Today Horoscope: ఓ రాశివారికి ఈ రోజు చాలా శుభప్రదంగా ఉండబోతోంది

First Published | Mar 4, 2024, 5:30 AM IST

Today Horoscope:ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి ఈ రోజు.. ఇతరులతో అకారణంగా విరోధాలు ఏర్పడగలవు.వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారాలలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను.
 

4-3-2024,సోమవారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలు తో..)


జోశ్యుల రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు పెట్టండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

telugu astrology

మేషం (అశ్విని భరణి కృత్తిక 1)
నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారాబలం
అశ్విని నక్షత్రం వారికి (పరమమిత్ర తార) వ్యవహారాల్లో ఆటంకాలు.అకారణ కలహాలు.శారీరక బాధలు.ధన నష్టము ఏర్పడును.

భరణి నక్షత్రం వారికి(మిత్ర తార) వ్యాపారంలో అధిక ఆదాయం లభిస్తుంది. తలచిన కార్యాలు అప్రయత్నముగా పూర్తగును. విలాసవంతంగా గడుపుతారు.

కృత్తిక నక్షత్రం వారికి(నైధనతార)చేసే పనిలో ఆటంకాలు.వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.అనవసరపు ఖర్చులు.

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు.నూతన పరిచయాలు ఏర్పడగలవు.శుభవార్తలు వింటారు.ఆత్మీయుల కలయిక.విలాసవంతమైన ఖర్చు చేస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.ఇతరులకు సహాయ పడతారు.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.నూతన ఆలోచనలు కలసి వస్తాయి.
 


telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి  మృగశిర 1 2)
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
రోహిణి నక్షత్రం వారికి (సాధన తార)అన్ని వృత్తుల వారికి అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం.

మృగశిర నక్షత్రం వారికి (ప్రత్యక్తార)అనుకోని సంఘటనలు ఎదురవుతాయి.అకారణ కలహాలు.వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త అవసరం.పనులలో ఆటంకాలు


దిన ఫలం:-ఇతరులతో అకారణంగా విరోధాలు ఏర్పడగలవు.వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారాలలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను.ముఖ్యమైన వస్తువులు యందు జాగ్రత్త అవసరం.ప్రయత్న కార్యాలు ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగాలలో అంకితభావం చూపించాలి.ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగు వచ్చు.ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి.
 

telugu astrology

మిథునం(మృగశిర 3 4, ఆరుద్ర  పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
ఆరుద్ర నక్షత్రం వారికి (క్షేమతార) తలపెట్టిన కార్యాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాల్లో ధనాభివృద్ధి. ఆరోగ్య విషయంలో ఉపశమనం లభిస్తుంది.

పునర్వసు నక్షత్రం వారికి (విపత్తార)అనుకోని సంఘటనలు ఎదురవుతాయి.అకారణ కలహాలు.వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త అవసరం.పనులలో ఆటంకాలు.

దిన ఫలం:-చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడి నిదానముగా సాగుతాయి.ఉద్యోగాలలో అధికారులు తో వివాదాలకు దూరంగా ఉండాలి.ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.దీర్ఘకాలిక రుణాలు నుంచి ఒత్తిడి పెరుగుతుంది.వ్యాపారాలలో సొంత నిర్ణయాలు కలిసిరావు.గృహంలో ఎవరి తీరు వారిదిగా ఉంటుంది.మానసిక ఒత్తిడి ఆందోళనగా ఉండటం.శారీరక శ్రమ పెరుగుతుంది .కొత్త సమస్యలు ఏర్పడగలవు. ఖర్చు విషయంలో ఆచితూచి అడుగులు వేయవలెను.
 

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి ఆశ్లేష )
నామ నక్షత్రాలు(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పుష్యమి నక్షత్రం వారికి(సంపత్తార)వృత్తి వ్యాపారాల్లో ధనలాభం.శుభవార్త వింటారు. వ్యక్తిగతంగా విలువ పెరుగుతుంది.ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.

