Today Horoscope: ఓ రాశివారు ఈ రోజు ఆన్‌లైన్ వ్యాపారం చేస్తే లాభాలు వస్తాయి

First Published Mar 1, 2024, 5:30 AM IST

Today Horoscope:ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి ఈ రోజు.. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. తలచిన కార్యాలు లో అవాంతరాలు కలుగును. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు.ప్రారంభించిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. 

1-3-2024, శుక్రవారం  మీ  రాశి ఫలాలు  (దిన ఫల,తారా ఫలాలుతో..)
 
జోశ్యుల  రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు  సమస్యలు పెట్టండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

telugu astrology


మేషం (అశ్విని భరణి కృత్తిక 1)
నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి (సాధన తార)నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.మానసిక ప్రశాంతత లభిస్తుంది.(అన్ని పనుల్లో విజయం సాధిస్తారు)

భరణి నక్షత్రం వారికి (ప్రత్యక్తార)విలువైన వస్తువులు తో జాగ్రత్త అవసరం. ఇతరులతో వాదోపవాదాలకు  దూరంగా ఉండాలి.వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకోవాలి.(పనులలో ఆటంకాలు ఏర్పడతాయి)

కృత్తిక నక్షత్రం వారికి (క్షేమతార) సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.(ఆనందంగా గడుపుతారు)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. తలపెట్టిన కార్యాల్లో ఆటంకాలు ఎదురవగలవు. వివాదాలకు కలహాలకు దూరంగా ఉండటం మంచిది.ఆర్థిక సంబంధమైన నష్టాలు.కుటుంబ పరమైన చికాకులు తగ్గి ప్రశాంతత లభిస్తుంది.కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు.ఆర్థికంగా కొంత ఇబ్బంది పడవలసి వస్తుంది. పనుల్లో శ్రమాధిక్యం.సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు.
 

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి మృగశిర 1 2)
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
రోహిణి నక్షత్రం వారికి(విపత్తార) పనుల్లో అలసత్వం వల్ల ఇబ్బందులు పడతారు. మిత్రులతో అకారణంగా కలహాలు రావచ్చు.(ప్రతి పని ఆలోచించి చేయడం మంచిది)

మృగశిర నక్షత్రం వారికి(సంపత్తార)తలపెట్టిన పనులు పట్టుదలతో చేసినట్లయితే సకాలంలో పూర్తి అగును.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.(అన్ని విధాలా బాగుంటుంది)

దిన ఫలం:-విలువైన గృహోపకరణములు కొనుగోలు చేస్తారు.ఆశ్చర్యకరమైన విశేషాలు వింటారు.వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా ఉంటాయి.కొన్ని రోజులు గా వాయిదా పడిన పనులు పూర్తి కాగలవు.కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు లో చురుగ్గా వ్యవహరిస్తారు. సమస్యలు పరిష్కారం అవడం వల్ల కుటుంబం వాతావరణం ఆనందంగా ఉంటుంది.వ్యాపారానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించ గలరు.విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాలు లో మంచి ఫలితాలు పొందుతారు.
 

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
ఆరుద్ర నక్షత్రం వారికి (జన్మతార)ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొనవలెను. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండును.అధికారులు తో విరోధాలు రావచ్చు.(సామాన్యంగా ఉండును)

పునర్వసు నక్షత్రం వారికి (‌పరమమిత్ర తార)వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తలపెట్టిన పనులు పూర్తి గాక చిరాకు కలుగుతుంది(సామాన్యంగా ఉంటుంది)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. తలచిన కార్యాలు లో అవాంతరాలు కలుగును. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు.ప్రారంభించిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబసభ్యులతో సంతోషంగా  గడుపుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు.ఉద్యోగ ప్రయత్నం చేసేవారు విజయం సాధిస్తారు .రావలసిన డబ్బు చేతికి అందుతుంది.ఇతరులకు సహాయం చేస్తారు.వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలను పొందవచ్చు.ఆర్థిక ఒప్పందాలు కలిసివస్తాయి.బంధు మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.
 

