అప్పుడు ‘బ్లడీ ఇండియన్స్’ అన్నారు, ఇప్పుడు ఐపీఎల్ వల్ల బూట్లు నాకుతున్నారు... మాజీ క్రికెటర్ ఫరూక్ ఇంజనీర్

First Published Jun 10, 2021, 2:54 PM IST

8 ఏళ్ల క్రితం జాత్యాహంకార ట్వీట్ల కారణంగా క్రికెటర్ ఓల్లీ రాబిన్‌సన్‌పై నిషేధం విధించడంతో అతనిపై సానుభూతి పోస్టులు వస్తున్న విషయం తెలిసిందే. అయితే అతనికి సానుభూతి తెలుపుతున్నవారిపై తీవ్రంగా ఫైర్ అయ్యాడు భారత మాజీ క్రికెటర్, వికెట్ కీపర్ ఫరూక్ ఇంజనీర్...

‘జాతివివక్ష వ్యాఖ్యలు చేసినవారు ఎవ్వరైనా వారిని ఉపేక్షించడం సరికాదు. ఓల్లీ రాబిన్‌సన్‌పై నిషేధం వేటు వేస్తూ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం సరైనది. అతనిపై జీవితకాలం నిషేధం వేయాలని నేను అనడం లేదు. కానీ కఠిన శిక్ష విధించాలి.
undefined
అతనికి కఠినమైన శిక్షపడితేనే భవిష్యత్ తరాలు ఇలా మాట్లాడడానికి, సోషల్ మీడియాలో ఏది పడితే అది రాయడానికి భయపడతాయి. కాస్త బుద్ధిగా ఉండడం నేర్చుకుంటారు...
undefined
నేను నా క్రికెట్ కెరీర్‌లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. ముఖ్యంగా ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడేందుకు వెళ్లినప్పుడు, నా గురించి చాలా చులకనగా మాట్లాడేవారు. అంటే వ్యక్తిగా నా గురించి విమర్శలు వచ్చేవికావు, నేను ఇండియా వాడిని కావడం వల్లే వచ్చే కామెంట్లవి...
undefined
అతను ఇండియా నుంచి వచ్చాడా? అంటూ గుసగుసగా మాట్లాడుకునేవారు. నన్ను చూస్తూ నవ్వుకునేవారు. కౌంటీకి ఆడినప్పుడు కొన్నిసార్లు జాతివివక్ష వ్యాఖ్యలు కూడా ఎదుర్కొన్నా... ఇండియా వాళ్లంటే వాళ్లకున్న చులకన భావం అది...
undefined
కాని నేను ఇంగ్లీష్‌లో అద్భుతంగా మాట్లాడగలనని తెలిసి చాలామంది భయపడేవారు. ఎవరైనా కామెంట్ చేస్తే అదే స్టైల్‌లో నేను సమాధానం చెప్పేవాడిని. బ్యాటింగ్, కీపింగ్ కూడా అదరగొట్టేవాడిని. దాంతో నన్ను విమర్శించడానికి వాళ్లకి అవకాశం లేకపోయింది.
undefined
ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ జెఫ్రీ బాయ్‌కాట్ అయితే తరుచూ ‘బ్లడీఇండియన్స్’ అని తిడుతుండేవాడు. అది ఒక్క క్రికెటర్‌ని ఉద్దేశించి కాదు, మనదేశ ప్రజల గురించి అతనికి ఉన్న ఆలోచనా విధానం అలాంటిది. అతనే కాదు, ఆస్ట్రేలియా క్రికెటర్లు కూడా ఇలాంటి ఆలోచనతోనే ఉండేవారు...
undefined
జాత్యాహంకారం నిలువెల్లా పాతుకుపోయిన క్రికెటర్లు వాళ్లు. ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ వల్ల వారికి కాసుల వర్షం కురుస్తోంది. అందుకే ఒకప్పుడు ‘బ్లడీ ఇండియన్స్’ అన్నవాళ్లు కూడా ఇప్పుడు ఐపీఎల్ వల్ల భారతీయుల బూట్లు నాకడానికి కూడా రెడీ అవుతున్నారు...
undefined
వారి అసలు రంగు ఏంటో నాకు బాగా తెలుసు. ఇప్పుడు వాళ్లు మారారు. ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. అయితే మళ్లీ పాత పరిస్థితులు రాకూడదంటే జాతి వివక్ష చూపించినవారిపై కఠినంగా వ్యవహరించాలి...
undefined
ఎవరైనా అలాంటి కామెంట్లు, ట్వీట్లు కానీ చేసినట్టు నిరూపితమైతే ఆ క్రికెటర్‌కి భారీగా జరిమానా విధించాలి. అలాగే కొన్నాళ్ల పాటు క్రికెట్ నుంచి నిషేధించాలి... అలా చేస్తేనే బుద్దిగా ఉంటారు...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్ ఫరూక్ ఇంజనీర్.
undefined
ఓల్లీ రాబిన్‌సన్‌ను ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు నుంచి నిషేధించిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు, ఇతర క్రికెటర్లు చేసిన ట్వీట్లు, సోషల్ మీడియా పోస్టులపై కూడా దృష్టి పెడతామని స్పష్టం చేసింది...
undefined
ఇంగ్లాండ్ స్పిన్నర్ డామ్ బెస్, ధోనీపై చేసిన ట్వీట్ వైరల్ కావడంతో అతను ట్విట్టర్ ఖాతానే డిలీట్ చేయగా భారత క్రికెట్ ఫ్యాన్స్‌ను చులకనగా మాట్లాడుతూ ఇంగ్లాండ్ క్రికెటర్లు ఇయాన్ మోర్గాన్, జోస్ బట్లర్ వేసిన ట్వీట్లు వైరల్‌గా మారాయి. వీటిపై దర్యప్తు చేస్తున్నట్టు పేర్కొంది ఈసీబీ.
undefined
click me!