Today Horoscope: ఓ రాశివారు జాగ్రత్త.. ఈ రోజు ఒక గొప్ప అవకాశం మీ చేతుల్లోంచి జారిపోవచ్చు

First Published | Mar 3, 2024, 5:30 AM IST

Today Horoscope:ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి ఈ రోజు..తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి కాగలవు.సంసార సౌఖ్యం లభిస్తుంది.మీ మాటకు గౌరవం పెరుగుతుంది.నూతన బాధ్యతల వల్ల హోదా పెరుగుతుంది. 

3-3-2024, ఆది వారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలు తో..)


జోశ్యుల రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్: 8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు పెట్టండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
 

telugu astrology

మేషం (అశ్విని  భరణి  కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారాబలం
అశ్విని నక్షత్రం వారికి (మిత్ర తార) వ్యాపారంలో అధిక ఆదాయం లభిస్తుంది. తలచిన కార్యాలు అప్రయత్నముగా పూర్తగును.విలాసవంతంగా గడుపుతారు.

భరణి నక్షత్రం వారికి (నైధనతార)పనిలో ఆటంకాలు.వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.అనవసరపు ఖర్చులు.

కృత్తిక నక్షత్రం వారికి (సాధన తార) అన్ని వృత్తుల వారికి అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

దిన ఫలం:-వ్యవహారాలలో నిరుత్సాహం.మానసిక ఆందోళనకు గురి అవుతారు.అనారోగ్య సమస్యలు రాగలవు.చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి.వివాదాలకు వాదోపవాదాలకు దూరంగా ఉండాలి.చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.సోదరులతో చిన్నపాటి విభేదాలు రాగలవు.సంతాన విషయంలో శ్రద్ధ అవసరం.ఉద్యోగాలలో కొత్త సమస్యలు ఎదురవగలవు.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
 


telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
రోహిణి నక్షత్రం వారికి(ప్రత్యక్తార)అధిక శ్రమ.అధికారులు తో వివాదాలు.అకారణ కోపం.నిందారోపణలు రాగలవు.

మృగశిర నక్షత్రం వారికి(క్షేమతార) శుభ నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు.వృత్తి వ్యాపారంలో ధన లాభం.

దిన ఫలం:-తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి కాగలవు.సంసార సౌఖ్యం లభిస్తుంది.మీ మాటకు గౌరవం పెరుగుతుంది.నూతన బాధ్యతల వల్ల హోదా పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు.ఇంటా బయట అనుకూలమైన వాతావరణం.నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.కుటుంబంలో శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది.నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
 

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
ఆరుద్ర నక్షత్రం వారికి (విపత్తార)అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త అవసరం. పనులలో ఆటంకాలు.

పునర్వసు నక్షత్రం వారికి (సంపత్తార)శుభవార్తలు వింటారు.వ్యక్తిగతంగా విలువ పెరుగుతుంది.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటుంది .

దిన ఫలం:-నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.ఉద్యోగస్తులకు అధికారులతో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి.చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ అవసరాల నిమిత్తం ధనాన్ని ఖర్చు చేస్తారు.స్నేహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి.ఇంటా బయట పరిస్థితిలు అనుకూలిస్తాయి.సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.
 

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి  ఆశ్లేష 1 2 3 4)
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పుష్యమి నక్షత్రం వారికి(జన్మతార)అధికారులు తో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును.శారీరక శ్రమ అధికం.

ఆశ్రేష నక్షత్రం వారికి (పరమ మిత్ర తార) వ్యవహారాల్లో ఆటంకములు. అకారణ కలహాలు.శారీరక బాధలు.ధన నష్టము ఏర్పడును.