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి ఆశ్లేష )
నామ నక్షత్రాలు(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పుష్యమి నక్షత్రం వారికి (మిత్ర తార)వృత్తి వ్యాపారాలలో ధన లాభం కలుగుతుంది.నూతన పరిచయాలు వలన కొన్ని సమస్యలు తీరును.శుభవార్తలు వింటారు.(అన్ని విధాలా శ్రేయస్కరం గా ఉంటుంది)

ఆశ్రేష నక్షత్రం వారికి  (నైధనతార)ప్రతి పనిలోనూ ఆచితూచి అడుగు వేయవలెను.ఆరోగ్య విషయంలో శ్రద్ద తీసుకోవాలి. వాహన ప్రయాణంలో జాగ్రత్త అవసరం.(జాగ్రత్తగా మెలగాలి)

దిన ఫలం:-చేపట్టిన పనులలో అధిక శ్రమ ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పని ఒత్తిడి పెరుగుతుంది.భార్య భర్తల మధ్య గొడవలు రావొచ్చు.ఖర్చులు పెరుగుతాయి.అధికారులు తో మాటపట్టింపులు రాగలవు.విద్యార్థులు శ్రమించాల్సి ఉంటుంది.అన్నదమ్ములు తో అభిప్రాయ భేదాలు రావచ్చు. ఆర్థికంగా హెచ్చుతగ్గులు ఉంటాయి. బంధు మిత్రులతో వివాదాలు రాకుండా చూసుకోవాలి.ఖర్చుల నియంత్రణ చేయాలి.

telugu astrology


సింహం (మఖ  పుబ్బ ఉత్తర 1)
నామ నక్షత్రాలు(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి (సాధన తార) నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.మానసిక ప్రశాంతత లభిస్తుంది.(తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు)

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)విలువైన వస్తువులు తో జాగ్రత్త అవసరం. ఇతరులతో వాదోపవాదాలకు  దూరంగా ఉండాలి.(పనులలో ఆటంకాలు ఎదురవుతాయి)

ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (క్షేమతార) సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. (ఆనందంగా గడుపుతారు)

దిన ఫలం:-ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తలచిన వ్యవహారాలు పూర్తి కాగలవు. ప్రముఖులతో పరిచయాలు.కుటుంబ కార్యకలాపాలపై మీ దృష్టి పెడతారు. ఆత్మబలం పెరుగుతుంది.సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.సమస్యలు ను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి.కష్టానికి తగిన ఫలితాలు పొందగలరు. ప్రారంభించిన పనులు నిర్ణీత కాలంలో పూర్తిచేశారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
 

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త  చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
హస్త నక్షత్రం వారికి  (విపత్తార) పనుల్లో అలసత్వం వల్ల ఇబ్బందులు. మిత్రులతో అకారణంగా కలహాలు రావచ్చు.(ప్రతి పని ఆలోచించి చేయవలెను)

చిత్త నక్షత్రం వారికి (సంపత్తార)తలపెట్టిన పనులు పట్టుదలతో చేసినట్లయితే సకాలంలో పూర్తి కాగలవు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.(అన్ని విధాలా బాగుంటుంది)

దిన ఫలం:-ముఖ్యమైన పనుల లో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు రాగలవు.వైవాహిక జీవితంలో కొన్ని సమస్యల కారణంగా కుటుంబంలో ప్రతికూలంగా ఉంటుంది.ప్రశాంతత తో పరిస్థితులు పరిష్కరించు కోవాలి.బంధువులు తో గొడవలు వచ్చే అవకాశం.మానసికంగా బాధపడొచ్చు.వ్యాపారానికి సంబంధించిన కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి.
 

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి ,విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
స్వాతి నక్షత్రం వారికి (జన్మతార)ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.అధికారులు తో విరోధాలు రావచ్చు.(సామాన్యంగా ఉంటుంది)

విశాఖ నక్షత్రం వారికి (పరమమిత్ర తార)వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.తలపెట్టిన పనులు పూర్తి గాక ఇబ్బందులు ఎదురవుతాయి. (సామాన్యంగా ఉంటుంది)

దిన ఫలం:-ఉద్యోగాలలో అధికారులు తో చిన్నపాటి వివాదాలు రాగలవు. వివాదాలకు వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది.శారీరక బాధలు పెరుగుతాయి. అధికారుల వలన భయాందోళన గా ఉంటుంది.తలపెట్టిన పనులు పూర్తి గాక ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థిక వ్యవహారాల్లో నియంత్రణ అవసరం.ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
 

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ  జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
తారాబలం
అనూరాధ నక్షత్రం వారికి (మిత్ర తార)వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందుతారు.నూతన పరిచయాలు వలన కొన్ని సమస్యలు తీరును.శుభవార్తలు వింటారు.(అన్ని విధాలా శ్రేయస్కరం గా ఉంటుంది)

