Today Horoscope:ఓ రాశివారికి ఈ రోజు ఇష్టమైన కార్యాలు సిద్ధిస్తాయి

First Published Feb 28, 2024, 5:30 AM IST

Today Horoscope:ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి ఈ రోజు..ఊహించని రీతిలో అధిక ఖర్చు అదుపు చేసుకోవాలి.ఉద్యోగాలలో అధికారులు తో సమస్యలు రావచ్చు. బంధుమిత్రులతో అకారణంగా విరోధాలు రాగలవు.
 

28-2-2024   బుధవారం  మీ  రాశి ఫలాలు  (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబలం చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

మేషం (అశ్విని 1 2 3 4 భరణి 1 2 3 4 కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి (దినాధిపతి రాహు)చేసే వ్యవహారాలలో భావోద్వేగాలను అదుపు చేసుకుని వ్యవహరించాలి.ఇతరులతో వాదోపవాదాలకు దూరంగా ఉండాలి.

భరణి నక్షత్రం వారికి (దినపతి రవి) ప్రారంభించిన పనులు మధ్యలో నిలిచిపోవడం. కుటుంబంలో ప్రతికూలత.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

కృత్తిక నక్షత్రం వారికి  (దినాదిపతి కుజుడు) చేపట్టిన పనులు ఆలస్యం అయినా పూర్తి కాగలవు. యంత్రాలతో పనిచేసేవారు జాగ్రత్త అవసరం. అపవాదము రాగలవు.

దిన ఫలం:-అధికమైన కోపం చేత చేసే పనిలో ఆటంకాలు ఏర్పడి చికాకు పడతారు. ఆరోగ్య సమస్యలు రాగలవు. అవసరానికి తగ్గ ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది. కుటుంబ సభ్యులతో వ్యతిరేకతలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాహన ప్రయాణంలో జాగ్రత్త అవసరం.బంధుమిత్రులతో సఖ్యత గా ఉండాలి.ఊహించని ఖర్చులు పెరుగుతాయి.ఇతరులతో అకారణంగా కలహాలు రాగలవు. ఓం షణ్ముఖాయ నమః  అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4 రోహిణి 1 2 3 4 మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి (దినాధిపతి గురుడు)ఇష్టమైన కార్యాలు సిద్ధిస్తాయి. ఉన్నతమైన వ్యక్తులు తో పరిచయాలు పెరుగుతాయి. ధన లాభం.

మృగశిర నక్షత్రం వారికి (దినాధిపతి శని) సోదరులతో చిన్నపాటి విభేదాలు రాగలవు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. వ్యవహారాలు శ్రమతో పూర్తి కాగలవు.

దిన ఫలం:-ఊహించని రీతిలో అధిక ఖర్చు అదుపు చేసుకోవాలి.ఉద్యోగాలలో అధికారులు తో సమస్యలు రావచ్చు. బంధుమిత్రులతో అకారణంగా విరోధాలు రాగలవు.వృత్తి వ్యాపారాలలో  శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. వాహన ప్రయాణంలో జాగ్రత్త అవసరం.ఇష్టమైన వారు దూరం అవుతారు. ప్రతి విషయంలోనూ భయాందోళన గా ఉంటుంది. సమాజంలో అవమానాలు కలగవచ్చు. దైవ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఓం చండికాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర 1 2 3 4 పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి (దినాధిపతి కేతువు ) ఉద్యోగాలలో అధికారులు తో వాదోపవాదాలు రాగలవు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అకారణ కలహాలు ఏర్పడతాయి.

పునర్వసు నక్షత్రం వారికి (దినాధిపతి చంద్రుడు) వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా జరుగును. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

దిన ఫలం:-వ్యవహారాలలో అనేక రకాల ఇబ్బందులు కలుగుతాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.శారీరకంగా అత్యధిక శ్రమ.సంతానం నుండి ప్రతికూలత వాతావరణ. ఇతరులతో అవసర విరోధాలు రాగలవు.ఆరోగ్య సమస్యలు వలన ఇబ్బంది పడతారు.పని వారితో ఇబ్బందులు తలెత్తుతాయి.వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.అనవసరమైన ఆలోచనలు తో కాలయాపన చేస్తారు.ఆర్థిక ఇబ్బందులు ఏర్పడును. సమాజంలో అనవసరమైన వాదనకు దూరంగా ఉండాలి.ఓం నమశ్శివాయ జపం చేయండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4)
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినాధిపతి బుధుడు) మీ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను పొందగలరు. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం. వృత్తి వ్యాపారాలలో ధన లాభం.

