10 ఏళ్లు పూర్తి చేసుకున్న ఇంగ్లీష్ వింగ్లీష్ మూవీ, శ్రీదేవికి ఘన నివాళి... వేలానికి అతిలోక సుందరి చీర

First Published Oct 11, 2022, 10:50 AM IST

అతిలోక సందరి శ్రీదేవి ఈ ప్రపంచాన్ని విడిచి నాలుగేళ్ళు దాటిపోయింది. అయినా ఆమె జ్ఞాపకాలు సినీ ప్రియులను వెంటాడుతూనే ఉన్నాయి.  ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో శ్రీదేవి నటించి మొదటి సినిమా ఇంగ్లిష్ వింగ్లిష్ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అందాల నటిని తలుచుకున్నారు టీమ్. ఘన నివాళి ప్లాన్ చేశారు. 
 

శ్రీదేవి అంటే ఇష్టపడని సినిమా ప్రియులు ఉండరు. ఆమె కోసం పడిచచ్చే అభిమానులు కో కొల్లలుగా ఉన్నారు. ఇప్పటికీ ఆమెను తలుచుకని బాధపడుతుంటారు. ప్రస్తుతం శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఆమె వారసత్వాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. వరుస సినిమాలతో స్టార్ గా బాలీవుడ్ ను ఏలే ప్రయత్నం చేస్తోంది.

చీరకట్టులో నటి శ్రీదేవి అందాన్ని వర్ణించలేం. దేశవ్యాప్తంగా లక్షలాది అభిమానుల మనసు గెలుచుకున్న శ్రీదేవి.. ఇంగ్లిష్ వింగ్లిష్ లో చీరకట్టుతో అద్భుతం సృష్టించింది. ఇక ఇంగ్లిష్ వింగ్లిష్  సినిమా రిలీజ్ అయ్యి అక్టోబర్ 10తో పదేళ్లు పూర్తైన  సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని  నిర్వహించారు టీమ్. ఈ సినిమా పదేళ్ల వేడుకను నిర్వహించడంతోపాటు, ఇంగ్లిష్ వింగ్లిష్ లో శ్రీదేవి  కట్టిన అన్ని  చీరలను వేలం వేయనున్నట్టు మూవీ రచయిత, దర్శకురాలు డైరెక్టర్  గౌరీ షిండే స్వయంగా ప్రకటించారు. 
 

వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని బాలికల విద్య కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థకు ఇవ్వనున్నారు. ఇంగ్లిష్ వింగ్లిష్ లో సగటు ఇల్లాలిగా, ఇంగ్లింష్ ప్రావీణ్యం లేని పాత్రలో శ్రీదేవి నటించి మెప్పించింది. ఇంగ్లిష్ నేర్చుకోవడం కోసం ఆమె పడే  ఇబ్బందులు ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు మేకర్స్. చాలా మంది గృహిణులకు ఆదర్శంగా నిలిచింది సినిమా. 
 

ఇక ఈ సినిమా 10ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన కార్యక్రమంలో  నిర్మాత ఆర్ బాల్కీ, నిర్మాత మరియు దర్శకుడు బోనీ కపూర్, ఖుషీ కపూర్, శ్రేయా ధన్వంతరి, సయామి ఖేర్ లతో పాటు.. మూవీలో నటించిన తారాగణం - నవికా కోటియా, శివాంశ్ కోటియా, దిర్. గౌరీ షిండే, గేయ రచయిత స్వానంద్ కిర్కిరే, రాజీవ్ రవీంద్రనాథన్, సినిమాటోగ్రఫీ లక్ష్మణ్ ఉటేకర్ మరియు గేయ రచయిత-స్క్రీన్ రైటర్ కౌసర్ మునీర్ తదితరులు పాల్గొన్నారు. 
 

రచయిత మరియు దర్శకురాలు గౌరీ షిండే  మాట్లాడుతూ.. ఇంగ్లీష్ వింగ్లీష్ చేయడం నా జీవితంలో చేసిన మంచి పనుల్లో ఒకటిగా భావిస్తాను అన్నారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న శ్రీదేవితో ఇంగ్లీష్ం విగ్లీష్ సినిమా చయడం ఒక గొప్ప అద్భుతం,అదృష్టంగాభావిస్తున్నాను అన్నారు. ఆ సినిమాకు సంబంధించిన వారు అంతా ఇక్కడ ఉన్నారు. కాని శ్రీదేవి గారు లేకపోవడం చాలా పెద్ద లోటు. కాని ఇలా శ్రీదేవి గారు గురించి ఇక్కడ మాట్లాడుకోవడం.. ఆమె జ్ఞాపకాల పంచుకోవడం  చాలా గొప్పగా అనిపించింది. అన్నారు. 

ఇక ఈ సందర్భంగా శ్రీదేవి ఐకానిక్ చీరలను వేలం వేస్తామని ప్రకటించడంతో ప్యానల్ డిస్కషన్ ముగిసింది,. తద్వారా వచ్చే మొత్తాన్ని యువతుల చదువుకు వెచ్చిస్తాం. శ్రీదేవి తన చీరలు ధరించి ర్యాంప్ వాక్ చేసే ఫ్యాషన్ షో చేయాలని నేను ఎప్పటినుంచో కోరుకుంటున్నాను. శ్రీదేవికి కూడా అదే కోరుకున్నారు. . దురదృష్టవశాత్తు ఆమె బ్రతికి ఉన్నప్పుడు  అది సాధ్యం కాలేదు. ఇప్పుడు ఆమె లేదు. చేయడం  కుదరదు కనుకు ఈ వేలం నాకు చాలా ముఖ్యమైనది మరియు చాలా ప్రత్యేకమైనది అని గౌరి తెలిపారు.

కొన్నేళ్ల పాటు సౌత్ తో పాటు బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలిన శ్రీదేవి బోనీ కపూర్ తో పెళ్లి తరువాత.. కుటుంబ బాధ్యతలపై పడిపోయింది. దాంతో  1997 లో సినిమాలకు కాస్త విరామం ఇచ్చింది అతిలోక సుందరి.ఇక ఆమె మళ్లీ సినిమాల్లోకి రాదు అనుకుంటున్న టైమ్ లో .. తిరిగి 2012 లో ఇంగ్లిష్-వింగ్లిష్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఈ సినిమాలో సగటు గృహిని పాత్రలో శ్రీదేవి మరోసారి అభిమానులను అలరించింది. 

click me!