గెలిస్తే సరే, ఓడితే మనోళ్ల పరిస్థితి ఏంటి... ఆ లాంగ్ గ్యాప్‌లో దేశం కాని దేశంలో...

First Published Jun 17, 2021, 8:55 AM IST

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది టీమిండియా. ఇంగ్లాండ్‌లోని సౌంతిప్టన్ వేదికగా జూన్ 18న ఫైనల్ మ్యాచ్ ఆడనుంది భారత జట్టు. అయితే ఈ మ్యాచ్ విషయంలో ఓ సందేహం అభిమానులను కలిచి వేస్తోంది...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టోర్నీ ఆద్యంతం టాప్ క్లాస్ పర్ఫామెన్స్ చూపించింది టీమిండియా. టెస్టుల్లో తిరుగులేని విజయాలతో టోర్నీలో టేబుల్ టాపర్‌గా నిలిచి ఫైనల్‌కి అర్హత సాధించింది...
undefined
అయితే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టోర్నీలో భారత జట్టు ఓడిన ఏకైక టెస్టు సిరీస్ న్యూజిలాండ్‌పైనే. న్యూజిలాండ్‌లో న్యూజిలాండ్‌తో ఆడిన సిరీస్‌లో టీమిండియా రెండు టెస్టుల్లోనూ చిత్తుగా ఓడింది...
undefined
ఈ పరాభవం నుంచి తేరుకోవడానికి టీమిండియాకి చాలా సమయం పట్టింది. భారత జట్టులాగే, న్యూజిలాండ్ కూడా సొంత మైదానంలో చాలా పటిష్టమైన జట్టు...
undefined
కొన్నేళ్లుగా స్వదేశంలో జరిగిన ఏ టెస్టు సిరీస్‌లోనూ న్యూజిలాండ్‌కి ఓటమి ఎదురుకాలేదు. అయితే న్యూజిలాండ్ బయట జరిగిన సిరీసుల్లో మాత్రం ఆ జట్టు పర్ఫామెన్స్ పెద్దగా ఆకట్టుకునేలా ఉండేది కాదు....
undefined
అయితే ఇంగ్లాండ్ జట్టును ఇంగ్లాండ్‌లోనే ఓడించిన న్యూజిలాండ్... ఇప్పుడు బయట కూడా గెలవగలమని నిరూపించింది. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్ స్వీయ తప్పిదాలతో ఓడిందని ఒప్పుకోవాల్సిందే...
undefined
ఎందుకంటే బెన్ స్టోక్స్, బెయిర్ స్టో, బట్లర్, జోఫ్రా ఆర్చర్ వంటి టాప్ క్లాస్ ప్లేయర్లను పక్కనబెట్టి కొత్త కుర్రాళ్లతో బరిలో దిగిన ఇంగ్లాండ్ జట్టు, దానికి భారీ మూల్యం చెల్లించుకుంది...
undefined
ఇప్పుడు భారత జట్టు అభిమానులను వేధిస్తున్న ప్రశ్న ఒకటే... వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత జట్టు విజయం సాధిస్తే ఓకే... టీమ్ సభ్యుల్లో ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ఆ సక్సెస్‌ను ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆరంభమయ్యేదాకా ఎంజాయ్ చేస్తూ గడిపేస్తారు.
undefined
అదే ఓడితే... పరిస్థితి ఏంటి? దేశం కాని దేశంలో ఓటమి భారాన్ని మోస్తూ 42 రోజుల పాటు కాలం గడపాల్సి ఉంటుంది. ఇంతకుముందు అంటే ఎంత పెద్ద ఓటమి అయినా ఆటగాళ్లపై పెద్దగా ప్రభావం చూపేది కాదు. రెండు మూడు రోజుల పాటు బాధపడి, ఆ తర్వాత మరిచిపోయేవాళ్లు.
undefined
ఇప్పుడు అలా కాదు, సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగింది. మ్యాచ్ ఓడిపోతే, విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి అండ్ గ్యాంగ్‌ను ట్రోల్ చేయడానికి కొన్ని కోట్ల మంది సిద్ధంగా ఉన్నారు. ఆ ట్రోలింగ్‌ను ఎదుర్కుంటూ 42 రోజుల పాటు ఖాళీగా గడపాల్సి ఉంటుంది...
undefined
ఫైనల్ మ్యాచ్ తర్వాత వేరే సిరీస్ లేదా టూర్ ఆరంభం అయితే భారత జట్టు అభిమానులు, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఓటమిని మరిచిపోయేవాళ్లు. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు...
undefined
శిఖర్ ధావన్ కెప్టెన్సీలో మరో జట్టు శ్రీలంకలో పర్యటిస్తోంది. అక్కడ విరాట్ సేన ఓడి, ఇక్కడ ధావన్ టీమ్ గెలిస్తే... మళ్లీ ట్రోలర్స్, కోహ్లీ కెప్టెన్సీని ట్రోల్ చేయడం మొదలెడతారు. ఫైనల్‌లో విఫలమైన ప్రతీ ప్లేయర్‌ను విమర్శించడం ఆరంభిస్తారు.
undefined
అదీగాకుండా లంక టూర్‌కి రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా వ్యవహారిస్తుండడంతో ఇక్కడ సాధించిన ప్రతీ విజయం ఎఫెక్ట్, ఇంగ్లాండ్ టూర్‌లో కోచ్‌గా వ్యవహరిస్తున్న టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రిపై ట్రోల్స్ రూపంలో పడనుంది...
undefined
click me!