ఆ విషయంలో యువీయే టాప్... సచిన్, ధోనీ, సెహ్వాగ్, రోహిత్, విరాట్ అందరూ యువరాజ్ తర్వాతే...

First Published Jun 17, 2021, 10:51 AM IST

యువరాజ్ సింగ్ తన క్రికెట్ కెరీర్‌లో ఎవ్వరికీ సాధ్యంకాని ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. అత్యధిక సార్లు ఐసీసీ ఫైనల్స్ ఆడిన ప్లేయర్‌గా ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచాడు యువరాజ్ సింగ్. 24 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్ ఆడిన సచిన్ టెండూల్కర్ కంటే యువీ టాప్‌లో ఉండడం విశేషం.

2000వ సంవత్సరంలో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన యువరాజ్ సింగ్, 2017లో టీమిండియా తరుపున చివరి మ్యాచ్ ఆడాడు. తన 17 ఏళ్ల కెరీర్‌లో 8 ఐసీసీ ఫైనల్స్ ఆడాడు యువరాజ్ సింగ్.
undefined
అండర్19 వరల్డ్‌కప్ పర్ఫామెన్స్ కారణంగా 2000లో జరిగిన ఐసీసీ నాకౌట్‌ ట్రోఫీకి ఎంపికైన యువరాజ్ సింగ్, ఆ టోర్నీ క్వార్టర్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై 84 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు...
undefined
సెమీ ఫైనల్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 41 పరుగులు చేయడమే కాకుండా ఓ వికెట్ కూడా పడగొట్టిన యువరాజ్, న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో 14 పరుగులు చేశాడు. ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడింది టీమిండియా...
undefined
ఆ తర్వాత 2002 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాల్గొన్న యువరాజ్ సింగ్, 2003 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆడాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ 24 పరుగులు చేశాడు.
undefined
2007 వన్డే వరల్డ్‌కప్‌లో కూడా పాల్గొన్న యువరాజ్, అదే ఏడాది జరిగిన మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లతో రికార్డు సృష్టించిన యువీ 12 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు.
undefined
ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్‌లో 30 బంతుల్లో 70 పరుగులు చేసిన యువరాజ్ సింగ్, పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 14 పరుగులు చేసిన యువీ ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు అందుకున్నాడు.
undefined
2011 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలిచిన యువరాజ్ సింగ్, టోర్నీలో 300+ పరుగులు, 15 వికెట్లు తీసిన ఏకైక, మొట్టమొదటి ఆల్‌రౌండర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.
undefined
2014 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో 21 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసిన యువరాజ్ సింగ్, తన కెరీర్‌లో ఇదే అత్యంత చెత్త ప్రదర్శన అంటూ వివరించాడు...
undefined
యువరాజ్ సింగ్ మొత్తంగా 8 ఐసీసీ ఫైనల్స్‌తో టాప్‌లో ఉండగా శ్రీలంక మాజీ క్రికెటర్లు మహేళ జయవర్థనే, కుమార సంగర్కర, ముత్తయ్య మురళీధరన్, ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఆరేసి ఫైనల్స్‌తో రెండో స్థానంలో ఉన్నారు...
undefined
భారత జట్టు నుంచి మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, సచిన్ టెండూల్కర్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్... ఐదు సార్లు ఐసీసీ ఫైనల్ మ్యాచుల్లో పాల్గొన్నారు...
undefined
భారత ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్... నాలుగేసి సార్లు ఐసీసీ ఫైనల్స్ ఆడారు. కోహ్లీ, రోహిత్ శర్మ... ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో పాల్గొనడంతో ఈ లెక్క ఐదుకి చేరనుంది.
undefined
click me!