ఆ గొడవే స్టీవ్ స్మిత్‌ను తీసేయడానికి కారణమా... అందుకే సంజూ శాంసన్‌కి కెప్టెన్సీ అప్పగించారా...

First Published Jan 23, 2021, 11:50 AM IST

భారత టెస్టు కెప్టెన్‌గా అదరగొడుతున్న అజింకా రహానేని వదులుకున్న రాజస్థాన్ రాయల్స్, 2020 సీజన్‌కి ముందు ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కి కెప్టెన్సీ అప్పగించింది. అయితే 2021 సీజన్‌కి ముందు అతన్ని మినీ వేలానికి వదిలేయడం, యంగ్ ప్లేయర్ సంజూ శాంసన్‌ని కెప్టెన్‌గా చేస్తున్నట్టు ప్రకటించింది ఆర్ఆర్.

2021 ఐపీఎల్ సీజన్‌కి ముందురాజస్థాన్ రాయల్స్ ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్‌ను వదులుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...
undefined
గత సీజన్‌లో బ్యాట్స్‌మెన్‌గా పెద్దగా రాణించలేకపోయాడు స్టీవ్ స్మిత్... అయితే ఆ తర్వాత జరిగిన వన్డే సిరీస్‌లో మొదటి రెండు వన్డేల్లో 62 బంతుల్లో సెంచరీ బాది, ఫామ్‌లోకి వచ్చాడు...
undefined
ఇదే ఆటతీరు ఐపీఎల్ 2020 సీజన్‌లో చూపించి ఉండి ఉంటే... రాజస్థాన్ రాయల్స్ కథ వేరేగా ఉండేది...
undefined
కానీ స్టీవ్ స్మిత్ ఫెయిల్ కావడంతో ఐపీఎల్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది ఆర్ఆర్. అయితే స్మిత్‌కి ఉద్వాసన పలకడానికి ఇది కారణం కాదట.
undefined
రాజస్థాన్ రాయల్స్ భారత పేసర్ జయ్‌దేవ్ ఉనద్కడ్‌ను భారీ ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 2018 ఐపీఎల్‌ వేలంలో రూ.11.50 కోట్ల భారీ ధర చెల్లించి ఉనద్కడ్‌ను కొనుగోలు చేసింది ఆర్ఆర్.
undefined
అయితే ఆ ఏడాది 15 మ్యాచులు ఆడి కేవలం 11 వికెట్లు మాత్రమే పడగొట్టాడు ఉనద్కడ్. దాంతో అతన్ని 2019 సీజన‌కి ముందు విడుదల చేసింది రాజస్థాన్.
undefined
మినీ వేలంలో మళ్లీ రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది రాజస్థాన్. 2019లో 10 వికెట్లు తీసిన ఉనద్కడ్, 2020లో ఏడు మ్యాచులు ఆడినా కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు...
undefined
అయితే 2020 ఐపీఎల్ సీజన్ సమయంలో జయ్‌దేవ్ ఉనద్కడ్‌కి, స్టీవ్ స్మిత్‌కి మధ్య మనస్ఫర్థలు ఏర్పాడ్డాయట. సీజన్ ముగిసేసరికి ఈ గొడవలు తారాస్థాయికి చేరాయట.
undefined
2021 సీజన్ ఆరంభానికి ముందు జయ్‌దేవ్ ఉనద్కడ్‌కి జట్టు నుంచి తీసేయాలని యజమాన్యానికి సూచించాడట స్టీవ్ స్మిత్. కానీ అందుకు ఆర్ఆర్ ఒప్పుకోలేదు...
undefined
దాంతో స్టీవ్ స్మిత్... ‘జట్టులో ఉంటే నేనైనా ఉండాలి... జయ్‌దేవ్ ఉనద్కడ్ అయినా ఉండాలి’ అని కచ్ఛితంగా చెప్పేశాడట. ఆ తర్వాతి రోజే స్టీవ్ స్మిత్‌ను తొలగించాలని నిర్ణయం తీసుకుంది రాజస్థాన్ రాయల్స్...
undefined
రాజస్థాన్ రాయల్స్‌లో జోస్ బట్లర్, డేవిడ్ మిల్లర్, బెన్‌స్టోక్స్ వంటి ఫారిన్ స్టార్లు ఉన్నప్పటికీ భారత యంగ్ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ... దీనికి కూడా ఓ కారణం ఉందట.
undefined
చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు సంజూ శాంసన్‌‌ను ఇవ్వాలని రాజస్థాన్ రాయల్స్‌కి ప్రతిపాదన తెచ్చాయట.
undefined
అయితే ఆర్ఆర్‌లో ఇండియన్ స్టార్‌లా మెరిసిన సంజూని వదులుకోవడం ఇష్టం లేని రాజస్థాన్, అతనికి కెప్టెన్సీ అప్పగించిదని చెప్పుకొచ్చాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...
undefined
సంజూ శాంసన్ కెప్టెన్సీలో ఆడడానికి ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చాడు దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ మిల్లర్...
undefined
click me!