దిన ఫలం:-ఇతరులతో వాదోపవాదాలకు దూరంగా ఉండాలి.జీవిత భాగస్వామి తో సఖ్యత గా ఉండవలెను. ఆర్థిక పరమైన విషయంలో జాగ్రత్త.వృత్తిపరమైన జీవితంలో మిశ్రమ ఫలితాలను పొందగలరు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి.వైవాహిక జీవితంలో చిన్నపాటి చిరాకులు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి సమస్యలు తప్పవు.ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి.
 

telugu astrology

సింహం (మఖ పుబ్బ ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి (మిత్ర తార)వృత్తి వ్యాపారంలో అధిక ధనాదాయం లభించును. నూతన పరిచయాలు కలుగుతాయి.

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (నైధనతార)చేసే పనిలో ఆటంకాలు.వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.అనవసరపు ఖర్చులు.

ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (సాధన తార)అన్ని వృత్తుల వారికి అనుకూలంగా ఉంటుంది.సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి.

దిన ఫలం:-మానసిక ఆనందం పొందగలరు.ప్రముఖులతో పరిచయాలు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది.ధన వ్యవహారాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన పనుల లో శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు.ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది.చేపట్టిన వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు.బంధుమిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
హస్త నక్షత్రం వారికి (ప్రత్యక్తార)అధిక శ్రమ. అధికారులు తో వివాదాలు. అకారణ కోపం.నిందారోపణలు రాగలవు.

చిత్త నక్షత్రం వారికి (క్షేమతార) శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

దిన ఫలం:-అకారణంగా అధికారులు తో కలహాలు రాగలవు.తలపెట్టిన పనుల్లో ప్రతికూల వాతావరణం. వాదనలకు దూరంగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారం లాభదాయకంగా అనిపించినా జాగ్రత్త అవసరం.వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి చికాకులు అధికమవుతాయి.సాధ్యమైన మేరకు తక్కువ మాట్లాడటం మంచిది.ఆర్థికంగా ఖర్చులు నియంత్రించాలి.
 

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
స్వాతి నక్షత్రం వారికి(విపత్తార)అనుకోని సంఘటనలు ఎదురవుతాయి.అకారణ కలహాలు ఏర్పడగలవు.వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త అవసరం.పనులలో ఆటంకాలు.

విశాఖ నక్షత్రం వారికి (సంపత్తార)వ్యక్తిగతంగా విలువ పెరుగుతుంది.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా మార్చుకుంటారు.

దిన ఫలం:-వ్యవహారాలలో ఆత్రుత తగ్గించుకుని వ్యవహరించాలి. వ్యాపారంలో ధన నష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.దొంగతనాలు జరగ గలవు జాగ్రత్తగా ఉండాలి.చేపట్టిన ప్రతి పనిలో అన్ని అడ్డంకులను ఎదుర్కుంటారు.ఊహించిన దానికంటే ఎక్కువ ఖర్చు అవుతుంది.సహోద్యోగుల నుంచి మద్దతు తక్కువగా ఉంటుంది.  అవసరం సమస్యలుంటాయి.జీవిత భాగస్వామితో మనస్పర్థలు ఏర్పడే అవకాశం.
 

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ  జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాబలం
అనూరాధ నక్షత్రం వారికి(జన్మతార) అధికారులు తో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు.శారీరక శ్రమ అధికం.

జ్యేష్ట నక్షత్రం వారికి(పరమ మిత్ర తార) వ్యవహారాల్లో ఆటంకములు. అకారణ కలహాలు.శారీరక బాధలు.ధన నష్టము.

దిన ఫలం:-అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి కాగలవు.వ్యాపారంలో అనుకున్న లాభాలు పొందగలరు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు.విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు.కొద్ది రోజుల నుంచి పూర్తికాని పనులు చిన్న ప్రయత్నం తో పూర్తి చేస్తారు.రావలసిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది.వ్యాపారంలో మీ అంచనాలు నిజమవుతాయి.
 

telugu astrology

ధనుస్సు (మూల  పూ.షాఢ ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రం వారికి (మిత్ర తార)వృత్తి వ్యాపారాల్లో అధిక ధనాదాయం లభించును.నూతన పరిచయాలు కలుగుతాయి.

