Eesha rebba: క్యాసినో వివాదంలో ఈషారెబ్బా.. ఈడీ దర్యాప్తులో షాకిచ్చే రహస్యాలు వెల్లడి?.. అక్కడేం చేసిందంటే?

Published : Jul 30, 2022, 08:26 AM ISTUpdated : Jul 30, 2022, 08:53 AM IST

ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'అరవింద సమేత.. వీరరాఘవ', అక్కినేని వారసుడి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి చిత్రాల్లో నటించింది. అవి కూడా పెద్దగా సక్సెస్ తీసుకురాలేకపోయాయి. కెరీర్ సంగతి ఎలా ఉన్నా కూడా సోషల్ మీడియాను హీటెక్కించడంలో మాత్రం ముందే ఉంటోంది ఈషా. 

PREV
111
 Eesha rebba: క్యాసినో వివాదంలో ఈషారెబ్బా.. ఈడీ దర్యాప్తులో షాకిచ్చే రహస్యాలు వెల్లడి?.. అక్కడేం చేసిందంటే?

ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. `ఒట్టు` అనే మలయాళ మూవీ, `అయిరామ్‌ జెన్మంగల్` అనే తమిళ సినిమా చేస్తుంది. మరోవైపు ఓటీటీ పై ఫోకస్‌ పెట్టింది. సినిమాలు రావడంలో లేదని కొత్తగా అందివచ్చిన ఓటీటీని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది ఈషా. ఆ మధ్య పూర్ణ, పాయల్‌ రాజ్ పుత్‌లతో కలిసి `3రోజెస్‌` అనే వెబ్‌ సిరీస్‌ చేసిన విషయం తెలిసిందే. బోల్డ్ రోల్‌లో కనిపించి వాహ్‌ అనిపించింది.

211

`అంతకు ముందు ఆ తర్వాత`, `బందిపోటు`, `అమీ తుమీ`, `అ!` చిత్రాలతో విజయాలను అందుకుంది.   `రాగల 24గంటల్లో` చిత్రంతో మెయిన్‌ లీడ్‌ చేసింది. ఈషా రెబ్బ  సినిమాలతో ఫేమస్ హీరోయిన్ కాలేకపోయినప్పటికీ ఈమె పరిచయంలేని ప్రేక్షకుడు లేడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వెండితెరపై తనదైన గ్లామర్ ఒలకబోస్తూ ఫేమ్ కొట్టేసిన ఈ బ్యూటీకి అదృష్టం మాత్రం కలసి రావడం మాట దేవెడురుగు దురదృష్టం వెంటాడుతోంది. నేపాల్‌(Nepal)లో క్యాసినో ఈవెంట్ల(Casino Events) నిర్వహణ వ్యవహారంలో ఆమెకు పారితోషికం చెల్లించారనే వార్త బయటకురావటం తెలుగు సినీ వర్గాల్లో  హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ప్రముఖ దిన పత్రికలు `ఆంధ్రజ్యోతి`, `ఇండియన్‌ ఎక్స్ ప్రెస్‌` వంటి వాటిలోని కథనాలొచ్చాయి. 

311

 మొదట మోడలింగ్ చేస్తూ పలు బ్రాండ్స్ ప్రమోట్ చేసిన ఈషా రెబ్బ.. 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే  ఇండస్ట్రీ దృష్టి తనపై పడేలా చేసుకొని ఆ వెంటనే 'అంతకు ముందు ఆ తర్వాత' అనే సినిమా చేసి హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసింది ఈ తెలుగమ్మాయి. తెలుగులో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది ఈషా రెబ్బా. అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని విజయాలు అందుకుంది. స్టార్‌ హీరోలతో చేసే ఛాన్స్ లు రాలేదు కానీ, చిన్న సినిమాలతోనైనా పేరు, గుర్తింపు తెచ్చుకోవడం విశేషం. 

411

మెయిన్ హీరోయిన్ ఎలాగూ సక్సెస్ తేవడం లేదని.. సెకండ్ హీరోయిన్ గానూ చేయడానికి ముందుకొచ్చింది అందాల ఈషా. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'అరవింద సమేత.. వీరరాఘవ', అక్కినేని వారసుడి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి చిత్రాల్లో నటించింది. అయినా అవి తనకు పెద్దగా సక్సెస్ తీసుకురాలేకపోయాయి. కానీ ఈ తెలుగు హీరోయిన్‌ మాత్రం తన అందాల జడివానలో కుర్రాళ్ల‌ను తడిపేస్తోంది.  వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటూ, విభిన్న పాత్ర‌ల‌ను పోషిస్తూ త‌న పాపులారిటీని పెంచుకుంటోంది.

