అక్కడ లాస్య నందులు అన్న కొన్ని మాటలకి ఇంట్లో వాళ్ళందరూ తిరగబడతారు. ఆ,అర్థమయ్యి, అర్థం కాని సంఘటనను చూసి సామ్రాట్ ఆలోచనలలో పడతాడు. ఈలోగా సామ్రాట్ వంట చేయడానికి వెళతాడు మీరు వంట చేస్తారా? అని తులసి అనగా,మా సామ్రాట్ వంట చాలా బాగుంతుంది అని సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అంటారు. అప్పుడు లాస్య గొప్పలకు పోయి నందు కి కూడా వంట బాగా వచ్చు అని అనగా, సామ్రాట్ అయితే ఈ రోజు మేమిద్దరం వంట చేసేస్తాము అని అంటాడు.