపుల్ గా ఉండటానికి ఇష్టపడుతుంటారు.  ముకుందన్.. రోడ్డు పక్కన పిల్లలతో సరదాగా క్రికెట్ ఆడుతోన్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సినిమా షూటింగులకు కాస్త బ్రేక్‌ ఇచ్చి.. తన బాల్యాన్ని ఇలా గుర్తు చేసుకుంటున్నాడు యంగ్ హీరో. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ చేస్తూ.. తాను సెలబ్రిటీని అన్న విషయం మర్చిపోయి పిల్లలతో  కలిసిపోయాడు. 

Also Read:  పెళ్లి, విడాకులు, అనారోగ్యం, స్టార్ హీరోయిన్ సమంత లైఫ్ జర్నీ, పల్లవరం to పాన్ ఇండియా

44
actor unni mukundan share his happiness to marco enter 100 crore club

మలయాళంతో పాటు తమిళ, తెలుగు సినిమాలు కూడా చేశారు ఉన్నిముకుందన్. తెలుగులో ఈ హీరో జనతా గ్యారేజ్, భాగమతి లాంటి హిట్ సినిమాల్లో నటించారు.  ప్రస్తుతం ఉన్ని ముకుందన్ గంధర్వ జూనియర్‌ అనే ఫాంటసీ సూపర్ హీరో పిక్చర్ చేస్తున్నాడు.  గతంలో ఎప్పుడు ఈ తరహా కాన్సెప్ట్ రాలేదని ఆయన అంటున్నారు. ఈ సారి కూడా పాన్ ఇండియా  మార్కెట్‌ ను  ఈ హీరో టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఈసినిమాతో పాటు   ప్రేమలు మూవీ డైరెక్టర్‌‌ ఆల్ఫాన్సో పుత్రేన్‌తోనూ ఉన్ని ముకుందన్ ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories