యజ్వేంద్ర చాహాల్‌ని ఆడించకుండా తప్పు చేశాం! బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కామెంట్స్..

Published : Jul 03, 2023, 04:03 PM IST

2021 టీ20 వరల్డ్ కప్‌ టోర్నీకి నాలుగేళ్ల ముందు వరకూ టీమిండియాకి వైట్ బాల్ క్రికెట్‌లో ప్రధాన స్పిన్నర్‌గా ఉంటూ వచ్చాడు యజ్వేంద్ర చాహాల్. అయితే అతన్ని పక్కనబెట్టి టీ20 వరల్డ్ కప్‌ 2021 టోర్నీకి రవిచంద్రన్ అశ్విన్, వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహార్ వంటి ప్లేయర్లను ఎంపిక చేశారు సెలక్టర్లు..

PREV
15
యజ్వేంద్ర చాహాల్‌ని ఆడించకుండా తప్పు చేశాం! బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కామెంట్స్..

రిజల్ట్ భారీగా తేడా కొట్టేసింది. వరల్డ్ కప్ చరిత్రలో మొదటిసారిగా పాకిస్తాన్‌పై మ్యాచ్ ఓడిపోయిన టీమిండియా, ఆ తర్వాతి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతుల్లో చిత్తుగా ఓడి గ్రూప్ స్టేజీ నుంచే నిష్కమించింది. అయినా టీమిండియా తీరు మారలేదు...
 

25

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి యజ్వేంద్ర చాహాల్‌ని ఎంపిక చేసినా, అతనికి తుది జట్టులో చోటు దక్కనేలేదు. గ్రూప్ మ్యాచుల్లో టేబుల్ టాపర్‌గా నిలిచిన టీమిండియా, సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది..

35
Image credit: Getty

చాహాల్, హానీమూన్‌కి వెళ్లినట్టు టీమ్‌తో కలిసి ఆస్ట్రేలియా వెళ్లాడు, వచ్చాడు. ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.. కెప్టెన్లు మారినా, హెడ్ కోచ్‌లు మారినా టీమిండియా పర్ఫామెన్స్ మాత్రం మారడం లేదు. దీనిపై తాజాగా స్పందించాడు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ...
 

45
Image credit: PTI

‘వన్డే వరల్డ్ కప్‌లో యజ్వేంద్ర చాహాల్ కచ్ఛితంగా ఆడాలి. టీమిండియాకి జడేజా ఉన్నాడు. అతనితో పాటు రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ కూడా ఉన్నారు. అయితే రవిభష్ణోయ్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహాల్ లాంటి స్పెషలిస్టు స్పిన్నర్లే... పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మ్యాచ్ విన్నర్లుగా ఉంటారు..

55
Image credit: PTI

యజ్వేంద్ర చాహాల్‌ని ఐసీసీ టోర్నమెంట్లలో ఆడించకపోవడం మేం చేసిన చాలా పెద్ద తప్పు. అతన్ని ఆడించి ఉంటే రిజల్ట్ వేరేగా ఉండేది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా వంటి జట్లపై స్పిన్నర్లు కీ రోల్ పోషించారు.. 2011 వన్డే వరల్డ్ కప్‌లో పియూష్ చావ్లా, హర్భజన్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు...’ అంటూ కామెంట్ చేశాడు సౌరవ్ గంగూలీ.. 

click me!

Recommended Stories