జ్యేష్ట నక్షత్రం వారికి(నైధనతార)ప్రతి విషయంలో ఆచితూచి అడుగు వేయాలి.ఆరోగ్య విషయంలో శ్రద్ద తీసుకోవాలి. వాహన ప్రయాణంలో జాగ్రత్త అవసరం.(జాగ్రత్తగా ఉండటం మంచిది)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ధన లాభాలు పొందగలరు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. పనులు పూర్తి కాగలవు.స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు.సమాజంలో మీ సామర్థ్యం తగిన గుర్తింపు లభిస్తుంది.ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.భార్యాభర్తల మధ్య సంబంధాలు బలపడతాయి.ఆరోగ్యం బాగుంటుంది.వ్యాపార కార్యకలాపాలు సక్రమంగా సాగుతాయి.ఇంటి వాతావరణం సానుకూలంగా ఉంటుంది.సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
 

telugu astrology

ధనుస్సు (మూల పూ.షాఢ ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే
తారాబలం
మూల నక్షత్రం వారికి (సాధన తార)నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.మానసిక ప్రశాంతత లభిస్తుంది.(అన్ని పనుల్లో విజయం సాధిస్తారు)

పూ.షాఢ నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)విలువైన వస్తువులు తో జాగ్రత్త అవసరం. ఇతరులతో వాదోపవాదాలకు  దూరంగా ఉండాలి. (పనులలో ఆటంకాలు ఏర్పడును)

ఉ.షాఢ నక్షత్రం వారికి(క్షేమతార) సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.( ఆనందంగా గడుపుతారు)

దిన ఫలం:-వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.చేపట్టిన పనులు పూర్తి  కాగలవు. ఉద్యోగ విషయాలు అనుకూలంగా ఉంటాయి.కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం.తలపెట్టిన కార్యాలలో సహనం సంయమనం పాటించడం అవసరం.భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం ఏర్పడుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.కుటుంబంలో అనుకూలమైన వాతావరణం.కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పలుకుబడితో పనులు నెరవేరుతాయి.ఉద్యోగాలలో పని భారం పెరుగుతుంది.సహోద్యోగుల సహకారం లభిస్తుంది.
 

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
శ్రవణా నక్షత్రం వారికి (విపత్తార)పనుల్లో అలసత్వం వల్ల ఇబ్బందులు.మిత్రులతో అకారణంగా కలహాలు రావచ్చు.(ప్రతి పని ఆలోచించి చేయవలెను)

ధనిష్ఠ నక్షత్రం వారికి (సంపత్తార)తలపెట్టిన పనులు పట్టుదలతో చేసినట్లయితే సకాలంలో పూర్తి అగును. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.(అన్ని విధాలా బాగుంటుంది)

దిన ఫలం:-కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో ధన లాభం కలుగుతుంది.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.జీవిత భాగస్వామితో సఖ్యత గా వ్యవహరిస్తారు.నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది.ఆకస్మిక ధనలాభం.
 

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
శతభిషం నక్షత్రం వారికి (జన్మతార)ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. అధికారులు తో విరోధాలు రావచ్చు. (సామాన్యంగా ఉంటుంది.)

పూ.భాద్ర నక్షత్రం వారికి (పరమమిత్ర తార)వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.తలపెట్టిన పనులు పూర్తి గాక ఇబ్బందులు ఎదురవుతాయి.(సామాన్యంగా ఉంటుంది)

దిన ఫలం:-ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం.వ్యాపారంలో మార్పులు చేర్పులు రాగలవు.వ్యాపారంలో ఆదాయం తగ్గడం మరియు ఖర్చు పెరగడం జరుగుతుంది.విద్యార్థులకు కొంత ఇబ్బంది కలిగిస్తుంది.బద్ధకం వలన చదువు పై ఎక్కువ శ్రద్ధ పెట్టకపోవటం.పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి వీలైనంత ఎక్కువ కృషి చేయడం మంచిది.అన్ని తెలుసు అనే అహంభావాన్ని విడనాడాలి.
 

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర రేవతి )
నామ నక్షత్రాలు(దీ-దూ -ఝ-దా-దే-దో-చా-చ)
తారాబలం
ఉ.భాద్ర  నక్షత్రం వారికి(మిత్ర తార)వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందుతారు.నూతన పరిచయాలు వలన కొన్ని సమస్యలు తీరును.శుభవార్తలు వింటారు.(అన్ని విధాలా శ్రేయస్కరం గా ఉండును)

రేవతి నక్షత్రం  వారికి(నైధనతార)ప్రతి పనిలోనూ ఆచితూచి అడుగు వేయవలెను.ఆరోగ్య విషయంలో శ్రద్ద తీసుకోవాలి.వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.(జాగ్రత్తగా ఉండటం మంచిది)

దిన ఫలం:-ఈ రోజు అంతా అనుకూలంగా ఉంటుంది.చాలా కాలం నుంచి వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయగలుగుతారు.వృత్తి లో  వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతారు. కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది.స్నేహితుల సహాయం అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభ కార్యాల్లో పాల్గొంటారు.ఆరోగ్యం బాగుంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది.నూతన వస్తు వాహనాలు ఏర్పరుచుకుంటారు.

click me!