511

 'పిట్ట కథలు' అనే ఓ వెబ్ సిరీస్‌లోనూ ఈషా నటించింది. ఇలా మరికొన్ని సిరీస్‌లను చేసేందుకు సిద్ధమవుతోంది.  సోషల్ మీడియాలో తరచుగా మతిపోగోట్టే విధంగా హాట్ ఫొటోస్ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే.  మత్తు కళ్లతో, ముఖంలో చంద్రబింబం లాంటి వెలుగుతో ఈషా రెబ్బా గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది.  కెరీర్ సంగతి ఎలా ఉన్నా కూడా సోషల్ మీడియాను హీటెక్కించడంలో మాత్రం ముందే ఉంటోంది ఈషా. అయితే అనుకోకుండా బయటకు వచ్చిన ఓ వార్త ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

611

ఇంగ్లీష్‌ మీడియా, సోషల్‌ మీడియా కథనాల ప్రకారం.. క్యాసినో ఈవెంట్ల  నిందితుల్లో ఒకడిగా చికోటి ప్రవీణ్(chikoti praveen) లింకులు, చెల్లింపులు వెలుగుచూస్తున్నాయి.  ఈషా రెబ్బకు రూ.40 లక్షలు చొప్పున చీకోటి ప్రవీణ్ చెల్లించినట్టు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. దీంతో పారితోషకం అందుకున్న తారలకు నోటీసులు ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. 

711

చీకోటి ప్రవీణ్‌, మాధవరెడ్డి నేపాల్‌లో నడిపిన క్యాసినో దందాకు సంబంధించి ఈడీ విచారణలో పలు ఆసక్తిక అంశాలు వెలుగులోకి వచ్చాయి. నేపాల్‌, గోవాలో క్యాసినోలు చట్టబద్ధం కావడంతో.. తెలుగు రాష్ట్రాల నుంచి వారు జూదప్రియులను ప్రత్యేక విమానాల్లో అక్కడికి తరలించేవారు. అలాగే ప్రముఖులను ఆకర్షించేందుకు ప్రముఖ సినీ నటులతో ప్రచారం చేయించడంతోపాటు క్యాసినోలు నిర్వహించేచోట వినోదాన్ని అందించేందుకు సినీ తారలను రప్పించేవారు.

811

ఇలా వీరి క్యాసినోల్లో సందడి చేసిన తారల్లో.. బాలీవుడ్‌ నటీమణులు మల్లికా షెరావత్‌, అమీషా పటేల్‌, తెలుగు చిత్రాల్లోనూ ఐటమ్‌ సాంగ్స్‌ ద్వారా పాపులర్‌ అయిన ముమైత్‌ ఖాన్‌, టాలీవుడ్‌ కు చెందిన ఈషా రెబ్బా, డింపుల్‌ హయతి, కొరియోగ్రాఫర్‌ గణేశ్‌ ఆచార్య వంటివారు ఉన్నారు. 

 

911

ముఖ్యంగా.. నేపాల్‌లో నిర్వహించిన క్యాసినోకు వచ్చిన మల్లికా షెరావత్‌ మూడు రోజులపాటు అక్కడే ఉన్నారు. ఇందుకుగాను ఆమెకు రూ.కోటికి పైగా చెల్లించినట్టు తెలిసింది.అలాగే అమీషా పటేల్‌కు రూ.80లక్షలు, ప్రముఖ బాలీవుడ్‌ నటుడు గోవిందకు రూ.50 లక్షలు, డింపుల్‌ హయాతీ, ఈషారెబ్బలకు రూ.40 లక్షలు, ముమైత్‌ ఖాన్‌కు రూ.20 లక్షలు.. చెల్లించినట్టు బయిటకు వచ్చింది.  

1011
Eesha Rebba

నటీమణులకు డబ్బులు హవాలా మార్గంలో ఇచ్చారా? లేక అకౌంట్‌ ద్వారా ఇచ్చారా అనే అంశంపై ఈడీ మరింత లోతుగా విచారణ జరపనుంది.  నటీనటులను క్యాసినో వరకే పరిమితం చేశారా.. మనీలాండరింగ్‌, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లోనూ ఉపయోగించుకున్నారా అన్న అంశాలపైనా ఈడీ విచారణ జరపనుంది. అయితే ఇందులో నిజమెంతా అనేది తెలాల్సి ఉంది. కానీ ఇప్పుడీ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి, హాట్‌ టాపిక్ అవుతుంది.

1111

ప్రస్తుతం ఈషా రెబ్బా తమిళం, మలయాళంలో `ఒట్టు` అనే చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాతో మలయాళంలోకి ఎంట్రీ ఇస్తుంది. అలాగే తమిళంలో `అయిరామ్‌ జెన్మంగల్‌` సినిమా చేస్తుంది. ఇది చాలా రోజులుగా పెండింగ్‌లో ఉంది. సరైనా ఆఫర్స్ లేకపోయినా గ్లామర్‌ ఫోటోలు పంచుకుంటూ తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. సామాజిక మాధ్యమాల ద్వారా ఎంతో కొంత సంపాదిస్తుంది ఈషా. తెలుగు సినిమాల్లో వ‌స్తున్న అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకుంటూనే.. అటు త‌మిళంలోనూ ప‌లు ఆఫ‌ర్ల‌ను చేజిక్కించుకుంది. అదేవిధంగా వెబ్ సిరీస్‌ల‌లోనూ న‌టిస్తూ త‌న మార్క్ చూపిస్తోంది. ఈపాటికే స్టార్ హీరోయిన్ హోదాను ద‌క్కించుకోవాల్సిన ఈషాకు కాలం క‌లిసి రాలేదు. దీంతో ఇప్ప‌టికీ మంచి బ్రేక్   కోసం చూస్తోంది. 

click me!

Recommended Stories