ఆశ్రేష నక్షత్రం వారికి (జన్మతార) అధికారులుతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును.శారీరక శ్రమ అధికం.

దిన ఫలం:-తలపెట్టిన పనులు నూతన ఉత్సాహంతో పూర్తి చేస్తారు.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.సంఘంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు.నూతన వస్తు వాహన ప్రాప్తి.ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.కీలక నిర్ణయాలు లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవాలి. అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి.కొన్ని రోజులు గా ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.
 

telugu astrology


సింహం (మఖ పుబ్బ ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి (పరమమిత్ర తార)వ్యవహారాల్లో ఆటంకాలు.అకారణ కలహాలు.శారీరక బాధలు.ధన నష్టము ఏర్పడును.

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (మిత్ర తార)వ్యాపారంలో అధిక ఆదాయం లభిస్తుంది. తలచిన కార్యాలు అప్రయత్నముగా పూర్తగును. విలాసవంతంగా గడుపుతారు.

ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (నైధనతార)చేసే పనిలో ఆటంకాలు. వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.అనవసరపు ఖర్చులు.

దిన ఫలం:-మానసిక ఆందోళన చికాకులు.శారీరక శ్రమ పెరుగుతుంది.చేయు పనులు లో కోపం అధికంగా ఉంటుంది.అపవాదము లు రాగలవు.నమ్మిన వారి వలన ఇబ్బందులు ఎదురవగలవు. వ్యక్తిగతమైన విమర్శలకు దూరంగా ఉండాలి.కోపాన్ని అదుపు చేసుకొని వ్యవహరించాలి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.కుటుంబ సభ్యుల నుంచి ఊహించని రీతిలో ప్రతికూలత పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
 

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
హస్త నక్షత్రం వారికి (సాధన తార)అన్ని వృత్తుల వారికి అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం.

చిత్త నక్షత్రం వారికి (ప్రత్యక్తార)అనుకోని సంఘటనలు ఎదురవుతాయి.అకారణ కలహాలు.వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త అవసరం.పనులలో ఆటంకాలు

దిన ఫలం:-బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.రావలసిన పాత బాకీలు వసూలు అవును.మానసిక ప్రశాంతత లభిస్తుంది.తలపెట్టిన కార్యాల్లో విజయం లభిస్తుంది.వృత్తి వ్యాపారాల్లో ధన లాభం.వస్తూ ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ఉత్సాహంగా గడుపుతారు.నూతన ఆలోచనలు కలసి వస్తాయి.సంతాన విషయంలో అభివృద్ధి కనిపిస్తుంది.గృహంలో శుభకార్యములు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
స్వాతి నక్షత్రం వారికి (క్షేమతార)తలపెట్టిన కార్యాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాల్లో ధనాభివృద్ధి. ఆరోగ్య విషయంలో ఉపశమనం లభిస్తుంది.

విశాఖ నక్షత్రం వారికి (విపత్తార) అనుకోని సంఘటనలు ఎదురవుతాయి.అకారణ కలహాలు.వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త అవసరం.పనులలో ఆటంకాలు.

దిన ఫలం:-సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును.ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి.ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం.గృహమునందు శుభకార్యం జరుగును.
 

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాబలం
అనూరాధ నక్షత్రం వారికి (సంపత్తార)వృత్తి వ్యాపారాల్లో ధనలాభం.శుభవార్త వింటారు. వ్యక్తిగతంగా విలువ పెరుగుతుంది.ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.

జ్యేష్ట నక్షత్రం వారికి (జన్మతార)అధికారులుతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును.శారీరక శ్రమ అధికం.

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలలో లాభాలు.శుభవార్తలు వింటారు.బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు నూతన విద్యల యందు ఆసక్తి చూపిస్తారు. వ్యాపారులకు పెట్టుబడులకు తగిన ధన లాభం కలుగుతుంది.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.నూతన వస్తు వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
 

telugu astrology


ధనుస్సు (మూల  పూ.షాఢ ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రం వారికి (పరమ మిత్ర తార) వ్యవహారాల్లో ఆటంకాలు.అకారణ కలహాలు.శారీరక బాధలు.ధన నష్టము ఏర్పడును.

