యాంకర్ సుమ ఫ్యూచర్ డిసైడ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్, స్టార్ యాంకర్ పై తారక్ షాకింగ్ కామెంట్స్..

First Published | Nov 6, 2024, 4:32 PM IST

50 ఏళ్లు దగ్గరికి వచ్చినా... యాంకర్ గా ఇంకా స్టార్ డమ్ తో రాణిస్తూనే ఉంది సుమ. అయితే ఫూచర్ లో సుమ ఏం చేయబోతోంది. యాంకరింగ్ తరువాత ఆమె ఏం చేస్తుందో చెప్పుకొచ్చాడు స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్. రాజీవ్ కనకాలతో పాటు సుమ చేసే పని ఇదే అని ఆయన అన్నారు ఇంతకీ  ఆమే ఎం చేస్తుందంటే..? 
 

సుమ దాదాపు ఈ జనరేషన్ వారందరికి చిన్నతనం నుంచే తెలిసిన యాంకర్. దాదాపు 25 నుంచి 30 ఏళ్లుగా  యాంకరింగ్ రంగంలో తనదైన మార్క్ వేసింది సుమ. ఫిల్మ్ ఇండస్రీలో మాత్రం 30 ఏళ్లకు పైగానే  కొనసాగుతుంది సుమ. ఆమె ఫీల్డ్ లో ఉండగానే పదుల సంఖ్యలో యాంకర్స్ వచ్చారు. స్టార్ డమ్ అనుభవించారు.. రిటైర్ అయ్యి పెళ్ళిళ్లు చేసుకున్నారు. కొంత మంది అసలే కనుమరుగు అయ్యారు. 

Also Read:  కన్నడ బ్యాచ్ కు చుక్కలు చూపిస్తున్న గౌతమ్, యష్మీ విషయంలో ఆలోచనలో పడ్డ నిఖిల్..

అయినా సరే సుమ డిమాండ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. యాంకరింగ్ లో స్టార్లు సూపర్ స్టార్లు మెగాస్టార్లు.. ఇలా ఏమున్నా అవన్నీ సుమకే వర్తిస్తాయి ఎందుకుంటే ఇప్పటికీ పెద్ద ఈవెంట్ ఏదైనా సరే సుమను వెతుక్కుంటూ వెళ్ళాల్సిందే. పేపర్ చూడకుండా.. స్పాంటినియస్ గా స్పందిస్తూ.. స్థాయిని బట్టి స్టార్లపై కూడా కాస్త అటు ఇటుగా ఫీల్ అవ్వకుండా పంచులు వేస్తూ.. అద్భుతంగా హోస్టింగ్ చేస్తుంది సుమ. 

Also Read: హీరో గోపీచంద్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సినిమా ఏదో తెలుసా..?


ఆ కార్యక్రమానికి నిండుదనాన్ని. అద్భుతమైన విజయాన్ని అందించడంతో సుమ పాత్రే ఎక్కువ. అయితే నటుడిగా రాజీవ్ కనకాలకు పెద్దగా ఆఫర్లు లేకపోయినా.. సుమ ఈవేంట్లు మాత్రం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా కొనసాగుతుంది. అయితే సుమకు ఇప్పటికే 50 ఏళ్లు వచ్చేస్తున్నాయి. అయినా కూడా ఏమాత్రం తగ్గేది లేదంటోంది. ఇంకో పదేళ్లు యాంకరింగ్ లో నేను స్టార్ ను అంటోంది. 

Also Read:  గంగవ్వ కంటే నాగార్జున పెద్దవాడా..?

NTR

అయితే ఆతరువాత పరిస్థితి ఏంటి. బాగా ఓల్డ్ అయిపోయిన తరువాత సుమ ఏం చేస్తుంది. ఇన్నాళ్లు కష్టపడ్డాం ఇక రెస్ట్ తీసుకోవడమే అని రిటైర్ అవుతుందా..?లేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను కొనసాగిస్తుందా..? ఈ విషయంలో సుమ క్లారిటీ ఇవ్వలేదు కాని.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం ఈ విషయంలో స్పందించారు. సుమ భర్త రాజీవ్ కనకాల ఎన్టీఆర్ ప్రాణ స్నేహితులు కావడం.. సుమతో కూడా ఎన్టీఆర్ కు చనువు ఉంది. 

Also Read:  నయనతారతో లిప్‌లాక్ సీన్‌..? కొత్త బాంబు పేల్చిన యంగ్ హీరో!

ఇద్దరు సినిమా ఈవెంట్లలో పంచ్ లు వేసుకుంటూ ఉంటారు. ఈక్రమంలో ఆర్ఆర్ఆర్ ఇంటర్వ్యూల టైమ్ లో సుమ విషయం చర్చకు వచ్చింది. సుమ దాదాపు తెలుగు, తమిళ, తన మాతృభాష మలయాళం, ఇంగ్లీష్. హిందీ భాషలు మాట్లాడగలదు.

ఇక యాంకర్ కాబట్టి ఇప్పటికే ఎన్నో సంవత్సరాలుగా మాట్లాడుతూనే ఉంది. నేను కన్నాంబ, కాంచనమాల, ఆ కాలం నుంచి మాట్లాడుతూనే ఉన్నాను స్టేజ్ పైనా అని సుమ సరదాగా అంది. 

అప్పుడు ఎన్టీఆర్ కలుగజేసుకుని. మొన్న కీరవాణిగారితో ఇంటర్వ్యూ అప్పుడు ఈ విషయమే మాట్లాడుకున్నాము. సుమ యాంకర్ గా రిటైర్ అయ్యాక ఏం చేస్తుంది అంటే.. సూర్యాకాంతం, ఛాయాదేవి, నిర్మలమ్మ లాంటి గడసరి అత్త, నోరేసుకుని పడిపోయే అత్త పాత్రలు చేస్తుంది, అవే సుమకు కరెక్ట్.. అప్పుడు రాజీవ్ కూడా వెంటే ఉంటాడు. 

Also Read:  కోట శ్రీనివాసరావు ముఖంపై కాండ్రించి ఉమ్మేసిన బాలకృష్ణ

రేలంగి లాగా నోరు పడిపోయి.. పెళ్ళి చేతిలో కీలుబొమ్మ మొగుడు పాత్రలు చేస్తాడు నీతో అంటూ ఎన్టీఆర్ సుమ ఫ్యూచర్ లో ఏం చేయాలోచెప్పేశాడు. దాంతో ఇంటర్వ్యూలో నవ్వులు పూశాయి. నిజంగా ఎన్టీఆర్ చెప్పిన్నట్టుగా సుమ ఏజ్ బార్ అయిన తరువాత రాజీవ్ తో కలిసి ఇలాంటి పాత్రలు చేస్తే బాగుంటుంది అని నెటిజన్లు కూడా సపోర్ట్ చేస్తున్నారు. తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. 

Latest Videos

click me!