పెళ్లాయ్యాక యువరాజ్ సింగ్ భార్య ఇలా అయిపోయిందేంటి?... హీరోయిన్ హజెల్ కీచ్ షాకింగ్ లుక్...

First Published | Jan 23, 2021, 12:52 PM IST

పెళ్లాయ్యాక అమ్మాయిల లుక్స్ మారిపోవడం ఖాయం. గర్భం దాల్చడం, ప్రసవం వంటి కారణాలతో వారి బాడీ షేప్‌లో మార్పులు వస్తుంటాయి. కానీ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ భార్య, హీరోయిన్ హజెల్ కీచ్ మాత్రం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. 

‘ఖడ్గం’ బ్యూటీ కిమ్ శర్మతో పాటు అరగజను మంది బాలీవుడ్ భామలతో ప్రేమాయణం నడిపించిన యువరాజ్ సింగ్... 2016లో హీరోయిన్ హజెల్ కీచ్‌ను వివాహం చేసుకున్నాడు...
పెళ్లికి ముందు బ్రిటీష్ మోడల్‌గా, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హజెల్ కీచ్... కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ హీరోగా వచ్చిన ‘బిల్లా’లో మొదటిగా నటించింది...

ఆ సినిమా తర్వాత బాలీవుడ్‌ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ హీరోహీరోయిన్లుగా వచ్చిన ‘బాడీగార్డు’ సినిమాలో ఓ ముఖ్యపాత్రలో నటించి, మెప్పించింది హజెల్ కీచ్...
2013 ‘బిగ్‌బాస్’ హిందీ 7వ సీజన్‌లో పాల్గొన్న హజెల్ కీచ్... సోనూసూద్ హీరోగా వచ్చిన ‘మ్యాగ్జిమమ్’లో ఓ స్పెషల్ సాంగ్‌లో నర్తించింది..
బాలీవుడ్‌లోనే కాకుండా హాలీవుడ్‌ ఫిక్షినల్ సిరీస్ ‘హ్యారీ ప్యాటర్’ మూడు పార్టలోనూ నటించి, మెప్పించింది హజెల్ కీచ్... అయితే తాజాగా ఆమె లుక్ అందర్నీ షాక్‌కి గురి చేస్తోంది...
2016లో యువీని పెళ్లాడిన హజెల్ కీచ్... తనకి క్రికెట్ అంటే పెద్దగా తెలియదని, కేవలం ఒకటి రెండు సార్లు యువరాజ్ పేరు విన్నానని చెప్పి, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
తాజాగా ఇన్‌స్టాలో తన ఫోటోను షేర్ చేసిన హజెల్ కీచ్... కళ్లు వాలిపోయి, బుగ్గలు పాలిపోయి... నీరసంగా, అనారోగ్యంతో బాధపడుతున్నట్టు కనిపించింది..
పెళ్లైన తర్వాత భారీగా బరువు పెరిగిన హజెల్ కీచ్... పూర్తిగా మారిపోయింది. యువరాజ్ సింగ్, హజెల్ కీచ్‌కి పెళ్లైయ్యి నాలుగేళ్లు దాటింది...
హజెల్ కీచ్‌ను చూసిన మొదటి చూపులోనే పడిపోయిన యువరాజ్ సింగ్, ఆమెను కాఫీ వెళ్దామని అడిగాడట. దానికి హజెల్ ఒప్పుకోలేదట...
అయితే యువీ మళ్లీ మళ్లీ అడగడంతో సరేనని చెప్పిందిట హజెల్ కీచ్. అయితే ఆ రోజు మీటింగ్ సమయానికి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసిందట. దీంతో యువరాజ్‌కి చిర్రెత్తుకొచ్చి, హజెల్ కీచ్ నెంబర్‌ను డిలీట్ చేశాడట.
కొన్ని రోజుల తర్వాత ఫేస్‌బుక్‌లో ఇద్దరికీ కామన్ ఫ్రెండ్‌గా ఉన్న వ్యక్తిని కలిసి... ఆమెను పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్టు చెప్పాడట యువరాజ్. ఈ విషయం తెలుసుకున్న హజెల్ కీచ్... యువరాజ్ పంపిన ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను మూడున్నరేళ్ల తర్వాత యాక్సెప్ట్ చేసిందట...
హజెల్ కీచ్, యువరాజ్ సింగ్‌ను కలవడానికి ఒప్పుకున్న తర్వాత 2015లో పెళ్లి ప్రతిపాదన తెచ్చాడట టీమిండియా మాజీ క్రికెట్ స్టార్. హజెల్ కీచ్ ఒప్పుకోవడంతో ఎంగేజ్‌మెంట్ చేసుకుని, ఏడాది తర్వాత పెళ్లి చేసుకున్నారీ జంట.
పెళ్లికి ముందు చందమామలా మెరిసిపోయిన హజెల్ కీచ్, ఇప్పుడు ఇలా మారిపోయిందని షాక్ అవుతున్నారు అభిమానులు...

Latest Videos

click me!