అతనికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా వేస్ట్... క్రీజులోకి వచ్చాక అంత బద్ధకం దేనికో...

First Published Aug 1, 2021, 1:10 PM IST

ఎందరో యువ క్రికెటర్లు, భారత జట్టులో ఒక్క అవకాశం కోసం ఆశగా ఎదురుచూస్తుంటే... సంజూ శాంసన్ మాత్రం తనకి అందివచ్చిన అవకాశాలు సరిగ్గా ఉపయోగించలేకపోతున్నాడు. శ్రీలంక టూర్‌లో సంజూ శాంసన్ ఏ మాత్రం ఆకట్టుకునే ప్రదర్శన ఇవ్వలేదు...

Sanju Samson Out

వన్డే సిరీస్‌లో పర్వాలేదనిపించినా... టీ20 సిరీస్‌లో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. కరోనా వైరస్ కారణంగా కీలక ఆటగాళ్లు దూరం కావడంతో వైస్ కెప్టెన్‌గా, సీనియర్ ప్లేయర్‌గా లక్కీ ఛాన్స్ కొట్టేసిన సంజూ శాంసన్, ఆ అవకాశాన్ని ఏ మాత్రం ఉపయోగించుకోలేకపోయాడు...

2015లో భారత జట్టు తరుపున టీ20ల్లో ఎంట్రీ ఇచ్చిన సంజూ శాంసన్, వన్డేల్లో ఎంట్రీ కోసం ఆరేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. లంక టూర్‌కి ముందు ఏడు టీ20 మ్యాచులు ఆడిన సంజూ శాంసన్ 73 పరుగులు మాత్రమే చేశాడు...

సంజూ శాంసన్ బ్యాటింగ్‌పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు సల్మాన్ భట్, కమ్రాన్ అక్మల్ మండిపడ్డారు. ‘సంజూ శాంసన్‌ చాలా టాలెంటెడ్. అయితే ఆ టాలెంట్‌ను సరిగా వాడుకోవడం అతనికి తెలీదు...

ఎందుకంటే సంజూ ఓ లేజీ బ్యాట్స్‌మెన్. భారత బ్యాట్స్‌మెన్ స్పిన్‌ని చక్కగా ఆడగలరు. వికెట్ కీపర్లకు స్పిన్‌ బౌలర్ల బలహీనతలన్నీ తెలుస్తాయి. అయితే సంజూ శాంసన్ అవుటైన విధానం చూస్తుంటే ఎంత నిర్లక్ష్యంగా షాట్స్ ఆడుతున్నాడో తెలుస్తోంది...

రెండు వికెట్లు కోల్పోయినప్పుడు జాగ్రత్తగా ఆడాలనే ఆలోచనో, లేక ఏం ఆడతాం లే... అనే నిర్లక్ష్యమో అతనిలో కనిపించింది... అతనికి ఫ్యూచర్‌లో మళ్లీ ఇలాంటి ఛాన్స్ రావడం కష్టమే...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్...

పాక్ మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కమ్రాన్ అక్మల్ కూడా సంజూ శాంసన్ బ్యాటింగ్‌పై స్పందించాడు. ‘సంజూ శాంసన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత సంజూ శాంసన్ బాధ్యతాయుతంగా ఆడి మంచి స్కోరు అందిస్తాడని అందరూ భావించారు.

ఐపీఎల్‌లో మూడు సెంచరీలు చేసిన సంజూ శాంసన్‌కి దేశవాళీ క్రికెట్‌లోనూ మంచి అనుభవం ఉంది. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో అతని ఆటలో ఫోకస్ కనిపించడం లేదు...

ఐపీఎల్‌లో ఎంతో స్వేచ్ఛగా షాట్స్ ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించే సంజూ శాంసన్, ఇంటర్నేషనల్ క్రికెట్‌లో మాత్రం అలా చేయలేకపోతున్నాడు. అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి...’ అంటూ కామెంట్ చేశాడు కమ్రాన్ అక్మల్...
undefined
click me!