ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... మాధవ్,రుక్మిణి, దేవిని కారులో తీసుకువెళ్లి ఆదిత్య ఇంటిదగ్గర ఆపుతాడు. దేవి కారు దిగుతుం.ది రుక్మిణి మాత్రం కార్ దిగకుండా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోమని మాధవ్ని అంటుంది. అప్పుడు మాధవ్ తెలివిగా, పాపం దేవి రమ్మంటుంటే వెళ్లవేంటి అని అంటాడు. ఈ లోగా దేవుడమ్మ ఎవరో కారాగింది అని బయటకు వస్తుంది. ఈ సారికి నువ్వు వెళ్ళు, తర్వాత మేను వస్తామని మాధవ్ అంటాడు. దేవిని లోపలికి వస్తుంది. అప్పుడు కార్ తిరిగి వెళ్ళిపోతుంది.ఇంతసేపు అయింది ఎందుకు కార్ దిగి లోపలికి రాడానికి? అని దేవుడమ్మ అడగగా, అమ్మానాన్న కూడా వచ్చారు కానీ మా అమ్మ లోపలికి రమ్మంటే ఏదో పని ఉంది అని చెప్పి వెళ్ళిపోయింది అని అంటుంది.