AC Fan Power consumption: ఏసీ, ఫ్యాన్‌ వాడటం వల్ల మీకు కరెంట్‌ బిల్లు ఎంత వస్తుందో తెలుసా?

AC Fan Power consumption: అసలే ఎండలు, ఆపైగా ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే భానుడి భగభగలతో చెమటలు పడుతున్నాయి. దీంతో ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్యాన్, ఏసీ 24గంటలు వినియోగించాల్సి వస్తోంది. అయితే.. నెలాఖరులో కరెంట్‌ బిల్లు చూసిన వారికి మాత్రం కళ్లుభైర్లు కమ్ముతున్నాయి. అసలు మీరు ఇంట్లో ఉండే ఏసీ, ఫ్యాన్‌కు ఎన్ని గంటలు పనిచేస్తే ఎన్ని యూనిట్లు కాలుతుందో మీకు తెలిసా.. ఇది తెలుసుకుంటే మీకు కరెంట్‌ను పొదుపుగా వాడి డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందామా? 
 

How Much Power Your AC Fan Use Daily  Simple Way to Calculate Your Electricity Bill in telugu tbr
Daily Electricity Bill of AC Fan

మన ఇంట్లో ఉండే ఫ్యాన్, ఏసీ, ఇతర ఎలక్ట్రికల్‌ వస్తువుల వినియోగం అంటే కన్సంప్షన్, బిల్లు ఎలా లెక్కిస్తారో తెలుసుకుందాం. మీరు వాడే ఫ్యాన్, ఏసీ వాటి పవర్ రేటింగ్ వాట్స్‌ ఆధారంగా విద్యుత్ ఖర్చు మారుతుంటుంది. 

How Much Power Your AC Fan Use Daily  Simple Way to Calculate Your Electricity Bill in telugu tbr
Daily Electricity Bill of AC Fan

ఉదాహరణకు మీరు వాడే ఫ్యాన్‌ పవర్ రేటింగ్ 75W - 100W మధ్య ఉందని అనుకుందాం. సాధారణంగా అన్ని సీలింగ్‌ ఫ్యాన్‌లకు ఈ వాట్ల పరిమాణంలో ఉంటుంది. ఈ మధ్య కాలంలో అందరూ హైస్పీడ్‌ ఫ్యాన్‌లను కొనుగోలు చేస్తున్నారు. వాటి గరిష్ట వాట్స్‌ 100W వరకు ఉంటుంది. 


Air Conditioner

ఇక ఫ్యాన్‌ పవర్ రేటింగ్ 75W - 100W విద్యుత్ వినియోగానికి వస్తే.. 100W ఫ్యాన్ ఒక గంటకు 100W విద్యత్తును ఖర్చుచేస్తుంది. అంటే, ఒక కిలోవాట్ -గంట (kWh) = 1000 వాట్స్‌కి సమానం. ఇక 100W ఫ్యాన్ 10 గంటలు తిరిగితే ఒక యూనిట్ విద్యుత్తు ఖర్చవుతుంది. ఇక ఒక గంటలో 100W ఫ్యాన్ = 0.1 యూనిట్ ఇలా రోజంతా 24 గంటలకు = 0.1 * 24 = 2.4 యూనిట్లు ఖర్చవుతుంది. ఈ లెక్కన నెలకు 72 యూనిట్లు విద్యుత్తు వరకు ఖర్చవుతుంది.  

Daily Electricity Bill of AC Fan

మన ఇంట్లో ఏసీ విషయానికి వస్తే.. పవర్ రేటింగ్ 1.5kW నుంచి 2kW వరకు వాటి సామర్థ్యం ఉంటుంది. ఏసీ ప్రారంభం 24°C వద్ద స్టార్ట్‌ అవుతుంది. అందరూ వినియోగించే ఏసీలు సాధారణంగా 1.5kW - 2kW విద్యుత్ వినియోగిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఏసీ మోడల్, ఎఫీషియెన్సీ మీద ఆధారపడి వినియోగం మారవచ్చు. ఇక ఏసీ విద్యుత్ వినియోగం.. 1.5kW ఏసీ ఒక గంటకు 1.5 యూనిట్లు ఖర్చవుతుంది. ఇలా 24 గంటలకు = 1.5 * 24 = 36 యూనిట్లు వరకు అవుతుంది. 

Daily Electricity Bill of AC Fan

ఇప్పటి వరకు యూనిట్ల విషయం తెలుసుకున్నాం కదా.. ఇప్పుడు ఆ యూనిట్లకు విద్యుత్ బిల్లు లెక్కలు ఇలా ఉంటాయి. అయితే ప్రతి యూనిట్ ధర ప్రాంతాన్నిబట్టి మారుతుంది. నగరాల్లో ఒకలా గ్రామాల్లో ఒకలా యూనిట్‌ ధర ఉంటుంది. ఉదాహరణకు, ఒక యూనిట్ ధర రూ.5 అనుకుంటే.. ఫ్యాన్ ఒక రోజు అనగా 24 గంటలు పనిచేస్తే 2.4 యూనిట్లు దీనికి అయ్యే ఖర్చు 12 రూపాయలు. ఏసీ ఒకరోజు పనిచేస్తే 
 36 యూనిట్లు పనిచేస్తే రూ.180 వరకు అవుతుంది. ఈ లెక్కన ఏసీ, ఫ్యాన్‌ హైస్పీడ్‌లో వినియోగిస్తే 192 రూపాయల వరకు రోజుకి ఖర్చవుతుంది. 

Latest Videos

vuukle one pixel image
click me!