పూ.షాఢ నక్షత్రం వారికి (నైధనతార) చేసే పనిలో ఆటంకాలు.వాహన ప్రయాణంలో యందు జాగ్రత్తలు తీసుకోవాలి.అనవసరపు ఖర్చులు.

ఉ.షాఢ నక్షత్రం వారికి (సాధన తార) అన్ని వృత్తుల వారికి అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.ఆర్థిక విషయాలలో ఆశించిన పురోభివృద్ధి సాధిస్తారు.

దిన ఫలం:-జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబంలో శాంతి సౌఖ్యాలు పొందగలరు.ఉన్నతమైన వ్యక్తులు తో పరిచయాలు.ఆర్థికంగా అన్ని విషయాలు కలిసి వస్తాయి.వ్యాపార వ్యవహారాలు లాభ పూరితంగా ఉంటాయి.ఉద్యోగులకు అనుకూలం.అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.
 

telugu astrology


మకరం (ఉ.షాఢ 2 3 4, శ్రవణం ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
శ్రవణా నక్షత్రం వారికి (ప్రత్యక్తార)అధిక శ్రమ.అధికారులు తో వివాదాలు. అకారణ కోపం.నిందారోపణలు రాగలవు.

ధనిష్ఠ నక్షత్రం వారికి (క్షేమతార) తలపెట్టిన కార్యాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాల్లో ధనాభివృద్ధి. ఆరోగ్య విషయంలో ఉపశమనం లభిస్తుంది.

దిన ఫలం:-ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది.వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. అధిక వ్యయం ఎక్కువగా ఉండే అవకాశం.కుటుంబ విషయాలు సామాన్యంగా ఉంటాయి.వాహన ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.ప్రతి పనిలోనూ సహనంగా వ్యవహరించడం వలన ఆటంకాలు తొలగి పనులు ముందుకు సాగ గలవు.ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి.ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.
 

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం  పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
శతభిషం నక్షత్రం వారికి (విపత్తార)అనుకోని సంఘటనలు ఎదురవుతాయి.అకారణ కలహాలు ఏర్పడగలవు.వృత్తి వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం.పనులలో ఆటంకాలు.

పూ.భాద్ర నక్షత్రం వారికి (సంపత్తార)వృత్తి వ్యాపారంలో ధన లాభం.శుభవార్తలు వింటారు.వ్యవహారాలలో బుద్ధి కుశలత పెరుగుతుంది.

దిన ఫలం:-అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాగలవు. వృత్తి వ్యాపారాలలో ఊహించని ధన లాభం పొందగలరు. వృత్తిరీత్యా ఇబ్బందులు తొలగుతాయి.అన్ని వ్యవహారాల్లో అందరి సహకారం లభిస్తుంది. ఉద్యోగులకు వృత్తి నైపుణ్యం పెరుగుతుంది.మీ పనితీరును అధికారులు ప్రశంసిస్తారు.అన్న వర్గముల వారు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందుతారు.నూతన వ్యాపార ప్రయత్నాలు కలిసి వస్తాయి.
 

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర రేవతి 1)
నామ నక్షత్రాలు(దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
ఉ.భాద్ర నక్షత్రం వారికి (జన్మతార)అధికారులుతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును.శారీరక శ్రమ అధికం.

రేవతి నక్షత్రం వారికి (పరమ మిత్ర తార) వ్యవహారాల్లో ఆటంకములు.అకారణ కలహాలు.శారీరక బాధలు.ధన నష్టము ఏర్పడును.

దిన ఫలం:-రాజకీయ నాయకులు ప్రజాదరణ పొందగలరు.తలపెట్టిన పనుల్లో తొందరపాటు వల్ల ఆలస్యముగా జరుగును.ఉద్యోగాలలో అధికారులు తో సఖ్యత గా ఉండాలి.సమాజంలో చిన్నపాటి అపవాదము రాగలవు.అనవసరమైన ఖర్చులు పెరిగి మానసిక ఆందోళనకు గురి అవుతారు.అధికారులు తో చికాకులు తప్పవు. సమయానుకూలంగా వ్యవహరించడం మంచిది.
 

Latest Videos

click me!