ఆశ్రేష నక్షత్రం వారికి (దినాధిపతి శుక్రుడు) ముఖ్యమైన కార్యక్రమాలు లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.ఉద్యోగాలు అనుకూలిస్తాయి

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ప్రతి విషయంలో ఆచితూచి అడుగు వేయాలి.మానసికంగా భయాందోళన గా ఉంటుంది. సమాజంలో అపనిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బంధువర్గంతో మాట పట్టింపులు రాగలవు. తలపెట్టిన పనుల్లో ఊహించని విధంగా ఆటంకాలు ఏర్పడగలవు.అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.నూతన సమస్యలు రాగలవు.ఆందోళన కలిగించే సంఘటనలు ఎదురవగలవు.ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగాలు లో అధికారుల ఒత్తిడి పెరగగలవు.ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి
 

telugu astrology

సింహం (మఖ 1 2 3 4 పుబ్బ 1 2 3 4 ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి  (దినాధిపతి రాహు) చేసే వ్యవహారాలలో భావోద్వేగాలను అదుపు చేసుకుని వ్యవహరించాలి. ఇతరులతో వాదోపవాదాలకు దూరంగా ఉండాలి.

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినాధిపతి రవి) ప్రారంభించిన పనులు మధ్యలో నిలిచిపోవడం. కుటుంబంలో ప్రతికూలత.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినాధిపతి కుజుడు) చేపట్టిన పనులు ఆలస్యం అయినా పూర్తి కాగలవు. యంత్రాలతో పనిచేసేవారు జాగ్రత్త అవసరం. అపవాదము రాగలవు.

దిన ఫలం:-కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి.తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.విందు వినోదాలలో పాల్గొంటారు. నూతన వస్తు వాహనాది అలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ముఖ్యమైన సమస్యల నుంచి బయటపడతారు. దైవ సంబంధ కార్యాలు ఆచరిస్తారు.పాత మిత్రులను కలుసుకుంటారు.ఓం చండికాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology


క‌‍న్య (ఉత్తర 2 3 4 హస్త 1 2 3 4 చిత్త 1 2)
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)

హస్త నక్షత్రం వారికి (దినాధిపతి గురుడు) ఇష్టమైన కార్యాలు సిద్ధిస్తాయి. ఉన్నతమైన వ్యక్తులు తో పరిచయాలు పెరుగుతాయి. ధన లాభం.

చిత్త నక్షత్రం వారికి (దినాధిపతి శని) సోదరులతో చిన్నపాటి విభేదాలు రాగలవు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. వ్యవహారాలు శ్రమతో పూర్తి కాగలవు.

దిన ఫలం:-అకారణ కోపం వల్ల అన్ని విధాల నష్టం జరగవచ్చు.వృత్తి వ్యాపారాలలో రాణింపు తగ్గును. మానసిక భయాందోళనకు గురి అవుతారు. కుటుంబ సభ్యులతో ఉద్రేకం తగ్గించుకుని వ్యవహరించాలి. ఉద్యోగాలలో అధికారులు తో విరోధాలు రాగలవు. ఆదాయం అంతంత మాత్రమే లభించును. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి.ప్రభుత్వ పరంగా ఇబ్బందులు కలుగును.అనవసరమైన ఖర్చు చేస్తారు.ఓం ఆదిత్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

తుల (చిత్త 3 4 స్వాతి 1 2 3 4 విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి కేతువు ) ఉద్యోగాలలో అధికారులు తో వాదోపవాదాలు రాగలవు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అకారణ కలహాలు రాగలవు.

విశాఖ నక్షత్రం వారికి (దినాధిపతి చంద్రుడు) వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా జరుగును. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలలో ఆశించిన ధన లాభం చేకూరుతుంది. సమాజంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది.నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు.నూతన అభివృద్ధి ప్రణాళికలు గూర్చి చర్చలు జరుపుతారు.ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటుంటారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇతరుల యొక్క సహాయసహకారాలు అందుకుంటారు.ఓం నమో నారాయణాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రాలు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి  (దినాధిపతి బుధుడు) మీ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను పొందగలరు. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం. వృత్తి వ్యాపారాలు ధన లాభం.

జ్యేష్ట నక్షత్రం వారికి (దినాధిపతి శుక్రుడు) ముఖ్యమైన కార్యక్రమాలు లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.ఉద్యోగాలు అనుకూలిస్తాయి

దిన ఫలం:-మానసిక కోరికలు తీరగలవు.ఉద్యోగాలలో అధికారులు యొక్క మన్ననలు పొందగలరు. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.సంతాన వృద్ధి ఆనందం కలిగిస్తుంది.ధనాదాయ మార్గాలు బాగుంటాయి.మానసిక ప్రశాంతత మరియు కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.చేయు వృత్తి వ్యాపారాలు మరియు అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. విందు వినోదాలలో పాల్గొంటారు.ఓం మహాలక్ష్మ్యై యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

ధనుస్సు (మూల 1 2 3 4 పూ.షాఢ 1 2 3 4, ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినాధిపతి రాహు) చేసే వ్యవహారాలలో భావోద్వేగాలను అదుపు చేసుకుని వ్యవహరించాలి. ఇతరులతో వాదోపవాదాలకు దూరంగా ఉండాలి.