పూ.షాఢ నక్షత్రం వారికి (మిత్ర తార)వ్యాపారంలో అధిక ఆదాయం లభిస్తుంది. తలచిన కార్యాలు అప్రయత్నముగా పూర్తగును. విలాసవంతంగా గడుపుతారు.

ఉ.షాఢ నక్షత్రం వారికి (నైధనతార)చేసే పనిలో ఆటంకాలు. వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.అనవసరపు ఖర్చులు.

దిన ఫలం:-వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.తలపెట్టిన పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబము నందు ప్రతికూలత వాతావరణం.శారీరక ఇబ్బందులు ఎదురవుతాయి.ఋణ సమస్యల వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది.ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఏర్పడతాయి.వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటుంటాయి.ఆర్థిక ఇబ్బందులు.ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఎదురవుతాయి.అవసరములకు సమర్ధించు కొను ఆదాయం లభిస్తుంది.

telugu astrology

మకరం (ఉ.షాఢ 2 3 4, శ్రవణం ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
శ్రవణా నక్షత్రం వారికి (సాధన తార)అన్ని వృత్తుల వారికి అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం.

ధనిష్ఠ నక్షత్రం వారికి (ప్రత్యక్తార)అనుకోని సంఘటనలు ఎదురవుతాయి.అకారణ కలహాలు.వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త అవసరం.పనులలో ఆటంకాలు

దిన ఫలం:-శారీరక బాధలు పెరుగుతాయి.ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. తలపెట్టిన పనులు ఇబ్బందులు ఎదురవుతాయి.అకారణంగా వచ్చే కోపాన్ని తగ్గించు కోవాలి.ఉద్యోగాలలో అధికారులు తో నూతన సమస్యలు రాగలవు.ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది.వృత్తి వ్యాపారాలు లో ఆశించిన రీతిలో లాభాలు లభించవు.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు రాగలవు.
 

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం  పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
శతభిషం నక్షత్రం వారికి (క్షేమతార)తలపెట్టిన కార్యాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాల్లో ధనాభివృద్ధి. ఆరోగ్య విషయంలో ఉపశమనం లభిస్తుంది.

పూ.భాద్ర నక్షత్రం వారికి (విపత్తార)అనుకోని సంఘటనలు ఎదురవుతాయి.అకారణ కలహాలు.వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త అవసరం.పనులలో ఆటంకాలు.

దిన ఫలం:-వ్యాపారములలో జాగ్రత్త అవసరం. సంఘములో అవమానం జరగవచ్చు.చేయు వ్యవహారాలలో కోపం అధికంగా ఉండును.ఖర్చు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను.ఆరోగ్య సమస్యలు రాగలవు. ఆదాయం కన్నా వ్యయం అధికంగా ఉంటుంది.నష్టం పరమైన ఆలోచనలు అధికంగా చేస్తారు.చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర రేవతి )
నామ నక్షత్రాలు(దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
ఉ.భాద్ర నక్షత్రం వారికి (సంపత్తార) వృత్తి వ్యాపారాల్లో ధనలాభం.శుభవార్త వింటారు. వ్యక్తిగతంగా విలువ పెరుగుతుంది.ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.

రేవతి నక్షత్రం వారికి (జన్మతార)అధికారులు విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

దిన ఫలం:-బంధుమిత్రుల యొక్క కలయిక. వృత్తి వ్యాపారంలో ధన లాభం పొందగలరు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.జీవిత భాగస్వామితో సఖ్యత గా ఉండాలి.వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు.ఉద్యోగాలలో సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది.అన్ని వర్గాల వారు ఉత్సాహవంతంగా ఉంటారు. విద్యార్థులు అనుకూలమైన ఫలితాలు పొందగలరు.ప్రయత్న పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది.

Latest Videos

click me!