ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీ లేకుండా యువరాజ్ సింగ్ ఫ్రెండ్‌షిప్ డే విషెస్... ఆ గొడవలే కారణమా...

First Published Aug 1, 2021, 5:18 PM IST

మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌, అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా... క్రికెట్‌ను మాత్రం మరిచిపోలేదు. అందుకే స్నేహితుల దినోత్సవం సందర్భంగా తన ఫ్రెండ్స్‌కి విషెస్ చెబుతూ, సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేశాడు యువీ. 

సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, ఆశీష్ నెహ్రా, అజిత్ అగార్కర్, జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్... తన టీమ్‌ మేట్స్ దగ్గర్నుంచి క్రిస్‌గేల్, తన జూనియర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ వరకూ చాలామంది క్రికెటర్ల ఫోటోలను ఈ వీడియోలో జత చేశాడు యువరాజ్ సింగ్...

అయితే యువీ పోస్టు చేసిన వీడియోలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో యువీ పేరు మరోసారి ట్రెండింగ్‌లో నిలిచింది...

భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ మధ్య స్నేహం చూసి క్రికెట్ ఫ్యాన్స్ ఆనందపడేవాళ్లు. వీరిద్దరూ కలిసి కొన్ని మధురమైన భాగస్వామ్యాలు నెలకొల్పి, భారత జట్టుకి విజయాలను అందించారు...

ధోనీ సెంచరీ చేస్తే, యువీ సెలబ్రేట్ చేసుకునేవాడు. యువరాజ్ సింగ్‌, ధోనీ కలిసి చిందులు వేసేవాళ్లు, క్రీజులో అల్లరి చేసేవాళ్లు... 

ఇదే టైంలో ఓ బ్రాండ్ ప్రమోషన్‌లో మహేంద్ర సింగ్ ధోనీకి, దీపికా పదుకొనేకి ఏర్పడిన పరిచయం, స్నేహంగా మారింది. ధోనీ, దీపికా పదుకొనే కలిసి కొన్ని ఈవెంట్లకు హాజరయ్యారు కూడా... వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని, రహస్యంగా డేటింగ్ చేస్తున్నారని వార్తలు కూడా పుట్టుకొచ్చాయి. ఈ సమయంలోనే దీపికా పదుకొనేను చూసిన యువరాజ్ సింగ్ కూడా ఆమెపై మనసు పారేసుకున్నాడు...
undefined
తన స్నేహితుడు మనసు పడడంతో ధోనీ, దీపికాను త్యాగం చేశాడని వార్తలు వచ్చాయి... జాతీయ మీడియాలో ధోనీ, దీపికా, యువరాజ్ సింగ్... ఈ ట్రైయాంగిల్ ప్రేమకథ గురించి చాలా వార్తలే వచ్చాయి... స్వయంగా బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌నే ఈ విషయం గురించి ప్రశ్నించారు చాలామంది రిపోర్టర్లు... దీనికి ఫన్నీగా సమాధానం చెప్పాడు షారుక్... ‘దీపికా, యువీది కాదు, ధోనీది కాదు... నాది... నా సినిమాలో హీరోయిన్ తను’ అని చెప్పాడు షారుక్.
undefined
కొన్ని షోల కోసం దీపికా పదుకొనేతో కలిసి వెళ్లానని, ఆ తర్వాత ఇలాంటి రూమర్లు పుట్టుకొచ్చాయని ఆమెతో ప్రేమాయణం గురించి కొట్టిపాడేశాడు మహేంద్ర సింగ్ ధోనీ... అయితే అప్పటిదాకా లాంగ్ హెయిర్‌తో ట్రెండ్ సెట్ చేసిన మహేంద్ర సింగ్ ధోనీ, షార్ట్ హెయిర్‌ స్టైల్‌లో మారడానికి దీపికా పదుకొనేనే కారణమంటారు చాలామంది...
undefined
కిమ్ శర్మ వంటి బాలీవుడ్ హీరోయిన్లతో డేటింగ్ చేసిన యువీతో దీపికా కూడా కొన్నాళ్లు డేటింగ్ చేసిందని వార్తలు వచ్చాయి. వీరిద్దరూ రెస్టారెంట్లకి, కొన్ని షోలకు కలిసి వెళ్లిన ఫోటోలు వార్తల్లో నిలిచాయి... అయితే వీరి అనుబంధం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు.. ప్రాణ స్నేహితులుగా ఉన్న యువీ, ధోనీ మధ్య రిలేషన్... దీపికా ఇష్యూ తర్వాత పూర్తిగా మారిపోయిందని అంటారు...
undefined
అయితే ధోనీ కెప్టెన్‌ అయిన తర్వాత సీనియర్ల విషయంలో వ్యవహారించిన తీరు... యువీ దూరం కావడానికి కారణమని మరికొందరి వాదన... ఇవన్నీ కాదు 2011 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో తన ప్లేస్‌లో బ్యాటింగ్‌కి వెళ్లిన మహేంద్ర సింగ్ ధోనీ, హెలికాఫ్టర్ షాట్‌తో మ్యాచ్‌ను ముగించడం, క్రెడిట్ మొత్తం కొట్టేయడంతో యువీ అప్‌సెట్ అయ్యాడని అంటారు మరికొందరు.
undefined
అసలు ఏమైందో, ఎలా అయ్యిందో క్లారిటీ లేదు కానీ భారత క్రికెట్‌లో బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్న యువరాజ్ సింగ్, ధోనీ మధ్య మనస్ఫర్థలు ఏర్పడ్డాయి. ఈ కారణంగానే యువరాజ్ సింగ్ పోస్టు చేసిన ఫ్రెండ్‌షిప్ డే విషెస్ వీడియోలో మాహీ లేడని అంటున్నారు అభిమానులు...
undefined
మహేంద్ర సింగ్ ధోనీని గురువుగా భావించే విరాట్ కోహ్లీని భారత సీనియర్లు గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్ ఎంతగానో ప్రోత్సహించారు. అయితే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కోహ్లీ, వారి విషయంలో ప్రవర్తించిన తీరు చాలా హాట్ టాపిక్ అయ్యింది...
undefined
జట్టులో చోటు కోసం ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ, తనను పట్టించుకోవడం వల్ల యువరాజ్ సింగ్ వీడియోలో టీమిండియా కెప్టెన్‌ కూడా చోటు దక్కించుకోలేకపోయాడని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
undefined
click me!