పూ.షాఢ నక్షత్రం వారికి (దినాధిపతి రవి) ప్రారంభించిన పనులు మధ్యలో నిలిచిపోవడం. కుటుంబంలో ప్రతికూలత.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

ఉ.షాఢ నక్షత్రం వారికి  (దినాధిపతి కుజుడు) చేపట్టిన పనులు ఆలస్యం అయినా పూర్తి కాగలవు. యంత్రాలతో పనిచేసేవారు జాగ్రత్త అవసరం. అపవాదము రాగలవు.

దిన ఫలం:-అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ధన లాభం కలుగును.బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.వ్యాపార అభివృద్ధి విషయాలు గూర్చి చర్చిస్తారు.మానసికంగా ఉత్సాహంగా ఉంటుంది.ఆరోగ్యం బాగుంటుంది.ప్రతి విషయంలో ధైర్యంగా ముందుకు వెళతారు.భార్య భర్తల మధ్య సరైన అవగాహన ఏర్పడి ఆనందంగా గడుపుతారు.సమాజంలో మీ యొక్క శక్తి సామర్థ్యాలు తెలియగలవు.ప్రయాణాలు కలిసి వస్తాయి.ఓం లక్ష్మీ నరసింహాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

మకరం (ఉ.షాఢ 2 3 4 శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి  (దినాధిపతి గురుడు) మీకు ఇష్టమైన కార్యాలు సిద్ధిస్తాయి. ఉన్నతమైన వ్యక్తులు పరిచయాలు పెరుగుతాయి. ధన లాభం.

ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినాధిపతి శని) సోదరులతో చిన్నపాటి విభేదాలు రాగలవు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. వ్యవహారాలు శ్రమతో పూర్తి కాగలవు.

దిన ఫలం:-ఉద్యోగాలలో అధికారులు తో సమస్యలు రాకుండా జాగ్రత్త వహించాలి. సమాజంలో గౌరవ మర్యాదలు పొందగలరు.వృత్తి వ్యాపారాలు రాణిస్తాయి.చేసే పనుల్లో ఆలోచన శక్తి పెరిగి పనులన్నీ సక్రమంగా నిర్వహిస్తారు.నూతన ఉత్సాహంతో వ్యవహారాలన్నీ పూర్తి చేస్తారు.ఉన్నతమైన వ్యక్తులు తో పరిచయాలు ఏర్పడతాయి. గృహంలో సంతోషకరమైన వాతావరణం.ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. కొన్ని సమస్యలు పరిష్కార మార్గం కనబడుతుంది.శక్తికి మించిన సాహస కార్యాలు చేస్తారు.అందు ఊహించని లాభాలు కూడా అందుకుంటారు.ఓం బృహస్పతయే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4 శతభిషం 1 2 3 4 పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి (దినాధిపతి కేతువు ) ఉద్యోగాలలో అధికారులు తో వాదోపవాదాలు రాగలవు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అకారణ కలహాలు ఏర్పడతాయి.

పూ.భాద్ర నక్షత్రం వారికి (దినాధిపతి చంద్రుడు) వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా జరుగును. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

దిన ఫలం:-ఉద్యోగాలలో అధికారులు తో  మన్ననలు పొందగలరు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.చేసే పనిలో బుద్ధికుశలతతో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభించును.వ్యవహారాల్లో నూతన ఉత్సాహంతో చేస్తారు.ఆశించిన రీతిలో లాభాలు పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.విందు వినోదాలలో పాల్గొంటారు.ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

మీనం(పూ.భాద్ర 4 ఉ.భాద్ర 1 2 3 4 రేవతి 1 2 3 4)
నామ నక్షత్రాలు(దీ-దూ -ఝ-దా-దే-దో-చా-చి)
దినాధిపతులు
ఉ.భాద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి బుధుడు) మీ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను పొందగలరు. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం. వృత్తి వ్యాపారాలలో ధన లాభం.

రేవతి నక్షత్రం  వారికి  (దినాధిపతి శుక్రుడు) ముఖ్యమైన కార్యక్రమాలు లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.ఉద్యోగాలు అనుకూలిస్తాయి

దిన ఫలం:-ఉద్యోగాలలో అధికారులు తో సమస్యలు రావచ్చు .ఖర్చు యందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడగలవు.అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది.ముఖ్యమైన వస్తువులు తో జాగ్రత్త అవసరం. ఇతరులతో అనవసరపు గొడవలకు దూరంగా ఉండాలి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.శారీరక శ్రమ పెరుగుతుంది. చిన్నపాటి విషయాలు కూడా చిరాకు పడతారు.ఓం గణాధిపాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

click me!