ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... జ్ఞానాంబ జానకికి తన షరతులని చెబుతుంది. ఈ షరతులు అన్నిటికీ ఒప్పుకుంటేనే నీకు చదువుకోడానికి నేను అనుమతిని ఇస్తాను అని అంటుంది.సరే అని జానకి అనగా, రామా ఈ షరతులకి లోబడి ఉండడం చాలా కష్టం అని జానకిని ఆపుతాడు. కానీ జానకి, నేను అన్నీ ఆలోచించుకుని నిర్ణయం తీసుకున్నాను అని అంటుంది. అప్పుడు జ్ఞానం, జానకి చేయి పట్టుకొని దేవుడి దగ్గరకు తీసుకెళ్ళి ఐదు అంకెలు రాసి నేను నీకు అయిదు అవకాశాలు ఇస్తున్నాను. అయిదు అవకాశాలు అయిపోయిన తర్వాత నేను ఏం చెప్తే అది నువ్వు చేయాలి అని అంటుంది జ్ఞానం.